news
stringlengths
299
12.4k
class
class label
3 classes
internet vaartha 123 Views న్యూఢిల్లీ : ఆహార ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లుధరలు పెరగడంతో టోకుధరల సూచి ద్రవ్యోల్బణం 1.62శాతానికి పెరిగింది. జూన్‌నెల గణాంకాలు మేనెలో పోలిస్తే రెట్టింపు పెరిగినట్లు కని పిస్తోంది. మేనెలలో గణాంకాలు కేవలం 0.79శాతం మాత్రమే ఉన్నాయి. రిటైల్‌ ధరలసూచి ద్రవ్యోల్బ ణం కూడా 22 నెలల గరిష్టస్థాయికి చేరింది. జూన్‌ నెలలో 5.77శాతం నమోదయిన సంగతి తెలిసిందే. రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లపై యధాతధ స్థితిని కొనసాగిస్తుందన్న అంచనాలున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం చూస్తే జూన్‌లో 7.88శాతంనుంచి 8.18శాతా నికి పెరిగింది. గురువారం విడుదలయిన ఈ అధికారిక గణాంకాలు ఆహారద్రవ్యోల్బణాన్ని మరింత పెంచినట్లయింది. ఏప్రిల్‌నెలలో 4.70 శాతంగాఉంది. మార్చినెలలో 4.09శాతం ఉన్న ఈ ద్రవ్యోల్బణం ఫిబ్రవరినెలలో 3.91శాతంగా ఉంది. అదే జూన్‌నెలకు వచ్చేసరికి 8.18శాతం గా పెరిగింది. ఇక కూరగాయల ధరలు చూస్తే మరింత ప్రియంఅయ్యాయి. జూన్‌లో 16.91 శాతంపెరిగాయి. మేనెలలో 12.94శాతంగా ఉన్నాయి. కూరగాయలధరల్లో 2.90శాతంగా ఉంది. కూరగాయలు, ఆలుగడ్డలపరంగా ధరలు 64.48శాతం పెరిగాయి. అంతకుముందు 60.01శాతంమాత్రమే ఉన్నాయి. పండ్ల ధరలు 3.8 శాతంనుంచి 5ఒక్కసారిగా 5.97శాతానికి పెరిగాయి. గడచిన నాలుగునెలల్లో ఒక్కసారిగా గరిష్టస్థాయికి పెరిగాయి. గోధుమల ధరలు కూడా 3.85శాతంనుంచి 6.83శాతానికి చేరాయి.పెట్రోలుధరలు కొంత మేరక్షీణించాయి. డీజిల్‌ ధరలు కొంతమేర పెరిగింది. మేనెలలో 5.01శాతం ఉన్న పెట్రోలుధరలు 1.13 శాతానికి చేరింది. ఇక శుద్ధిచేసిన ఆహారోత్పత్తులధరలు ఉత్పత్తిరంగ ద్రవ్యోల్బణాన్ని 0.91శాతం నుంచి 1.17శాతానికి పెంచాయి. ఇక చక్కెరధరలపరంగా 22.30శాతం నుంచి 26.09శాతానికి పెరిగింది.
1entertainment
Gayatri సింగిల్స్‌ టైటిల్‌తో మెరిసిన  పుల్లెల గోపీిచంద్‌ తనయ తిరువనంతపురం: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటెన్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి బ్యాడ్మింటెన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ తనయ పుల్లెల గాయత్రి టైటిల్‌తో మెరిసింది. అండర్‌-17 బాలికలల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గాయత్రి 21-12, 21-23, 21-6తో చత్తీస్‌గడ్‌కు చెందిన టాప్‌సీడ్‌ ఆకర్షి కశ్యప్‌పై విజయం సాధించింది. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ తనయ గాయత్రికి ఒక్క రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఇందులోనూ పోరాడినప్పటికీ ఆకర్షి దూకుడుకు తలవంచింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభం నుంచే చెలరేగింది. దీంతో టాప్‌ సీడ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అండన్‌-17 బాలికల టైటిల్‌ను సాహితి బండి(తెలంగాణ)-వర్షిణి(తమిళనాడు) జోడి గెలుచుకుంది. ఫైనల్లో ఈ మూడో సీడ్‌ జోడీ 21-15, 10-21, 21-17తో కెయూర మొపతి-కవి ప్రియ(తెలంగాణ) జంటను ఓడించింది. అండర్‌-17 బాలుర సింగిల్స్‌ తుదిపోరులో టాప్‌సీడ్‌ మైస్నమ్‌ మిరబా 21-12, 21-12తో ధ్రువ్‌ రావత్‌పై నెగ్గాడు. డబుల్స్‌ ఫైనల్లో యశ్‌-ధ్రువ్‌ రావత్‌ 21-14, 10-21, 21-13తో ఎడ్విన్‌ జా§్‌ు-అరవింద్‌ సురేశ్‌ జంటపై నెగ్గింది. అండర్‌-19 డబుల్స్‌ ఫైనల్లో రాహుల్‌ భరద్వాజ్‌ 21-15, 21-14తో టాప్‌ సీడ్‌ కార్తికే§్‌ు కుమార్‌కు షాకిచ్చాడు. అండర్‌-19 బాలికల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో పూర్వ బర్వే 27-25, 21-13తో అశ్విని భట్‌పై డబుల్స్‌లో మిథుల-రుతపర్ణపండ 21-14, 21-18తో అశ్విన్‌ భట్‌-అపేక్ష నాయక్‌ జంటపై, అండర్‌-19 బాలుర డబుల్స్‌లో సంజ§్‌ు -సిద్దార్థ్‌ 15-21, 21-12, 21-18తో సౌరబ్‌-రామ్‌బియా దీవ్‌లపై విజయం సాధించారు. ======
2sports
Apr 01,2015 ఆభరణాల ఆన్‌లైన్‌ వ్యాపారంలోకి తమన్నా               హైదరాబాద్‌ : ప్రముఖ సినీనటి తమన్నా ఆభరణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో తన తండ్రి సంతోష్‌ భాటియాతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే పసిడి ఆభరణాల షాపింగ్‌ వేదిక వైట్‌అండ్‌గోల్డ్‌.కమ్‌ను ప్రారంభించనున్నామని చెప్పారు. ఏప్రిల్‌ 20 అక్షయ తృతీయ రోజు ఈ వెబ్‌సైట్‌ను అధికారికంగా ప్రకటించనున్నామన్నారు. వెబ్‌సైట్‌ వ్యస్థాపకుడు సంతోష్‌ బాటియా మాట్లాడుతూ వినియోగదారుడికి అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఆభరణాలు అందించడానికి వైట్‌అండ్‌గోల్డ్‌.కమ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jul 13,2017 ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా గార్గ్‌ న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) నూతన కార్యదర్శిగా సీనియర్‌ బ్యూరోక్రాట్‌ సుభాష్‌ చంద్ర గార్గ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న శక్తికాంత్‌దాస్‌ మే 31న పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో గార్గ్‌ను సర్కారు నియమించింది. 1983వ బ్యాచ్‌నకు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ డీఈఏ కార్యదర్శిగా రాక ముందు దక్షిణాసియా దేశాలైన భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంకకు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
India vs South Africa: రోహిత్ శర్మకి కొత్త బ్యాటింగ్‌ కోచ్ సపోర్ట్ Samayam Telugu| Sep 17, 2019, 04.34 PM IST India's Rohit Sharma celebrates after scoring a century during the Cricket Worl... భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి టీమిండియా కొత్త బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్ అండగా నిలిచాడు. వన్డే, టీ20ల్లో అగ్రశ్రేణి ఓపెనర్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మకి టెస్టుల్లో కనీసం చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన విక్రమ్.. ఇకపై టెస్టుల్లోనూ ఓపెనర్‌గా రోహిత్‌ని ఆడించబోతున్నట్లు స్పష్టం చేశాడు. Read More: రిషబ్ పంత్‌కి ఆఖరి ఛాన్స్..! నెక్ట్స్ ఎవరు..? దక్షిణాఫ్రికాతో అక్టోబరు 2 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇటీవల జట్టుని ప్రకటించిన సెలక్టర్లు రోహిత్ శర్మ‌‌ని ఓపెనర్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టెస్టుల్లో ఇప్పటి వరకూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ వచ్చిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారత బ్యాటింగ్ కోచ్‌గా ఇటీవల నియమితుడైన విక్రమ్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ ‘వన్డే, టీ20ల్లో తిరుగులేని ఓపెనర్‌గా ఉన్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో ఎందుకు ఓపెనర్‌గా రాణించలేడు..? అందుకే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో అవకాశం కల్పిస్తాం. రోహిత్ చాలా అద్భుతమైన ఆటగాడు. టెస్టుల్లో అతను ఓపెనర్‌గా రాణిస్తే..? టీమ్‌కి అదనపు బలం చేకూరుతుంది’ అని వెల్లడించాడు. Read More: ధోనీ సైలెన్స్.. ఇక కోహ్లీనే తేల్చాలి కెరీర్‌లో ఇప్పటి వరకూ 218 వన్డేలాడిన రోహిత్ శర్మ 48.53 సగటుతో 8,686 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 27 శతకాలు, 42 అర్ధశతకాలు ఉన్నాయి. కానీ.. 27 టెస్టులు ఆడిన రోహిత్ 39.62 సగటుతో చేసిన పరుగులు 1,585 మాత్రమే. ఇందులో మూడు శతకాలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య గత ఆదివారం ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. బుధవారం రాత్రి మొహాలి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఆదివారం బెంగళూరులో మూడో టీ20 ముగిసిన తర్వాత టెస్టు సిరీస్ ప్రారంభకానుంది.
2sports
Gas రూ.10లక్షలు దాటితే సబ్సిడీ కట్‌ న్యూఢిల్లీ, డిసెంబరు 20: పదిలక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లింపుదారుల ఎల్‌పిజి గణాంకాలవివరాలు అంద చేయాలని ఆదాయపు పన్నుశాఖ పెట్రోలియం మంత్రిత్వశాఖకు లేఖాలు రాయడంతో మరో కొత్త విధానం ప్రారంభం అవు తున్నదన్న అందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల అందరి వివరాలను తెలుసుకునేందుకు వారి వార్షిక ఆదాయం పదిలక్షలు దాటి ఉన్న వారి వివ రాలను సేకరించేందుకు ఆదాయపు పన్నుశాఖ చమురు మంత్రిత్వశాఖతో జట్టుకడుతోంది. అలాగే సంపన్నులకు సబ్సిడీ వెళ్లకుండా కట్టడిచేసే కార్యాచరణకు కూడా ఇది వీలవుతుందని చమురుమంత్రిత్వశాఖ భావిస్తోంది వార్షిక ఆదాయం రూ.10 లక్షలుపైబడి, సబ్సిడీ గ్యాస్‌ పొందుతున్న వారి వివరాలను ముందుగా సేకరించి వారి పాన్‌నంబర్ల సాయంతో వీటిని క్రోడీకరించాలని నిర్ణయించింది. పుట్టినదేదీ, మహిళలు, పురుషులు వంటి వాటితోపాటు మొత్తం అన్ని వివరాలను సేకరించాలని వీటిని ఐటి డేటాబేస్‌లో ఉన్నవాటితో సరిపోలుస్తుందని అంచనా. ఇందుకు సంబంధించి త్వరలోనే ఐటిశాఖ చమురుమంత్రిత్వశాఖతో ఎంఒయు చేసుకుంటున్నది. అంతేకాకుండా వ్యక్తుల ఇమెయిల్‌ ఐడిలు, నివాస ఫోన్‌, మొబైల్‌ నంబర్లను కూడా సేకరిస్తున్నది.ఈకార్యాచరణకు కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం వార్షిక ఆదాయం పదిలక్షలకుపైబడిన వారికి వంటగ్యాస్‌ సబ్సిడీ అమలును నిలిపివేస్తామని ప్రకటించిన సంగతితెలిసిందే. పదిలక్షలకుపైబడి ఉన్న వారి వివరాలు ఈ జాబితాలో ఉంటే రెండుశాఖలు చేపట్టే కార్యాచరణ తో వాటికవే సబ్సిడీ జాబితానుంచి వైదొలుగుతాయి. ఇప్పటికే కొం దరు ప్రముఖులు స్వచ్ఛందంగా వారి సబ్సిడీని ఉపసంహరించు కున్నట్లు లేఖలు ఇచ్చారు. అయితే అత్యధికశాతం ఇప్పటికీ సబ్సిడీ ని పొందుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఈతరహా అవక తవకలను నివారించి పదిలక్షల వార్షికపరిమితి మించి ఉన్నవారికి సబ్సిడీని నిలిపివేసేందుకు నిర్ణయిం చింది. ప్రస్తుతంఅన్ని కుటుంబాలు 14.2 కిలో ల సిలిండర్లు ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీ రేట్లకు పొందే అవకాశంఉంది. ఇప్పటికే ప్రభు త్వం పలుపర్యాయాలు సంపన్న కుటుం బాలు, అత్యధిక వేతనం పొందే కుటుంబాల ను వారి సబ్సిడీగ్యాస్‌ను వదులుకోవాలని విజ్ఞప్తులుచేసి మార్కెట్‌ధరకు కొనుగోలుచేస్తే ఈ సబ్సిడీ మరికొందరు నిరుపేదలకు అమలుచేస్తామంటూ పలు ప్రకటనలు జారీచేసింది. గతఏడాదే ప్రభుత్వం ఎవరైనా భర్త కానీ, భార్యకానీ వార్షిక ఆదాయం 10లక్షల రూపాయలకుపైబడితే వారికి ఎల్‌పిజి సబ్సిడీ నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించింది. ఆనిర్ణయం ఇపుడు అమలులోకి తెస్తున్నది. ఇందుకోసం రెండుశాఖల మధ్య ఒడం బడిక జరిగిన తర్వాత నుంచి కార్యాచరణ మొదలవుతుందని అంచనా.
1entertainment
Hyderabad, First Published 27, Jun 2019, 5:02 PM IST Highlights క్రేజీ హీరో రానా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో ప్రతినాయకుడిగా నటించినప్పటికీ రానాకు ప్రశంసలు దక్కాయి. క్రేజీ హీరో రానా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో ప్రతినాయకుడిగా నటించినప్పటికీ రానాకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం రానా భారీ చిత్రాల్లో నటించబోతున్నాడు. విరాటపర్వం, హిరణ్యకశ్యప లాంటి భారీ ప్రాజెక్ట్స్ రానా కోసం ఎదురుచూస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర కాంబినేషన్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  రానాతో శృతి హాసన్ క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో శృతి హాసన్, రానా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. మరో సెల్ఫీలో శృతి హాసన్, రానాతో పాటు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి కూడా ఉండడం ఆసక్తిని రేపుతోంది.  రాఘవేంద్ర రావు తనయుడిగా ప్రకాష్ దర్శకుడిగా పరిచయం అన్నారు. ప్రకాష్ తెరకెక్కించిన అనగనగా ఓ ధీరుడు చిత్రం ద్వారా శృతి హాసన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. దీనితో రానా, ప్రకాష్, శృతి హాసన్ కలయికపై ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆసక్తికర కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  Last Updated 27, Jun 2019, 5:02 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రెండో పెళ్లికి నేను రెడీ అంటోంది! దర్శకుడు విజయ్‌తో ప్రేమాయణం, పెళ్లి చేసుకోవడం అంతా సినిమాల్లో మాదిరి చకచకా చేసేసింది హీరోయిన్ అమలాపాల్. TNN | Updated: Aug 15, 2017, 08:50PM IST దర్శకుడు విజయ్‌తో ప్రేమాయణం, పెళ్లి చేసుకోవడం అంతా సినిమాల్లో మాదిరి చకచకా చేసేసింది హీరోయిన్ అమలాపాల్. అయితే ఆ బంధం విడిపోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇద్దరూ కూడా ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తరువాత ఏ ఒక్కరోజు కూడా ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడలేదు. ఇటీవల అమలాపాల్ ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరి వివాహం, తెగదెంపులు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొందరు పెద్దల జోక్యం కారణంగానే తాము విడిపోయామని, అంతా మంచికే జరిగిందని అన్నారు. అలానే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా..? అనే ప్రశ్నకు తప్పకుండా చేసుకుంటానని బదులిచ్చింది అమలాపాల్. 'నా జీవితాన్ని ఒంటరిగా గడపడానికి నేను సిద్ధంగా లేను. జీవితంలో ఒకరి తోడు మరొకరికి అవసరం. ఈసారి చేసిన తప్పు చేయకూడదు. జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తిని వెదుక్కోవాలి. రెండో పెళ్లి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ అది ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్పలేను' అని వెల్లడించారు. సో.. అమలాపాల్ రెండో పెళ్ళికి సిద్ధంగా ఉందన్నమాట.
0business
మెగాబ్రాండ్ కూడా వర్కవుట్ కావడం లేదే.. Highlights వెబ్ సిరీస్ గా మొదలుపెట్టిన ఆమె 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాగా టర్న్ తీసుకుంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ లేదనే చెప్పాలి. మెగాడాటర్ నీహారిక రెండేళ్ల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె అరంగేట్రంలో చాలా విమర్శలు ఎదుర్కొంది. మెగాభిమానులు ఆమెను హీరోయిన్ గా వొద్దని నాగబాబుని వారించారు కూడా.. కానీ నీహారిక మాత్రం 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో అమ్మడు రెండేళ్ల పాటు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కూతురు హీరోయిన్ గా పరిచయమైతే ఎలాంటి సమస్య ఉండదు. హీరోయిన్ గా వారికి ప్రేక్షకులు మంచి సపోర్ట్ ఇస్తారు. కానీ టాలీవుడ్ లో పరిస్థితి వేరు. ఇక్కడి హీరోలు కూడా వారితో నటించడానికి సందేహిస్తారు. ఈ క్రమంలో నీహారిక కూడా రెండో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంది. వెబ్ సిరీస్ గా మొదలుపెట్టిన ఆమె 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాగా టర్న్ తీసుకుంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ లేదనే చెప్పాలి. ప్రీరిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ వచ్చినా.. మిగిలిన మెగాహీరోలు సోషల్ మీడియాలో సినిమాకు సపోర్ట్ చేస్తున్నా.. సినిమాకు కావాల్సినంత బజ్ మాత్రం క్రియేట్ చేయలేకపోతున్నారు. 'సాక్ష్యం' సినిమా కూడా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుండడంతో 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాను పట్టించుకునేవారు పెద్దగా కనిపించడం లేదు. కనీసం మెగాబ్రాండ్ కూడా ఈ సినిమాకు వర్కవుట్ కావడం లేదని ఇన్సైడ్ వర్గాల టాక్. మరి సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!
0business
రెండవ వన్డేలో నమోదైన రికార్డులివే   కటక్‌: ఇంగ్లండ్‌పై కటక్‌లోని భారమతి స్టేడియంలో రెండవ వన్డేలో టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసు కుంది.మొదట టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు కోహ్లీ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిం డియాను యువరాజ్‌, ధోనిల జోడి ఆదుకుంది. వీరిద్దరు నాలుగవ వికెట్‌కు 256పరుగుల భాగ స్వామ్యాన్ని నెలకొల్పాడు. 150 పరుగులు వ్యక్తి గత స్కోరు వద్ద యువరాజ్‌ వోక్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ధోని సైతం 106 బం తుల్లో 9 బౌండరీలు,3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు.2011లో చివరిసారిగా వరల్డ్‌ కప్‌లో సెంచరీ సాధించిన యువరాజ్‌ మళ్లీ ఆరు సంవ త్సరాల తరువాత సెంచరీ సాధించడం విశేషం.ఇక ధోని కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు.వీరిద్దరి విభృంభనతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లను కోల్పోయి 381 పరుగులు చేసింది. అనంతరం 382 పరుగుల టార్గెట్‌తోబరిలోకిదిగిన ఇంగ్లండ్‌ 8వికెట్లను కోల్పో యి 366 పరుగులు చేసింది. ఈ వన్డేలో టీమిం డియాఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేశారు. ఆరు సంవత్సరాల తరు వాత యువరాజ్‌ సెంచరీ 2011 వరల్డ్‌ కప్‌ తరువాత యువరాజ్‌ సెంచరీ సాధించాడు. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం యువరాజ్‌ సెంచరీ చేశాడు.యువరాజ్‌కి తన కెరీర్‌లో ఇది 14వ సెంచరీ.ఆ తరువాత 17 ఇన్నిం గ్స్‌ల్లో అతని సగటు 18.32 మాత్రమే.2011 వరల్డ్‌ కప్‌ తరువాత కటక్‌లో యువరాజ్‌ సెంచరీ చేశాడు.కటక్‌ వన్డేలో ధోని 134 పరుగులతో సెం చరీ సాధించాడు.ధోనికి ఈ సెంచరీ పదో సెంచరీ కావడం విశేషం. నాలుగవ వన్డేకు అత్యధిక భాగ స్వామ్యాన్ని యువరాజ్‌,ధోని సాధించిన సంగతి తెలిసిందే.నాలుగవ వికెట్‌కు యువరాజ్‌,ధోని జోడి 256 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.వన్డే చరిత్రలో ఇంగ్లండ్‌పై ఇదే నాలుగవ వికెట్‌కు రెండవ అత్యుత్తమం.1998లో జడేజా,అజహరు ద్దీన్‌పై అజేయంగా 275 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కటక్‌ వన్డేలో 200 సిక్సర్ల బాదిన భారత క్రికెటర్‌గా ధోని అరుదైన గుర్తింపు పొం దాడు.వన్డేల్లో భారత తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటికే కొనసాగుతున్న ధోని తన రికార్డును మరింతగా మెరుగుపర్చుకున్నాడు. రెండవ వన్డేలో ధోని 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.48 ఓవర్లలో ప్లంకెట్‌ ధోని మూడు సిక్సర్లు కొట్టడంతో ఈ ఘనతను సాధిం చాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌పై టీమిండి యాకు ఇది వరుసగా అయిదవ వన్డే సిరీస్‌ విజయం. భారత్‌ పర్య టనలో భారత్‌పై ఇంగ్లండ్‌ ఒకే ఒకసారి 1984-85లో గెలిచింది. కోహ్లీకి యువరాజ్‌ కృతజ్ఞతలు తనపై నమ్మకం ఉంచినందుకు టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకి యువరాజ్‌ థ్యాంక్స్‌ తెలిపాడు.కటక్‌లోని బారామతి స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ లో యువరాజ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నిం గ్స్‌ ఆడాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లా డిన యువరాజ్‌ కోహ్లీ తనపై నమ్మకం ఉంచినం దుకు కృతజ్ఞతలు తెలియజేశాడు.కెప్టెన్‌గా తనలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడని,డ్రెస్సింగ్‌ రూమ్‌లోని ఆటగాళ్లు తనపై ఉంచిన నమ్మకం తనకు ఎంతో ముఖ్యమని వివరించాడు.రంజీ సీజన్‌లో తన బ్యాటింగ్‌ ప్రదర్శనపై యువరాజ్‌ సంతృప్తిని వ్యక్తం చేశాడు.రెండవ వన్డేలో ధోనికి,తనకి మధ్య చక్కటి అవగాహణ కుదిరిందన్నాడు.ఈ మ్యాచ్‌లో ఎప్పటి కప్పుడు చర్చించుకుంటూ ఆడామని మొదట 50 పరుగుల భాగస్వామ్యం చేయాలని అనుకున్నామని యువరాజ్‌ పేర్కొన్నాడు. అది సాధించాక 100 పరుగుల భాగస్వామ్యంపై దృష్టిసారించామన్నాడు. ఆ తరువాతే అదే జోరు కొనసాగిస్తూ సెంచరీలు చేశామని,గతంలో మేం ఎన్నో మ్యాచ్‌లను గెలిపిం చామని యువరాజ్‌ పేర్కొన్నాడు.తాను బౌండరీలు సాధించడాన్ని గమనించిన ధోని స్ట్రయిక్‌ రోటేట్‌ చేశాడని ఇదే టీమిండియా భారీ స్కోరు చేయడా నికి ఉపయో గపడిందన్నాడు.ముఖ్యంగా కటక్‌ వన్డేలో ధోని నన్ను ప్రోత్సహిస్తూ ఆత్మవిశ్వాసం కలిగించాడని యువరాజ్‌ పేర్కొన్నాడు.కటక్‌ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. జనవరి 22 ఆదివారం జరుగనున్న మూడవ వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే ఆలోచనలో టీమిండియా ఉంది. చివరలో కోహ్లీ ఒత్తిడి 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యువరాజ్‌,ధోనిల జోడి ఆదు కుంది. వీరిద్దరూ నాలుగవ వికెట్‌కు 256 పరు గుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.150 పరగులు వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్‌ వోక్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దోని సైతం 160 బం తులు ఆడి 9 బౌండరీలు,3 సిక్సర్లతో 100 పరు గులు పూర్తి చేశాడు.2011లో చివరిసారి వరల్డ్‌ కప్‌లో సెంచరీ సాధించిన యువరాజ్‌ మళ్లీ ఆరు సం వత్సరాల తరువాత సెంచరీ సాధించడం విశేషం.ఇక ధోని కూడా 213లో ఆస్ట్రేలియాపై చివరి సారి సెంచరీ చేశాడు. క్యాన్సర్‌ చిన్నారులతో గడిపిన యువరాజ్‌ టీమిండియా ఆటగాడు యువరాజ్‌ శుక్రవారం క్యాన్సర్‌ బాధిత చిన్నారులను కలిశారు.ఇంగ్లండ్‌తో జరిగిన రెండవ వన్డేలో కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన యువరాజ్‌ మ్యాచ్‌ తరువాత కటక్‌లోని ఒక క్యాన్సర్‌ ఆసుపత్రికి వెళ్లాడు.అక్కడున్న క్యాన్సర్‌ బాధిత చిన్నారులతో యువరాజ్‌ కొంత సమ యాన్ని గడిపాడు.ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా గడిపిన యువరాజ్‌ వారితో ఫోటోలు దిగాడు.తమ అభిమాన క్రికెటర్‌ను కలవడం పట్ల చిన్నారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2011 వరల్డ్‌ కప్‌ అనంతరం యువరాజ్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాడు. అయితే కీమోథెరపీ సాయంతో ఆ మహ మ్మారిని జయించిన సంగతి తెలిసిందే.ఆ పోరాటం తరువాత యువరాజ్‌ యువీ కన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి క్యాన్సర్‌ బాధితుల కు సాయం చేస్తు న్నాడు. అందులో భాగం గానే మ్యాచ్‌ ముగిసిన తరువాత యువరాజ్‌ ఆ ఆసు పత్రికి వెళ్లాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌,ఇంగ్లండ్‌ జట్ల మధ్య కటక్‌లో రెండవ వన్డే జరి గింది. ఈ వన్డేలో టీమిండియా ఘన విజయంసాధిం చింది. ఈ సిరీస్‌లో ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలుం డగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.కటక్‌ వన్డేలో యువరాజ్‌ చెలరేేగి 14వ సెంచరీ చేయడం విశేషం. ఇక సిరీస్‌లో చివరిదైన మూడవ వన్డే ఆదివారం కోల్‌కతాలో జరుగనుంది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సానియాకు ఖేల్‌రత్నపై స్టే సానియా మిర్జాకు ఖేల్‌రత్న ఇవ్వడంపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది TNN | Updated: Aug 26, 2015, 04:37PM IST హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు ఖేల్‌రత్న ఇవ్వడంపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. తాము స్టే ఎత్తేసేవరకూ ఆమెకు ఖేల్‌రత్న ఇవ్వరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు చేసింది. పారాలింపిక్ అథ్లెట్ హెచ్‌ ఎన్ గిరిశ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.. కర్ణాటకకు చెందిన గిరీశ 2012 సమ్మర్ పారా ఒలంపిక్స్ లో వెండి పతకం సాధించాడు. పారా ఒలంపిక్స్ లో వెండిపతకం సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఆయనకు 2013లో ఫద్మశ్రీ ఇచ్చారు. 2011-2014 మధ్య సానియా మిర్జా ఏ మెడల్ కూడా గెలవలేదని గిరీశ ఆరోపించారు. నిబంధనల ప్రకారం తనకు 90 పాయింట్లు ఉన్నాయని, తనకే ఖేల్‌రత్న ఇవ్వాలని గిరీశ డిమాండ్ చేస్తున్నారు.
2sports
internet vaartha 150 Views బెంగళూరు : టీమిండియా టెస్టు కెప్టెన్‌ కోహ్లీలోని దూకుడును తాను ఎన్నటికి అడ్డుకోనని టీమిండియా ప్రధాన కోచ్‌ కుంబ్లే స్పష్టం చేశాడు.కోహ్లీకి సహజసిద్దంగా లభించిన దూకుడు అంటే తనకు కూడా చాలా ఇష్టమన్నాడు. నాకు కోహ్లీలో దూకుడు అంటే ఇష్టం,నేను కూడా నా వరకు దూకుడుగానే ఉంటా, కొంత మందికి సహజ సిద్దంగా లభించింది ఏదో ఒకటి ఉంటుంది, ఆటగాళ్లలో ఉన్న వారి సహజత్వాన్ని నేను ఎప్పటికి అడ్డుకోను,కోహ్లీలో నాకు నచ్చింది అతని దూకుడే అని కుంబ్లే పేర్కొన్నాడు.కాగా మరో రెండు రోజుల్లో వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా బయలదేరనుంది.దీనిలో భాగంగా సోమవారం బెంగళూరులో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కుంబ్లే,కోహ్లీ మాట్లాడారు. మొదట కోహ్లీ నాయకత్వంపై కుంబ్లే విశ్వాసం వ్యక్తం చేశాడు.అతని కెప్టెన్సీలో టీమిండియా మరిన్ని విజయాలను సాధిస్తుందన్న కుంబ్లే తమకు విండీస్‌ పర్యటన ఒక సవాల్‌ అని పేర్కొన్నాడు.ఆ తరువాత కోహ్లీ మాట్లాడుతూ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాడు ఉండటం నిజంగా జట్టు అదృష్టమన్నాడు. అతని కున్న విశేషమైన అనుభవం ఖచ్చితంగా జట్టుకు లాభం చేకూరుస్తుందన్నాడు.ప్రస్తుత విండీస్‌ పర్యటనలో తొలి అంతర్జాతీయ సవాల్‌కు కుంబ్లే సిద్దమయ్యాడని కోహ్లీ పేర్కొన్నాడు.ఈ సిరీస్‌ను దిగ్విజయంగా ముగించి తిరిగిరావడమే తమ ముందున్న టార్గెట్‌ అని కోహ్లీ వివరించాడు.విండీస్‌ పర్యటనలో భారత్‌ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.జులై 21 నుంచి 25 వరకు అంటిగ్వాలో తొలి టెస్టు,జులై 30 నుంచి ఆగస్టు 3 వరకు జమైకాలో రెండవ టెస్టు నిర్వహించనున్నారు. మూడవ టెస్ట్‌ ఆగస్టు 9 నుంచి 13 వరకు సెయింట్‌ లూసియాలో,నాలుగవ టెస్టు ఆగస్టు 18 నుంచి 22 వరకు ట్రినిడాడ్‌లో జరుగుతాయి. రోడ్‌మ్యాప్‌ సమావేశం రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌ ప్రణాళికలు పర్యటనల గురించి రోడ్‌ మ్యాప్‌ సమావేశం జరిగింది.కొత్త కోచ్‌ కుంబ్లే,ఏ జట్టు కోచ్‌ ద్రవిడ్‌,చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌,క్రికెట్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఎంవి శ్రీధర్‌లతో పాటు భారత టెస్టు కెప్టెన్‌ కోహ్లీ,వన్డే,టి20 కప్టెన్‌ ధోనీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పస్ట్‌ క్లాస్‌ నుంచి ఏ స్థాయి క్రికెట్‌ ఆ తరువాత సీనియర్‌ స్థాయి వరకు కొంత క్యాప్‌ ఉందని, దీనిపై మార్చాల్సిన అవరసం ఉందని అభిప్రాయం వ్యక్తమైంది.కఠినమైన సీజన్‌ ముందుండటంతో పాస్ట్‌ బౌలర్లను రోటేట్‌ చేస్తూ వారిని గాయల బారి నుంచి కాపాడటంపై కూడా చర్చ జరిగింది.
2sports
అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ First Published 5, Jan 2017, 8:51 AM IST అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ మీట్ గ్యాలరీ Recent Stories
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV చైనా బాహుబలి రెడీ అయ్యాడు.. బాహుబలి చిత్రం త్వరలో చైనాలో విడుదల కాబోతోంది. TNN | Updated: Feb 12, 2016, 09:22PM IST చైనా బాహుబలి రెడీ అయ్యాడు.. దేశీయంగా సంచలనం సృష్టించిన రాజమౌళి బాహుబలి చిత్రం అంతర్జాతీయంగా కూడా తన సత్తా నిరూపించుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని త్వరలో చైనాలో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి శుక్రవారం నాడు తెలిపారు. ఈ చిత్రానిసి ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి తగినట్లుగా కొద్దిపాటి మార్పుచేర్పులు చేశారు. తొలుత వచ్చే మే నెలలో చైనాలో విడుదల చేయబోతున్నారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తారు. ఇదిలా ఉండగా , తమ చిత్రం త్వరలో చైనాలో విడుదల కాబోతోందనే సంగతిని చిత్ర కథానాయకుడు ప్రభాస్ తో పాటు రానా , అనుష్కలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
0business
French Presidential Elections మార్కెట్లకు ఫ్రెంచ్‌ అధ్యక్ష ఎన్నికల బూస్ట్‌! ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు గత వారం విదేశీధోరణులు ఎక్కువ ప్రభావితంచేసాయి. ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలరేసులో సెంట్రిస్ట్‌ అభ్యర్ధి ఇమ్మాన్యుయేల్‌ మాక్రస్‌ ముందున్నట్లు స్పష్టం కావ డంతో ప్రపంచ వ్యాప్తంగా సెంటిమెంట్‌కు మంచి మద్దతునిచ్చింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఫ్రాన్స్‌ వైదొలగాలంటూ వాదిస్తునన రైటిస్ట్‌ అభ్యర్ధి మారిన్‌లీపెన్‌ఫై తొలిరండ్లో మాక్రన్‌ విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పురోగమించాయి. ఇప్పటికే యూరోపియన్‌ యూని యన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలుగుతున్న కారణంగా యూరోజోన్‌లో సెంటిమెంట్‌ సైతం బలహీన పడింది. మాక్రన్‌ విజయంతో అమెరికాతో సహా ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది. ఈబాటలో దేశీయంగాను మార్కె ట్లు బలపడ్డాయి. వారం ముగిసేసరికి సెన్సెక్స్‌ నికరంగా 553 పాయింట్లు 1.9శాతం పెరిగిం ది. 29,916వద్ద ముగిసింది. నిఫ్టీసైతం 185 పాయింట్లు పెరిగి 9304వద్ద స్థిరడపింది. వారం మధ్యలోనే సెన్సెక్స్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 30వేల పాయింట్ల మైలురాయికి ఎగువన 30,133వద్ద నిలిచింది. నిఫ్టీకూడా 9350 స్థాయిని అధిగమించింది. మార్కెట్ల బాటలో చిన్నషేర్లు సైతం ర్యాలీతీసాయి. వారం మొత్తంగా బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌సూచి 2.2శాతం జంప్‌చేస్తే స్మాల్‌క్యాప్‌ సూచి 1.35శాతం పెరిగింది. గడచిన వారం బిఎస్‌ఇలో బ్యాంకింగ్‌, ఆటోరంగాలు దాదాపు నాలుగుశాతం పుంజుకోగా, ఐటి0.6శాతం, ఫార్మా0.9శాతం చొప్పున డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ దిగ్గజాల్లో ఎంఅండ్‌ఎం, గెయిల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌బ్యాంకు, మారుతి 5-6శాతం మధ్య పెరిగితే లూపిన్‌ ఐదుశాతం దిగజారింది. మార్కెట్లు ఊగిసలాడుడూ నడిచినా చిన్నస్టాక్స్‌ మాత్రం మద్దతు లభించింది. మిడ్‌క్యాప్‌ సూచి 0.2శాతం బలపడితే స్మాల్‌క్యాప్‌ సూచి 0.6శాతం పెరిగింది.
1entertainment
second day play has been interrupted due to rain రెండో రోజూ అదే సీన్.. భారత్ 74/5 కోల్‌కతా టెస్టులో రెండో రోజూ అదే సీన్ రిపీట్ అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. TNN | Updated: Nov 17, 2017, 03:26PM IST కో‌ల్‌కతా టెస్టును వరుణుడు వదలడం లేదు. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు 21 ఓవర్లు మాత్రమే ఆట సాగింది. ఆట ఆరంభమైన సమయంలో వర్షం పడనప్పటికీ.. కాసేపటి తర్వాత వర్షం కురవడంతో ముందే లంచ్ విరామం ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఆట సాగకపోవడంతో రెండో రోజు ఆట రద్దయినట్లు ప్రకటించారు. తొలి రోజు లక్మల్ మూడు వికెట్లు తీసి భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టగా.. రెండో రోజు షనక రెండు వికెట్లు తీసి టీమిండియాను మరింత దెబ్బ తీశాడు. మూడు వికెట్ల నష్టానికి 17 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌‌ను పుజారా (102 బంతుల్లో 47 బ్యాటింగ్) ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో ఇబ్బంది పడుతూనే ఆడిన రహానే.. 4 పరుగుల వద్ద క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (4)ను షనక పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆటకు వర్షం అంతరాయం కలిగించే సమయానికి పుజారా, సాహా (6) క్రీజులో ఉన్నారు. భారత్ 32.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఎయిరిండియా 'డబుల్‌ డెక్కర్‌' విమానం.. పండుగల సీజన్‌‌లో ప్రత్యేక సర్వీసులు.. అక్టోబరు 16 నుంచి 21వ తేదీ వరకు దిల్లీ నుంచి కోల్‌కతా, ముంబయి ప్రాంతాలకు రోజుకు ఒక విమానాన్ని నడపనున్నారు. Samayam Telugu | Updated: Oct 2, 2018, 01:39PM IST పండుగల సీజన్‌ దృష్ట్యా రద్దీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా డబుల్‌ డెక్కర్‌ విమానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉండే ముంబయి - కోల్‌కతా ప్రాంతాలకు ఈ డబుల్‌ డెక్కర్‌ విమానాన్ని నడపాలని నిర్ణయించింది. బోయింగ్‌ 747 డబుల్‌ డెక్కర్‌ విమానంలో 423 సీట్ల సామర్థ్యం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో 12 ఫస్ట్‌ క్లాస్‌ సీట్లు, 26 బిజినెస్‌ సీట్లు, 385 ఎకానమీ సీట్లు ఉన్నాయని తెలిపింది. అక్టోబరు 16 నుంచి 21వ తేదీ వరకు దిల్లీ నుంచి కోల్‌కతా, ముంబయి ప్రాంతాలకు రోజుకు ఒక విమానాన్ని నడపనున్నారు. బోయింగ్‌ 747 కార్యకలాపాలకు ఈ ఏడాది 50వ వార్షికోత్సవం కావడం గమనార్హం. నాలుగు ఇంజిన్లతో ఉండే ఈ విమానాలను వీవీఐపీల కోసం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో ఉపయోగిస్తుంటారు. నవంబరు 1 నుంచి 11 వరకు ఢిల్లీ-ముంబయి-ఢిల్లీ సెక్టార్‌లో రోజుకు రెండు జంబో విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబరులో దసరా, నవంబరులో దీపావళి పండగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఎయిర్ ఇండియా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
1entertainment
Feb 28,2019 వడ్డీరేట్లు తగ్గించిన పీఎన్‌బీ న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్‌(ఆర్బీఐ) వడ్డీ రేట్ల తగ్గింపునకు కొనసాగింపుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 0.10 శాతం కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు మార్చి 1వ నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో సంవత్సరాల కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటు 8.55 శాతం నుంచి 8.45 శాతానికి దిగి రానుంది. మూడేళ్ల కాల రుణాల రేట్లు 8.65శాతంగా ఉండనున్నాయి. కాగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేత త్వంలోని మానిటరీ పాలసీ తాజా ద్రవ్య పరపతి విధాన సమీకలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలను అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వినియోగదారులకు అందించాలని శక్తికాంత దాస్‌ ఇటీవల స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 16, Sep 2019, 4:11 PM IST Highlights రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ కి, దిల్ రాజుకి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన 'దాగుడు మూతలు' సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని అన్నారు. 'డీజే' సినిమా తరువాత హరీష్ శంకర్ తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు దిల్ రాజు.  ఒక సినిమా మొదలవుతుందంటే దాని వెనుక చాలా వర్క్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. దర్శకనిర్మాతల మధ్య డిఫరెన్సెస్ రావడం, హీరోకి దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ఇష్యూలు బయటపడుతుంటాయి.. మరికొన్ని సార్లు లోలోపలే ఉండిపోతాయి. అయితే రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ కి, దిల్ రాజుకి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన 'దాగుడు మూతలు' సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని అన్నారు. 'డీజే' సినిమా తరువాత హరీష్ శంకర్ తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు దిల్ రాజు. దానికి 'దాగుడు మూతలు' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. శర్వా, నితిన్ హీరోలుగా సినిమా ఉంటుందని చెప్పారు. కానీ సినిమా సడెన్ గా ఆగిపోయింది. దాంతో హరీష్ శంకర్.. దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటకి వచ్చి 14 రీల్స్ బ్యానర్ పై 'వాల్మీకి' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విషయంలో కూడా నిర్మాతలకు హరీష్ కి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ విషయాలపై తాజాగా హరీష్ శంకర్ స్పందించాడు. తనకు 'వాల్మీకి' చిత్రనిర్మాతలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని వాళ్లు ఎక్కువ ఖర్చు పెట్టిన ప్రతీసారి తనే కంట్రోల్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక దిల్ రాజుతో కూడా తనకు ఎలాంటి గొడవలు లేవని కాకపోతే కాస్టింగ్ విషయంలో ఆయనతో ఇబ్బంది అంటూ చెప్పాడు. ప్రస్తుతం వారిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని 'వాల్మీకి' సినిమా వైజాగ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దిల్ రాజే అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే 'దాగుడు మూతలు' సినిమా కూడా తీస్తానని చెప్పారు. Last Updated 16, Sep 2019, 4:11 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ఆసీస్‌పై విజయం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సొంత గడ్డ మీద ఆసీస్‌పై టెస్టు విజయాన్ని అందుకుంది. TNN | Updated: Aug 30, 2017, 01:32PM IST బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని రోజు ఇది. ముష్ఫికర్ రహీం నాయకత్వంలో బంగ్లా జట్టు తొలిసారిగా టెస్టుల్లో ఆసీస్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 20 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. బలమైన ఆసీస్‌ను సొంత గడ్డపై బంగ్లాదేశ్ మట్టి కరిపించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్.. ఆసీస్‌ను 217 పరుగులకే కట్టడి చేసింది. 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు 221 పరుగులకే ఆలౌటై.. ఆసీస్‌కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసిన ఆసీస్‌ను డేవిడ్ వార్నర్ లక్ష్యం దిశగా నడిపించాడు. నాలుగో రోజు 156 పరుగులు చేస్తే మ్యాచ్ ఆసీస్ వశం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్ మ్యాజిక్ చేశాడు. సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్‌ను ఎల్బీగా అవుట్ చేసిన అతడు.. స్మిత్, మ్యాక్స్‌వెల్, వేడ్‌లను పెవిలియన్ చేర్చాడు. 28 ఓవర్లు బౌలింగ్ చేసిన షకీబ్ అల్ హసన్ 85 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు తీశాడు. దీంతో విజయానికి మరో 20 పరుగుల దూరంలో ఆసీస్ ఆలౌటయ్యింది. తైజుల్ ఇస్లాం 3 వికెట్లు, మెహెదీ హసన్ రెండు వికెట్లతో షకీబ్‌‌కు తోడ్పాటునందించారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు తీసిన షకీబల్ హసన్ బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2sports
ధోనీ ఉన్నా కార్తీక్‌ని ఆడించండి..!: KKR కోచ్ Samayam Telugu| Apr 17, 2019, 12.57 PM IST ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో రిజర్వ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ని కూడా భారత్ తుది జట్టులో ఆడించాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ కోచ్ సైమన్ కటిచ్ సూచించాడు. వరల్డ్‌కప్‌ కోసం 15 మందితో కూడిన భారత్ జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించగా.. దినేశ్ కార్తీక్‌కి రెండో వికెట్‌ కీపర్‌గా అవకాశం దొరికిన విషయం తెలిసిందే. అయితే.. రెస్ట్ లేదా గాయం కారణంగా ధోనీ మ్యాచ్‌లో ఆడలేకపోతే అప్పుడు కార్తీక్‌ని ఆడిస్తామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. కానీ.. ధోనీ టీమ్‌లో ఉన్నా సరే.. కార్తీక్‌ని మిడిలార్డర్‌లో.. అదీ నెం.4లో ఆడించాలని తాజాగా కటిచ్ సూచించాడు. నెం.4లో విజయ్ శంకర్‌ని ఆడించబోతున్నట్లు ఇప్పటికే సెలక్టర్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘ఫినిషర్‌గా మ్యాచ్‌ల్ని ముగించడంలో దినేశ్ కార్తీక్ సామర్థ్యంపై ప్రస్తుతం ఎవరికీ సందేహాల్లేవు. గత కొంతకాలంగా అతను నిలకడగా రాణిస్తున్నాడు. ప్రపంచకప్‌‌లో నెం.4 స్థానంలో ఆడే భారత బ్యాట్స్‌మెన్ గురించి సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఆ స్థానంలో దినేశ్ కార్తీక్‌ బాగా నప్పుతాడు. అతను క్రీజులో కుదురుకుంటే.. బౌలింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా.. షార్ట్ పిచ్ బంతుల్నీ కూడా కార్తీక్ అలవోకగా బౌండరీకి తరలించగలడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీపై అతను రెండు హుక్ షాట్స్ ద్వారా సిక్సర్లు రాబట్టడం అతని బ్యాటింగ్‌ నైపుణ్యానికి నిదర్శనం’ అని కటిచ్ వెల్లడించాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లాడిన దినేశ్ కార్తీక్ ఒక అర్ధశతకం మాత్రమే సాధించి.. 111 పరుగులు చేశాడు. అతని సగటు కేవలం 18.50గా ఉంది. ప్రపంచకప్‌‌కి భారత్ జట్టు ఇదే..! విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ (రిజర్వ్ ఓపెనర్), విజయ్ శంకర్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (రిజర్వ్ వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ
2sports
ఐక్యరాజ్య సమితితో మారుతి సుజుకి అవగాహన! PNR| భూతాపంతో పాటు పర్యావరణం వేడెక్కడాన్ని నివారించేందుకు వీలుగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిక్షణ విభాగంతో మారుతి సుజుకి సంస్థ ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహన మేరకు.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తన వంతు చర్యలను మారుతి సుజుకి చేపడుతుంది. ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు, కార్బన్ డై ఆక్సైడ్‌ విడుదలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను చేపట్టడమే కాకుండా గ్రీన్ వరల్డ్‌ను ఆవిష్కరించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను ఐక్యరాజ్య సమితితో కలిసి మారుతి సుజుకి చర్యలు తీసుకుంటుంది. సంబంధిత వార్తలు
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Suresh 116 Views ENGLAND సౌతాఫ్రికాపై  విజయం లండన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆధిపత్య పోరులో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ మళ్లీ పైచేయి సాధించింది. సుదీర్ఘ సిరీస్‌లో ఇప్పటికీ వన్డే, టీ20 సిరీస్‌లను చేజిక్కించుకున్న ఇంగ్లాండ్‌ తాజాగా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధి క్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ గెలిస్తే రెండో టెస్టులో భారీ తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా ఆ జట్టుకి గట్టి సవాల్‌ విసిరింది. దీంతో కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జరిగిన మూడో టెస్టుపై అమితాసక్తి నెలకొంది. కానీ సోమవారం ముగిసిన ఈ టెస్టులో 492పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా చివరికి 252 పరుగులకే కుప్ప కూలింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు బెన్‌ స్టోక్స్‌(112), అలిస్టర్‌ కుక్‌ (88) నిలకడగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం బౌలర్‌ జోన్స్‌ (5/57) ధాటికి దక్షిణాఫ్రికా కేవలం 175 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 178 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించిన ఇంగ్లాండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌ని 313/8 వద్ద డిక్లేర్‌ చేసి 492 పరుగుల లక్ష్యాన్ని సఫారీలకి నిర్ధేశించింది. భారీ ఛేదనలో అందరూ విఫల మైనా, డీన్‌ ఎల్గర్‌ 228బంతుల్లో 20ఫోర్లతో 136 పరుగులతో ఒంటరి పోరాటంతో ఆకట్టు కున్నాడు. నాలుగో టెస్టు శుక్రవారం నుంచి జరగనుంది.
2sports
TOYOYA టయోటా విక్రయాల్లో క్షీణత న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ఆగస్టు నెల మోటార్‌ విక్రయాల్లో 6.86శాతం క్షీణించినట్లు ప్రకటిం చింది. కంపెనీ గత ఏడాది ఆగస్టులో 14,045 యూనిట్లు ఈ ఏడాది ఆగస్టులో 13,081 యనిట్లు మాత్రమే విక్రయిం చింది. కంపెనీ ప్రకటన ప్రకారం దేశీయ విక్రయాలు 6.12 శాతంతగ్గాయి. 12,801యూనిట్ల నుంచి 12,017 యూనిట్ల వరకే ఉన్నాయి. టయోటా ఎటియోస్‌పరంగా ఆగ్టులో 1064 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. టయోటా కంపెనీ డైరెక్టర్‌ ఎన్‌.రాజా మాట్లాడుతూ మా అమ్మకాల గణాంకాలు కస్టమర్ల ఆర్డర్లపైప్రభావం చూపించబోవని సెస్‌పెంపు వంటివి కొంతవిఘాతం కలిగించినా కస్టమర్ల ఆర్డర్లు,విచారణలు పెరిగాయని అన్నారు ఇన్నోవాకు ఇపుడు వెయిటింగ్‌ కాలం ఆరునుంచి ఎనిమిది వారాలకు చేరిందని, ఫార్చూనర్‌కు10-12 వారాలుగా నిలిచిందన్నారు. ఇక కామ్రి హైబ్రిడ్‌ జిఎస్‌టి అమలుతర్వాత ధరల పెరుగుదలకు దారితీసింది. క్లీన్‌ అండ్‌గ్రీన్‌టెక్నాలజీస్‌ విని యోగించడంతో హైబ్రిడ్‌ వాహనాలకుజిఎస్‌టిముందస్తుకాలంనాటి ధరలే ఎక్కువఅమలయ్యాయన్నారు.
1entertainment
e Commerce ఎస్‌ఎంబి ఇ-కామర్స్‌ లక్ష్యంగా ప్రైవన్‌ హైదరాబాద్‌, నవంబరు24:దేశవ్యాప్తంగా ఇ-కామర్స్‌ రంగాన్ని మరింత విస్తరింపచేసేందుకు వీలుగా ప్రతి వారం కొత్తగా 350 మంది విక్రేతలను ఈ ప్లాట్‌ ఫామ్‌పైకి కొత్తగా వచ్చిన ప్రైవన్‌ సంస్థ వేదిక అవు తోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 34వేలకుపైగా చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు చెందిన యజ మానులను ఆన్‌లైన్‌ వ్యాపార ప్రపంచంలోనికి ప్రవేశింపచేసి డిజిటల్‌ సాంకేతికపరిజ్ఞానంతో సమర్ధంగా తమ ఉత్పత్తులు అమ్ముకోడానికి అవ కాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 2014లో ప్రారంభం అయినప్పటినుంచి ఎస్‌ఎంబిలకు అవసరమైన శిక్షణ సేవలు అందించడంతోపాటు లాజిస్టిక్‌ వ్యాపార ప్రకటనలకు సంబంధించిన లోతైన సమస్యలకు ప్రైవన్‌ పరిష్కారాలు అంది స్తుందని సేల్స్‌లీడర్‌ సందీప్‌ వారాగంటి వెల్ల డించారు. 2020 నాటికి చిన్న, మధ్యతరహా సమస్యల ద్వారా 100 బిలియన్‌ డాలర్ల వ్యాపా రం చేసే లక్ష్యంతో ఉన్నట్లుప్రైవన్‌ సేల్స్‌లీడర్‌ ప్రకటించారు. ప్రతివారంలోను కనీసం 350 మందికి తగ్గకుండా ఎస్‌ఎంబి యజమానులను ఆన్‌లైన్‌ పైకి తెస్తున్నట్లు వివరించారు. గడచిన రెండేళ్లలో ప్రైవన్‌కు వచ్చి నెస్‌ఎంబిలు 500శాతం పెరిగాయన్నారు. ఉత్పత్తులను కూడా 400శాతం అందుబాటులోనికి తెచ్చారన్నారు. చిన్నమధ్యతరహా వ్యాపారాల్లో పదిశాతం మాత్రమే ఇంటర్‌నెట్‌కు చెందిన పూర్తిసామర్ధ్యం వినియోగించుకోడంలో సాధికారతను కలిగి ఉన్నాయని ప్రైవన్‌ కేవలం తన సొంత బృందంతోనే కాకుండా భాగస్వామ్య నెట్‌ వర్క్‌లతో కలిపి మొత్తం 45నగరాల్లో సేవలం దిస్తున్నట్లు సందీప్‌ వివరించారు. ఎస్‌ఎంబిల్లో తయారయ్యే నమ్‌కీన్‌ల నుంచి బీహార్‌లోని మధు బని ఛాయా చిత్రాలవరకూ ప్రైవన్‌ అందిస్తుంద న్నారు. ప్రస్తుతం రెండు, మూడోశ్రేణి నగరాలపై దృష్టిసారించామని, ఎస్‌ఎంబిలకు అవసరమైన శిక్షణ, డిజిటల్‌ కేటలాగ్‌బిల్డింగ్‌, లాజి స్టిక్‌, వ్యాపార ప్రకటనలకు సంబంధించి న పరిష్కారాలను అందిస్తామని వివరిం చారు. ప్రైవన్‌ మద్దతుతో ఇపుడు తమకు 95శాతం అమ్మకాలు ఆన్‌లైన్‌లోనే జరు గుతున్నాయని చెన్నైకు చెందిన సమైరా ఆన్‌లైన్‌ సంస్థయజమాని ఫహద్‌ వెల్లడిం చారు. అమ్మకాల్లో కూడా ఆరుశాతం వృద్ధిని సాధించామన్నారు. 2016లో ప్రైవన్‌ తన ఎస్‌ఎంబి విక్రేతలను 150 శాతం పెంచుకోవడంద్వారా మరో 15 నగరాలకు విస్తరించిందని సందీప్‌ వివరిం చారు. ఇప్పటివరకూ రెండువేల సంస్థల విక్రేతలకు తమ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉందని, భాగస్వామ్యపద్దతిని ప్రారంభించిన ఏడాదిలోపే 300శాతం వృద్ధిని సాధించినట్లు వివరించారు.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV Shikhar Dhawan Injury: పంత్‌కి లక్కీ ఛాన్స్.. ఇంగ్లాండ్ బయల్దేరనున్న యువ క్రికెటర్! బొటన వేలి గాయం కారణంగా ధావన్ మూడు వారాలపాటు క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి బదులు పంత్‌కి వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ దక్కిందని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే పంత్ ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నాడని తెలుస్తోంది. Samayam Telugu | Updated: Jun 11, 2019, 07:55PM IST హైలైట్స్ బొటన వేలి గాయం కారణంగా ధావన్ మూడు వారాలపాటు క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి బదులు పంత్‌కి వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ దక్కిందని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే పంత్ ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నాడని తెలుస్తోంది. గాయం కారణంగా మూడు వారాలపాటు వరల్డ్ కప్‌కు దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌కి అవకాశం దక్కినట్టు సమాచారం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌‌లో ధావన్ ఎడమ చేతి బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అది ఫ్రాక్చర్‌గా తేలడంతో ధావన్ మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ధావన్ లోటును పూడ్చటం కోసం ఢిల్లీ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పంత్ 48 గంటల్లోగా భారత్ నుంచి ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నాడు. కానీ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు బరిలో దిగే అవకాశం ఉంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లాభాల‌తో ప్రారంభ‌మై... న‌ష్టాల్లోకి మార్కెట్లు మొద‌ట సానుకూలంగా ప్రారంభమైన దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలను మూట‌గ‌ట్టుకున్నాయి. అంచనాలకు అనుగుణంగా ఫెడ్‌ పావు శాతమే వడ్డీ రేటును పెంచిన నేపథ్యంలో లాభాలతో మొదలైన సెన్సెక్స్‌ తొలుత 33,281ను అధిగమించింది. TNN | Updated: Mar 22, 2018, 04:30PM IST మొద‌ట సానుకూలంగా ప్రారంభమైన దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలను మూట‌గ‌ట్టుకున్నాయి. అంచనాలకు అనుగుణంగా ఫెడ్‌ పావు శాతమే వడ్డీ రేటును పెంచిన నేపథ్యంలో లాభాలతో మొదలైన సెన్సెక్స్‌ తొలుత 33,281ను అధిగమించింది. ఆపై మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు పెరగడంతో నష్టాలలోకి ప్రవేశించింది. చివర్లో 33,000 పాయింట్ల మార్క్‌ దిగువకు సైతం చేరింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 130 పాయింట్లు కోల్పోయి 33,006 వద్ద స్థిరపడింది. ఈ బాటలో 10,208-10,105 పాయింట్ల మధ్య ఊగిసలాడిన నిఫ్టీ 40 పాయింట్ల క్షీణతతో 10,115 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఓఎన్జీసీ(2.45%), ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(1.41%), టాటా మోటార్స్(1.29%), రిల‌య‌న్స్(1.22%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(0.57%) లాభ‌ప‌డిన వాటిలో ముందుండ‌గా మ‌రో వైపు ఎస్బీఐఎన్(2.46%), విప్రో(2.32%), ఎం అండ్ ఎం(2.14%), ఐసీఐసీఐ బ్యాంక్(2.09%), మారుతి(2.01%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.
1entertainment
Coach Rajkumar సవాళ్లను ఎదుర్కోవడం కోహ్లీకి ఇష్టం: రాజ్‌కుమార్‌ న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకి సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టమని చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ తెలిపాడు.నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా పుణేలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజయం చెందింది.దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది.ఈ క్రమంలో పలువురు మాజీలు టీమిండియాకు మద్దతుగా నిలిచారు.ఈ టెస్టు సిరీస్‌ నెగ్గే అవ కాశం ఇంకా ఉందంటున్నారు.కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ ఒక ఇంటర్వ్యూలో బెంగళూరు లో జరిగే రెండవ టెస్టులో కోహ్లీ సేన తిరిగి పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. పుణేలో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ ప్రదర్శన గురించి తాను మాట్లాడనని,గతంలో గెలుపోట ములు సహజమని శర్మ వివరించాడు.పరాజయం నుంచి ఎంతో నేర్చుకోవాలని,కోహ్లీ పోరాట యో ధుడని,అతడు సవాళ్లను ఇష్టపడతాడన్నాడు.ఇక బెంగళూరులోజరిగే రెండవ టెస్టు కోహ్లీతో పాటు అతని బృందానికి ఎంతో ముఖ్యమైందన్నాడు. రెండవ టెస్టులో కోహ్లీ సేన మరింత కాన్ఫిడెం ట్‌గా మైదానంలోకి అడుగుపెడుతుందనిఇ రాజ్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.మరోవైపు కోహ్లీ పాలి ఉమ్రిగర్‌ అవార్డుకు ఎంపిక అవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.కోహ్లీ ఎంతో అంకిత భావం కలిగి ఉంటాడని,10 సంవ త్స రాల వయసులోనే వెస్ట్‌ ఢిల్లీ క్రికెట్‌ అకాడమీకి ఎంపికయ్యాడని తెలిపారు.ప్రస్తుతం కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని వివరించాడు. ఇదే ఫామ్‌ని మరి కొన్నాళ్లపాటు కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.బిసిసిఐ ప్రకటించిన అవార్డుల్లో పాలీ ఉమ్రిగర్‌ అవార్డును కోహ్లీ దక్కిం చుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే భారత్‌,ఆసీస్‌ల మధ్య ఈనెల 4న బెంగళూరులో రెండవ టెస్టు ప్రారంభం కానుంది.
2sports
internet vaartha 151 Views న్యూఢిల్లీ : పన్నుల విధింపులో పారదర్శక విధానం అమలు చేస్తామని, అనువర్తన పన్నువిధానం ఉండబోదని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలు ఇన్వె స్టర్లకు భరోసా ఇస్తూ పెట్టుబడులను అకర్షిస్తు న్న ప్రయత్నం జరుగుతున్నతరుణంలో వొడా ఫోన్‌కు తాజాగా 14,200 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ మరోసారి ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీచేయడం వివాదాస్ప దం అవుతున్నది. 2007 నాటి లావాదేవీలకు సంబంధించిన వొడాఫోన్‌ కేసులో మధ్యవర్తిత త్వానికి కూడా కంపెనీ ముందుకువచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసు అప్పట్లో సంచ లనం సృష్టించింది. అనూహ్య నిబంధనలు, చట్టాలతో భారత్‌ విదేశీ కంపెనీలపై విధించే పన్నులు ఇవేనా అన్నట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. వొడాఫోన్‌ పదేపదే ప్రభుత్వ అధికారయంత్రాంగంతో విభేదిస్తూ వచ్చింది. హచిసన్స్‌ మొబైల్‌ బిజినెస్‌ను 2007లో కొనుగోలు చేసినప్పటి నుంచి ఈవివాదం నడుస్తోంది. మూలధన లబ్దిపనున్న చెల్లించాలంటూ వొడాఫోన్‌కు నోటీసులు జారీచేసింది. దశాబ్దకాలం క్రితం వొడాఫోన్‌ 67శాతం వాటాలను హఛిసన్‌ ఎస్సార్‌లో కొనుగోలుచేసింది. 11.5బిలియన్‌ డాల ర్లకు ఈ కొనుగోళ్లు జరిగాయి. 2012లో భారత్‌ పన్నుల యంత్రాంగం మూలధన లబ్దిపై పన్నులు బకాయి ఉందని వొడాఫోన్‌ భారత్‌లోని ఆఈస్తుల కొనుగోలుపై ఖచ్చితంగా పన్నులు చెల్లించాల్సి ఉం టుందని ప్రకటించింది. అయితే వొడాఫోన్‌ ఇందుకు సంబంధించి ఈ లావాదేవీ భారత్‌బయటి ప్రాం తంలో భారత్‌కు సంబంధంలేని కంపెనీల మధ్య జరిగిందని వొడాఫోన్‌ బ్రిటన్‌కేంద్రంగాఉన్న కంపెనీ అని హచిసన్‌ హాంకాంగ్‌ కంపెనీ అని వాదించింది. రెండేళ్ల క్రితం వొడాఫోన్‌ అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి ఈ పన్నువివాదంపై దరఖాస్తులు చేసింది.
1entertainment
Hyderabad, First Published 8, Jul 2019, 7:56 AM IST Highlights టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత ఓ బేబీ సినిమాతో మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. మహానటి - రంగస్థలం - మజిలీ సినిమాలతో అక్కినేని కోడలి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఓ బేబీ సక్సెస్ తో సమంత అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది.    టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత ఓ బేబీ సినిమాతో మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. మహానటి - రంగస్థలం - మజిలీ సినిమాలతో అక్కినేని కోడలి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఓ బేబీ సక్సెస్ తో సమంత అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది.  ఓ బేబీ సినిమాకు ప్రస్తుతం అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు  సమంత నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సక్సెస్ తో సమంతలో ఒక అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ తాను చేయబోయే సినిమాపై అభిమానులు మరింత అంచనాలు పెంచేసుకుంటారని, అప్పుడు డిఫరెంట్ కథలో ఎంచుకోవడం కష్టమని తెలిపింది. ఆ విధంగా ఈ సినిమా సక్సెస్ నాలో కొంత కన్ఫ్యూజన్ ని కలుగజేస్తోందని ఇప్పుడు హ్యాపీగా రిటైర్ అవ్వోచ్చేమో అని వివరణ ఇచ్చారు. అయితే ఈ ఫీలింగ్ పాసింగ్ క్లౌడ్స్ లాంటిదని అంటూ  భవిష్యత్తులో కూడా మంచి ప్రాజెక్ట్స్ ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తానని అదే విధంగా అభిమానులకు నచ్చే విధంగా ప్రతి సినిమాలో బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇస్తానని సమంత వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సమంత 96 రీమేక్ లో నటిస్తోంది. అలాగే మన్మధుడు 2లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. Last Updated 8, Jul 2019, 7:59 AM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘ఒక మనసు’పై మనసు పడ్డ హీరో నీహారిక నటించిన మొదటి సినిమా ఒక మనసు జూన్ 24న విడుదలవ్వబోతోంది. TNN | Updated: Jun 23, 2016, 12:25PM IST ‘ఒక మనసు’పై మనసు పడ్డ హీరో నీహారిక నటించిన మొదటి సినిమా ఒక మనసు జూన్ 24న విడుదలవ్వబోతోంది. మెగా హీరోల అభిమానులంతా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేశారు. భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న ఆశతోనూ ఉన్నారు. ఒకమనసు సినిమా గురించి తమిళ హీరో ధనుష్ కి తెలిసింది. ఆ సినిమాను మొదటిరోజే చెన్నైలో చూడడానికి సిద్దమయ్యాడట. అయితే ఆ సినిమా చూడడానికి కారణం నీహారిక కాదట. హీరో పాత్రట. ల్యాండ్ సెటిల్ మెంట్లు చూస్తూ ఎమ్మెల్యేగా అవ్వడానికి ప్రయత్నించే పాత్ర హీరో సూర్యది. దానిని నాగశౌర్య చేశాడు. ఆ పాత్ర క్యారెక్టర్ నచ్చే ధనుష్ సినిమా చూడడానికి సిద్ధమయ్యాడట. సినిమా కూడా పూర్తిగా నచ్చితే... రీమేక్ లో చేసే ఆలోచన కూడా ఉందట. తమిళ రీమేక్ లోనూ హీరోయిన్‌గా నీహారికనే తీసుకుంటాడేమో.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV శ్రీలంక మెరుపులు.. విండీస్ టార్గెట్ 339 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఏడేసి మ్యాచ్‌లు ఆడేసిన శ్రీలంక, వెస్టిండీస్ జట్లు అనధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో.. శ్రీలంక హిట్టర్లు స్వేచ్ఛగా చెలరేగిపోయారు. Samayam Telugu | Updated: Jul 1, 2019, 07:28PM IST హైలైట్స్ వెస్టిండీస్ బౌలర్లని ఉతికారేసిన శ్రీలంక హిట్టర్ ఫెర్నాండో రెండు వికెట్లు పడగొట్టిన విండీస్ కెప్టెన్ హోల్డర్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన రెండు జట్లూ ఛేదనలో ఇటీవల మెరుగ్గా ఆడుతున్న వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన శ్రీలంక జట్టు ఈరోజు వెస్టిండీస్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో చెలరేగిపోయింది. యువ హిట్టర్ ఫెర్నాండో (104: 103 బంతుల్లో 9x4, 2x6) బాధ్యతాయుత శతకం బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ జట్టులో హోల్డర్ రెండు వికెట్లు, కాట్రెల్, థామస్, అలెన్ తలో వికెట్ పడగొట్టారు. What a knock from this youngster! #SLvWI | #LionsRoar https://t.co/058z71LxjO — Cricket World Cup (@cricketworldcup) 1561988675000 మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. శ్రీలంక ఇన్నింగ్స్‌ని ఆరంభించిన ఓపెనర్లు కరుణరత్నె (32: 48 బంతుల్లో 4x4), కుశాల్ పెరీరా (64: 51 బంతుల్లో 8x4) తొలి వికెట్‌కి 93 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. అయితే.. 11 పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటవగా.. అనంతరం వచ్చిన ఫెర్నాండో క్రీజులో పాతుకుపోయి ఆఖరి వరకూ శ్రీలంక ఇన్నింగ్స్‌‌ని నడిపించాడు.
2sports
Hyderabad, First Published 15, Aug 2018, 1:34 PM IST Highlights ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. వ్యోమగామిగా వరుణ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా కనిపించనున్నారు.  మెగా హీరో వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథను 'అంతరిక్షం' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. వ్యోమగామిగా వరుణ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా కనిపించనున్నారు. గతేడాది 'ఘాజీ' చిత్రంతో అద్భుత కథను తెలుగు వారికి అందించిన సంకల్ప్ ఈసారి అంతరిక్షంలో సాగే కథతో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. విఎఫ్ఎక్స్ ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీకల్ టీమ్ పని చేస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిశంబర్ లో సినిమాను విడుదల చేయనున్నారు.
0business
నాగార్జునకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్ Highlights అబుదాబిలో సైమా అవార్డుల వేడుక ఈ వేడుకలో పాట పాడి నాగార్జునకు సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్ అఖిల్ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న అఖిల్ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2017 వేడుక అబుదాబిలో జరిగింది. ఈ వేడుకలో అక్కినేని అఖిల్  సెంటర్ ఆఫ అట్రాక్షన్ గా నిలిచాడు. అఖిల్ కొత్త అవతారాన్ని చూసి చాలామంది షాక్ అయారు. అఖిల్ మొదట్లో క్రికెట్ పట్ల చూపుతున్న ఉత్సాహాన్ని గ్రహించిన చాలామంది అఖిల్ పెద్ద క్రికెటర్ అవుతాడనుకున్నారు. కానీ వంశాచారంగా హీరోగా మారిన అఖిల్..తన తొలి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయినా... కుటుంబ వారసత్వ పరంగా ఉన్న ఇమేజ్ తో అఖిల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఏ మాత్రం లోటు లేదు.    ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న రీ లాంచ్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా అఖిల్ సైమా వేడుక లాంటి వేడుకల్లో కనిపిస్తూ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అఖిల్ అబుదాబీలో జరిగిన ‘సైమా’ అవార్డు వేడుకలో పాట పాడి అందరినీ ఆశ్చర్య పరిచాడు.  అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం బయటపడింది.   అఖిల్ కు చిన్నప్పటి నుంచి పాటలపై ఆసక్తి ఉండటంతో.. అఖిల్ తల్లి అమల పాటలు పాడటంలో శిక్షణ ఇప్పించిందట. ఇప్పుడు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇలా ఉండగా అఖిల్ ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ వేదిక పై పాటలు పాడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని అంటున్నాడు నాగార్జున.   ఇలా ఉండగా అఖిల్..తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మాస్ మసాల సినిమాను చేయించడానికి రంగం సిద్ధం అయినట్లు సమాచారం. ఒక వైపు క్లాస్ ప్రేక్షకులను మరొక వైపు మాస్ ప్రేక్షకులను ఆకర్షించే సినిమాలు చేయిస్తూ అఖిల్ కెరియర్ ను చక్క దిద్దాలని నాగార్జున గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. నాగార్జున ఆశలు అఖిల్ తాజా సినిమాతో నెరవేరుతాయా లేక బోయపాటి సినిమా దాకా వెయిట్ చేయాల్సి వస్తుందో తెలిదు గాని ఈసారి మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Hyderabad, First Published 10, May 2019, 10:13 AM IST Highlights టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా గురువారం గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే మహర్షి సినిమా పలు చోట్ల నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా గురువారం గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే మహర్షి సినిమా పలు చోట్ల నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.  గుంటూరు ఏరియాలో ఎవరు ఊహించని విధంగా మొదటి రోజు 4.40 కోట్ల షేర్స్ ను రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది. బాహుబలి 2 తరువాత ఇంతకుముందు వినయ విధేయ రామ (4.18కోట్లు) -  అరవింద సమేత (4.16కోట్లు) సినిమాలు  నిలువగా మహర్షి గుంటూరు రికార్డ్ ను బ్రేక్ చేశాడు.  ఇక నైజం ఏరియాలో కూడా సినిమా 6 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు టాక్.   మరికొద్ది సేపట్లో ఈ కలెక్షన్స్ పై ఫుల్ క్లారిటీ రానుంది. ఇక కృష్ణ జిల్లాలో మహేష్ మరోసారి తన సత్తా చాటాడు. భరత్ అనే నేను ఆ ఏరియాలో 1.31 కోట్ల షేర్స్ ని అందించగా మహర్షి  1.39కోట్ల షేర్స్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ లో ఆనందాన్ని నింపింది.  Last Updated 10, May 2019, 10:13 AM IST
0business
సన్నీ సెక్సీ ఫోటో షూట్ Highlights సన్నీ సెక్సీ ఫోటో షూట్ బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ భామ.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కుదురుకుపోయింది. తెలుగులో  కూడా కొన్ని సినిమాల్లో కనిపించింది. రీసెంట్ గా పీఎస్వీ గరుడవేగ మూవీలో ఈమె చేసిన ఐటెం సాంగ్.. మూవీకి బాగానే ప్లస్ అయ్యింది. చాలా రోజుల తర్వాత హాట్ ఫొటో షూట్‌తో వార్తల్లోకి వచ్చింది . గత ఏడాదిలోనే ఏకంగా పది సినిమాల్లో స్పెషల్ అప్పీరియన్స్‌లు, ఐటమ్ సాంగ్స్‌తో దుమ్మురేపిన సన్నీ ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాల వేటలో ఉంది. అందుకోసమని తాజా ఫొటో షూట్‌ను ఉపయోగించుకుంటున్నట్టుగా ఉంది. సన్నీలియోన్ ఈ హాట్ ఫోటోస్‌ను అలా పోస్టు చేసిందో లేదో.. ఇవి వెబ్‌లో వైరల్ గా మారిపోయాయి.  Last Updated 17, May 2018, 5:49 PM IST
0business
మరిన్ని బ్యాంకుల్ని విలీనం చేసుకోలేం! - కోలుకొనేందుకు 2-3 ఏండ్లు పడుతుంది - మెరుగైన నిర్వహణకు 'ఏకీకరణ' అవసరం - 'స్ట్రెస్డ్‌ అసెట్స్‌' పరిష్కారానికి అన్ని యత్నాలు - ఎస్‌బీఐ చైర్మెన్‌ రజనీష్‌ కుమార్‌ వెల్లడి న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ రంగాన్ని స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగంగా సర్కారు చేపట్టిన బ్యాంకుల విలీనపు ప్రక్రియను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) చైర్మెన్‌ రజనీష్‌ కుమార్‌ సమర్థించారు. అయితే ఈ క్రమంలో తమ బ్యాంక్‌ మరిన్ని బ్యాంకుల విలీనం చేసుకొనే స్థితిలో లేదని మాత్రం ఆయన తేల్చి చెపారు. ఇటీవలే ఎస్‌బీఐ అయిదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంక్‌లను విలీనం చేసుకున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రస్తుత పరిస్థితుల నుంచి బ్యాంక్‌ నిలదొక్కుకొని లాభాలను ఆర్జించేందుకు గాను మరో రెండు నుంచి మూడేండ్ల సమయం పడుతుందని ఆయన వివరించారు. ఆ తరువాతే మరిన్ని విలీనాల దిశగా యోచిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మరిన్ని బ్యాంకులను విలీనం చేసుకొనేందుకు తాము సరైన ఎంపిక కాదంటూ వివరణనిచ్చారు. ఎస్‌బీఐ ఇప్పటికే దాదాపు 23% మార్కెట్‌ వాటాతో దేశంలో బ్యాంకింగ్‌ దిగ్గజంగా వెలుగొందుతోందని అన్నారు. మరిన్ని బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేయడం వల్ల ఈ రంగంలో తమ బ్యాంక్‌ గుత్తాధిపత్యం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. దేశంలో ప్రభుత్వ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు గాను ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ ద్వారా వాటి సంఖ్యను కుదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రా యపడ్డారు. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన 'బ్యాంకింగ్‌ రంగ ప్రత్యామ్నాయ వ్యవస్థ' (ఏఎం) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయ బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లను విలీనపు ప్రతిపాదనను వెల్లడిం చిన నేపథ్యంలో ఎస్‌బీఐ చైర్మెన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మూడు బ్యాంకుల విలీనం తరువాత దాదాపు రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో కొత్త బ్యాంక్‌ దేశంలోనే మూడు అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది. దేశంలో పెద్ద బ్యాంకులుగా ఉన్న ఎస్‌బీఐ, ఐసీఐసీఐ తరువాత స్థానంలో కొత్త విలీనపు బ్యాంక్‌ అవతరించనుందని సర్కారు ఇప్పటికే వెల్లడించింది. మూడు బ్యాంకుల విలీనం తరువాత కొత్తగా ఏర్పడనున్న బ్యాంక్‌ నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.71 శాతంగా నిలువనుంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల 12.13 శాతం నిష్పత్తి కంటే ఎంతో తక్కువగా ఉండడం విశేషం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సవాలుగా మారిన విద్యుత్తు రంగంలోని ఒత్తిడిలోని ఆస్తుల పరిష్కారానికి గాను తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిపారు. స్ట్రెస్డ్‌ అసెట్స్‌ విషయంలో దివాలా, దివాలా చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పించడానికి తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 20, Aug 2019, 3:21 PM IST Highlights హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.230 తగ్గుదలతో రూ.39,130కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.    బంగారం కొనుగోలు దారులకు ఇది నిజంగా శుభవార్త. నిన్నటి వరకు ఆకాశాన్నంటిన బంగారం ధర ఈ రోజు కాస్త దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.230 తగ్గుదలతో రూ.39,130కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.  అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గుదలతో రూ.35,870కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నిలకడగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో పురోగతి లేకపోవడం ఇందుకు కారణం
1entertainment
కీలక సమయాల్లో సచిన్‌ కంటే కోహ్లీ మేలు : ఇమ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌ : కొన్ని కీలక సమయాల్లో సచిన్‌ కంటే కోహ్లీ చాలా మేలని పాకి స్థాన్‌ మాజీ స్టార్‌ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌కు ఎప్పుడు చెవులున్నాయని అంటూ 1980లలో వివ్‌ రిచర్డ్స్‌, బ్రియాన్‌ లారా, సచిన్‌ వీరంతా ఆడేవారని కానీ వీళ్లందని కంటే కూడా తాను చూసిన వాళ్లలో కోహ్లీ సంపూర్ణ ఆటగాడని ఇమ్రాన్‌ పేర్కొన్నాడు.అతడు రెండు కాళ్లతోనూ మైదానంలో అన్ని వైపులా ఆడతాడని ప్రశంసలు కురిపించాడు. అతడి టాలెంట్‌, టెక్నిక్‌ లాంటి అంశాలను పక్కన పెడితే కోహ్లీకి చాలా మంచి టెంపర్‌మెంట్‌ ఉందని, సచిన్‌ కంటే అతడి టెంపర్‌మెంట్‌ బాగుంటుందన్నాడు.ఇటీవల భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మద్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఐసిసి టి20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌కి ఇమ్రాన్‌ఖాన్‌ హాజరయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ 37 బంతుల్లో 55 పరుగులతో వీర విహారం చేయడంతో పాక్‌ ఓడిపోయింది. పాక్‌ ఓటమి చూస్తుంటే చాలా బాధ అనిపించిందని, అయితే కోహ్లీ మాత్రం చాలా బాగా ఆడాడని ఇమ్రాన్‌ కొనియాడాడు.తాను ఒక బౌలర్‌గా బ్యాట్స్‌మెన్‌ను చూస్తానని,వాళ్లను ఎలా ఔట్‌ చేయాలా అనే ఆలోచిస్తానని,క్లిష్టమైన పరిస్థితుల్లో కోహ్లీ ఎలా ఆడతాడో చూస్తే ఇతరుల కంటే బాగా ఆడతాడని పేర్కొన్నాడు.అంతర్జాతీయంగా అతడే బాగా ఆడే క్రికెటర్‌ అని ప్రశంసించాడు.
2sports
Jul 08,2016 మాంద్యానికి అవకాశమే లేదు: ఐఎంఎఫ్‌ వాషింగ్టన్‌: 'బ్రెగ్జిట్‌' ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశమేలేదని 'అంతర్జాతీయ ద్రవ్య నిధి' (ఐఎంఎఫ్‌) అధినేత్రి క్రిష్టన్‌ లెగార్డ్‌ అన్నారు. 'బ్రెగ్జిట్‌' ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి తోసిందని ఆమె అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం ప్రస్తుతానికి బ్రిటన్‌పై మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న లెగార్డ్‌ క్రమంగా ఈ ప్రభావం యూరో ప్రాంత దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. ఈయూ నుంచి విడిపోవడం ద్వారా తాము ఏవిధంగా లాభపడగలిగేది బ్రెగ్జిట్‌ తరువాత బ్రిటన్‌ నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నారు. 'బ్రెగ్జిట్‌' నేపథ్యంలో వీలైనంత తొందరగా బ్రిటన్‌ ఈయూ నుంచి వైదోలగడమే అందరికీ మంచిదని అభిప్రాయపడ్డారు. దీంతొ నష్టనివారణ చర్యలు తీసుకొనేందుకు వీలుపడుతుందని అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 12, Mar 2019, 4:08 PM IST Highlights ఎనర్జిటిక్ స్టార్ గా పేరు పడ్డ రామ్ ఆ మధ్య కాస్త స్లో అయ్యారు కానీ ..ఇప్పుడు మళ్లీ వరస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రం చేస్తున్న రామ్ త్వరలో ఓ తమిళ రీమేక్ లో చేయనున్నారని సమాచారం. ఎనర్జిటిక్ స్టార్ గా పేరు పడ్డ రామ్ ఆ మధ్య కాస్త స్లో అయ్యారు కానీ ..ఇప్పుడు మళ్లీ వరస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రం చేస్తున్న రామ్ త్వరలో ఓ తమిళ రీమేక్ లో చేయనున్నారని సమాచారం. తమిళంలో సూపర్ హిట్టైన తాడమ్ చిత్రం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అరుణ్ విజయ్ హీరోగా రూపొందిన ఆ చిత్రం ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్.   ఒకే పోలికలతో ఉన్న హీరో చుట్టూ తిరుగుతుంది. అందులో ఒక హీరో మర్డర్ చేస్తారు. అయితే ఎవరు మర్డర్ చేసారనేది చివరి వరకూ తేలదు. ఇద్దరికి మర్డర్ చేసారనేందుకు క్లూ దొరుకుతూంటాయి. కానీ బలమైన ఎలిబి దొరకదు. దాంతో పోలీసులు అసలు హంతకుడు వీరిద్దరిలో ఎవరు అనేది తేల్చటానికి రకరకాల స్కెచ్ లు వేస్తూంటారు. కథనం చాలా గమ్మత్తుగా ఉంటుంది.  పోలీస్ లకు  దొరికే ప్రతీ క్లూ...సమాధానాలకు లీడ్ చెయ్యకుండా అనేక ప్రశ్నలకు దారి తీస్తుంది. వాటిని ఛేధిస్తూ వాళ్లు ఎలా హంతకుడుని పట్టుకున్నాడనేది ఇంట్రస్టింగ్ గా జరిగే కథనం. ఇక ఈ చిత్రాన్ని చూసిన రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ వెంటనే నచ్చి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొంతమంది రైటర్స్ తో కూర్చుని తెలుగు నేటివిటిని ఈ కథకు అద్దే పనిలో ఉన్నారని తెలుస్తోంది. స్క్రీప్టు ఓ కొలిక్కి వచ్చాక..దర్శకుడు ఎంపిక జరుగుతుందని చెప్తున్నారు.  Last Updated 12, Mar 2019, 4:08 PM IST
0business
శాతకర్ణికి పన్ను మినహాయింపునివ్వడం తప్పేనంటున్న ఐవైఆర్ కృష్ణారావు Highlights గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపునివ్వడంపై గతంలోనే విమర్శలు సోషల్ మీడియాలోనూ వ్యతిరేకించిన ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గౌతమి పుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు తప్పేనని మరోసారి స్పష్టం చేసిన ఐవైఆర్ బాలకృష్ణ 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం చారిత్రాత్మకమైనదంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు నివ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు నివ్వడంతో రాణి రుద్రమ చిత్రానికి ఇవ్వకపోవడం సరికాదని, దర్శకుడు గుణశేఖర్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపుపై మరో వివాదం రేగుతోంది.   ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా..  మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ముఖ్యమంత్రి చంద్రబాబు తొలగించిన నేపథ్యంలో ఆయన ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం సందర్భంగా తాను గతతంలో గౌతమి పుత్ర శాతకకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపునివ్వడం సరికాదని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ గురించి ప్రస్తావించారు. శాతకర్ణి  మాదిరిగా తీసిన సినిమాలన్నిటికీ పన్ను మినహాయింపునివ్వకుండా అలా ఇవ్వటం తప్పుడు సంకేతాలిస్తుందన్నదే తన ఉద్దేశమని కృష్ణారావు అన్నారు. బాహుబలి లాంటి సెన్సేషనల్ మూవీకి లేని పన్ను మినహాయింపు శాతకర్ణికి ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తుందని తాను అభిప్రాయపడినట్లు కృష్ణారావు వెల్లడించారు.   మిగతా సినిమాలకు కూడా పన్ను మినహాయింపునిస్తే.. నిర్మాతలు రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని గొప్ప చిత్రాలు తీసే అవకాశం ఉంటుందన్నదే తన అభిప్రాయం అన్నారు. అంతేకానీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగానో చేసిన పోస్ట్ అది కాదని ఐవైఆర్ కృష్ణా రావు అన్నారు. అయినా.. కొందరు పేరు కూడా ఉచ్చరించ అర్హతలేని వాళ్లు.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, సీఎం కూడా గత ఆరు నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా.. అవమాన పరిచారని ఐవైఆర్ ఆరోపించారు. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఉల్లిపొరలాంటి చీరలో ముద్దమందారంలా బిగ్ బాస్ భామ Web Title:Actress Deeksha Panth At Operation 2019 Movie Pre Release Function ( Telugu News from Samayam Telugu , TIL Network) 1/16 ఉల్లిపొరలాంటి చీరలో ముద్దమందారంలా బిగ్ బాస్ భామ మీ కామెంట్ రాయండి బిగ్ బాస్ సీజన్ 1లో గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకున్న దీక్షాపంత్.. ముద్ద మందారం లాంటి చీర కట్టి ఒంపు సొంపులతో హాట్ పోజులు ఇచ్చింది. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ‘ఆపరేషన్ 2019’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న దీక్షాపంత్ ఈ మూవీ ప్రి రిలీజ్‌ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫొటోలు మీకోసం. సమయం తెలుగు న్యూస్ అలెర్ట్‌కు సబ్‌స్క్రైబ్ అవ్వండి సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి ఇప్పుడు వద్దు
0business
మెగా హీరోతో తేజ తర్వాతి సినిమా ? TNN| Aug 31, 2017, 10.39 PM IST తేజ దాదాపు ఓ దశాబ్ధకాలం తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ తేజ. రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, క్యాథరిన్ ట్రెసాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తేజ కెరీర్‌ని తిరిగి ట్రాక్‌లో పెట్టిందనే చెప్పొచ్చు. ఇదే విషయాన్ని స్వయంగా తేజనే పలు వేదికలపై అంగీకరించాడు కూడా. ఇక ఇదే జోష్‌తో తేజ ఈసారి మెగా హీరోని డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అవును ఫిలింనగర్ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం వరుణ్ తేజ్ కోసం తేజ ఓ కథ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఫిదా సినిమాతో బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే వరుణ్ తేజ్ డైరెక్టర్ తేజ సినిమాలో నటించనున్నాడనేది లేటెస్ట్ టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం త్వరలోనే వెలువడే అవకాశం వుందంటున్నాయి సినీవర్గాలు.
0business
Suresh 164 Views markas రికార్డు సృష్టించినా జట్టును కాపాడలేకపోయిన మార్కస్‌ న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ విజ యం సాధించింది. చాపెల్‌, హ్యాడ్లీ ట్రోఫిలో భాగంగా ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ పరాజయం చెందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 286 పరుగులు చేసింది.అనంతరం 287 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 67 పరుగులకే 6 వికెట్లు కోల్పో యింది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మార్కస్‌ స్టోయినిస్‌ ఒంటి చేతితో మ్యాచ్‌ని ముందుకు నడిపించాడు.ఈ క్రమంలో 117 బంతుల్లో 9 బౌండరీలు,11 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు.తన కెరీర్‌లో రెండవ వన్డే ఆడుతున్న మార్కస్‌ స్టోయినిస్‌ ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా మ్యాచ్‌ గెలిచేలా అనిపించినప్పటికి అవతలి ఎండ్‌లో సరైన సహకారం లేకపోవడంతో మూడు ఓవర్లు మిగిలుండగానే ఆలౌటైంది.47వ ఓవర్‌లో చివరి బంతికి హాజెల్‌ ఉడ్‌ రనౌట్‌ కావడంతో ఆస్ట్రేలియా పరాజయం చెందింది.ఇక్కడ విశేషం ఏమిటంటే హాజెల్‌ వుడ్‌ ఒక్క బంతి కూడా ఎదు ర్కొన కుండా రనౌట్‌ కావడం. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ గుప్టిల్‌ 61 పరుగులు,బ్రూమ్‌ 73 పరుగు లు,విలియమ్సన్‌ 24 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఈ మ్యాచ్‌ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. కివీస్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌కు ఆసీస్‌ టాప్‌ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
2sports
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
అనుమానాస్పద లావాదేవీలు రెట్టింపు - గుర్తించిన నల్లధనం రూ.7,800 కోట్లు - మరింతగా పెరిగే అవకాశం - ఆర్థిఖ శాఖ తాజా నివేదిక                    న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో అనుమానాస్పద లావాదేవీల సంఖ్య 2013-14 మధ్య కాలంలో రెట్టింపు అయినట్లు ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్‌ఐయూ) తేల్చింది. వీటి ద్వారా దాదాపు దేశీయంగానూ.. విదేశాల్లోనూ రూ.7,800 కోట్ల నల్ల ధనాన్ని గుర్తించింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనుమానాస్పద లావాదేవీల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగినట్లు ఎఫ్‌ఐయూ ఒక నివేదికలో వెల్లడించింది. ఈ అనుమానాస్పద లావాదేవీల నుంచి భారీ మొత్తంలో నల్లధనాన్ని గుర్తించే వీలుందని ఎఫ్‌ఐయూ వివరించింది. ఆర్థికశాఖ రూపొందించి తాజా నివేదిక ప్రకారం 2013-14 మధ్య కాలంలో ఖాతాల్లో చూపని నల్లధనం మొత్తం ఆదాయపు పన్ను విభాగం నిఘాలో రూ.7,078 కోట్లుగా తేలిందని దీనికి తోడు కస్టమ్స్‌ మరియు సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగాల్లో ఈ మొత్తం రూ.750 కోట్లని ఆర్థిక శాఖ వివరించింది.                    పలు ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన సమాచారాల ఆధారంగా ఈ తాజా నివేదికను రూపొందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించిన వాటి విలువ రూ.20 కోట్లు. వీటిలో రూ.17 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ నిఘా ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఆదాయపు పన్ను శాఖ రూ.163 కోట్ల విలువైన ఆస్తులను, సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగం రూ.17 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మనీల్యాండరింగ్‌ చట్ట కింద ఈడీ తాజాగా 105 కేసులను నమోదు చేసింది. 2013-14లో అక్రమ లావాదేవీల సంఖ్య అంతకు ముందున్న (2012-13లో) 31,731 నుంచి 61,953కు పెరిగాయి. సమాచార విశ్లేషణకు నిఘా సంస్థకు 88 లక్షల నగదు లావాదేవీల నివేదికను, 3 లక్షల కౌంటర్‌ఫీట్‌ కరెన్సీ రిపోర్టులను, 81 వేల ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జీవోల) నివేదికలు అందాయి.                      తాజాగా సవరించిన ఈ నివేదికను ఆర్థిక శాఖ నల్లధనంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి కూడా అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా నల్లధనంపై ఏర్పాటు చేసిన సిట్‌ కూడా ఆయా దేశాలలో దాచిన నల్లధనం వివరాలను వెలికితీసేందుకు బాగా ఉపకరిస్తుందని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎఫ్‌ఐయూ విడుదల చేసిన ఈ సమాచారాన్ని మరింతగా విశ్లేషించి దేశంలోనూ దాగి ఉన్న ఖాతాలలో చూపని నల్లధనాన్ని వెలికితీసే ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ వర్గాలు ఇప్పటికే రూపొందించుకున్నట్లు సమాచారం. మ్యాట్‌ పన్ను విషయమై విదేశీ సంస్థాగత మదుపరుల పట్ల కేంద్రం చాలా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఫేస్ బుక్ లో డీజే సినిమా లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దిల్ రాజు Highlights దువ్వాడ జగన్నాథం సినిమా ఫేస్ బుక్ లో లీక్ లీకేజీ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత దిల్ రాజు సైబర్ క్రైమ్ ఏసీపీ రఘువీర్ ను కలిసి ఫిర్యాదు చేసిన దిల్ రాజు, హరీశ్ శంకర్ నెగెటివ్ రివ్యూలను తట్టుకుని మరీ కలెక్షన్స్ సాధిస్తోందనుకున్న డీజే దువ్వాడ జగన్నాథం సినిమాకు పైరసీ దెబ్బ తగిలింది. డీజే మూవీని పైరసీ చేసిన మాఫియా ఏకంగా ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి సినిమా కలెక్షన్లకు గండి కొడుతోంది. ఈ చిత్రం మౌత్ పబ్లిసిటీతో కేకః, కేకస్య, కేకోభ్యః అనిపించుకుంటున్న తరుణంలో పైరసీ ఎఫెక్ట్ తీవ్రంగా దెబ్బతీస్తోంది. అయితే దీనిపై నిర్మాత దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను పైరసీ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్‌ శంకర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైరసీని నిర్మూలించేందుకు ఎలాంటి తీసుకోవాలనే అంశంపై సీసీఎస్‌సైబర్‌ క్రైమ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రఘువీర్‌తో చర్చించారు. చిత్రాన్ని పైరసీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. Last Updated 25, Mar 2018, 11:47 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV హాట్‌ను మించి హాట్‌గా హంసా నందిని! ఘాటెక్కించే అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న మిర్చీ బ్యూటీ హంసా నందిని.. మరింత ఘాటుగా కనిపించనుంది. విడుదలకు సిద్ధమవుతున్న ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో హంసా ఓ ఐటెమ్ సాంగ్‌లో మెరవనుంది. TNN | Updated: Jan 20, 2017, 11:52AM IST ఘాటెక్కించే అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న మిర్చీ బ్యూటీ హంసా నందిని .. మరింత ఘాటుగా కనిపించనుంది. విడుదలకు సిద్ధమవుతున్న ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో హంసా ఓ ఐటెమ్ సాంగ్‌లో మెరవనుంది. అయితే, ఇది ఐటెం సాంగ్ కాదట. సన్నివేశంలో భాగంగా వచ్చే ఐటెమ్ సాంగ్‌లాంటిదట. అంతేకాదు, హీరో రాజ్‌ తరుణ్ తనతో కలిసి డ్యాన్స్ చేయడట. ఆ పాటలో ఆమె మాత్రమే కనిపిస్తుందట. ఈ విషయాన్ని హంసా నందినీయే స్వయంగా వెల్లడించింది. ‘‘ఈ పాటను ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన రోడ్ సైడ్ డాబా సెట్‌లో రెండు రోజుల పాటు చిత్రీకరించారు. ఈ పాటలో ఇదివరకెప్పుడూ కనిపించనంత హాట్‌గా కనిపిస్తా. ఇది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హంసా వెల్లడించింది. ఇందుకు ఫిబ్రవరి 17 వరకు వేచి చూడండి అంటూ ముగించింది.
0business
Hyderabad, First Published 7, Mar 2019, 5:00 PM IST Highlights వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా తెర‌కెక్కుతున్న మ‌హ‌ర్షి చిత్రం రిలీజ్ డేట్  మళ్లీ మారిన సంగతి తెలిసిందే. ముందుగా ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అవుతుంద‌న్న నిర్మాత‌లు ఆ ఆ త‌ర్వాత 26 అన్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా తెర‌కెక్కుతున్న మ‌హ‌ర్షి చిత్రం రిలీజ్ డేట్  మళ్లీ మారిన సంగతి తెలిసిందే. ముందుగా ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అవుతుంద‌న్న నిర్మాత‌లు ఆ ఆ త‌ర్వాత 26 అన్నారు. మ‌ళ్ళీ రీసెంట్‌గా 25న త‌ప్ప‌క విడుద‌ల చేస్తామ‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు మ‌ళ్ళీ రిలీజ్ డేట్ మార్చారు. మే 9న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఎందుకు మళ్లీ వాయిదా వేసారన్నది సినీ వర్గాల్లోనే కాక అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.  అయితే కష్టపడి పూర్తి చేసిన చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్‌వర్క్ హడావిడిగా చేయడం ఇష్టం లేదు. అందుకే మే 9న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అని క్లారిఫై చేసారు దిల్ రాజు. కానీ అసలు కారణం అది కాదంటున్నారు కొందరు.  ఈ సినిమా రీషూట్ల వల్ల ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. సినిమాలోని కొన్ని ముఖ్యమైన సీన్లు మహేష్ బాబుకు నచ్చకపోవడంతో రీషూట్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. దిల్ రాజు కూడా రీషూట్స్ కు ఓకే అన్నారని, అందుకే ఈ రిలీజ్ డేట్ ని ముందుకు తోసారని చెప్తున్నారు.  ఇక మ‌హ‌ర్షి చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశ్వినీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి మే 9th వచ్చాయి. అలానే దిల్ రాజు బ్యానర్ లో పరుగు, భద్ర కూడా మే లో వచ్చాయి. ఈ సినిమాల‌న్నీ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించాయి. ఈ క్ర‌మంలో మేలో విడుద‌ల కానున్న మ‌హ‌ర్షి చిత్రం కూడా భారీ హిట్ కొడుతుంద‌ని  అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రంలో  హీరోయిన్ గా పూజా హెగ్డే న‌టిస్తుంది. అల్ల‌రి న‌రేష్ గెస్ట్ రోల్‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. Last Updated 7, Mar 2019, 5:00 PM IST
0business
Hyderabad, First Published 27, Jun 2019, 8:58 AM IST Highlights ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటని అన్నారు. విజయనిర్మల కుటుంబానికి సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు.. రోజు మొత్తం అభిమానుల సందర్శన కోసం పార్థివదేహాన్ని అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్ కి తరలిస్తారు. ఆ తరువాత ఆమెకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
0business
వాట్సాప్‌ పొగ.. ఎలాంటి సెగ రగిలిస్తుందో ? - లోవర్‌ వెర్షన్‌ మొబైల్‌ లలో వాట్సాప్‌ సేవల నిలుపుదల -  పోటీతత్వం, భద్రతలే కారణమంటున్న కంపెనీ -  నిషేధిత వెర్షన్లు అత్యధికంగా వాడుతుంది భారతీయులే - భద్రత ముసుగులో ఇండియన్స్‌ జేబులకు - కడవేర్గు చిల్లు పెడుతున్న కంపెనీ : వాట్సాప్‌ దారిని అనుసరిస్తున్న మరిన్ని సంస్థలు ఇన్‌ స్టెంట్‌ మెసేజింగ్‌ అప్లికేషన్‌ యాప్‌ వాట్సాప్‌ మరో పెను దుమారానికి వేదిక అయ్యేలా సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో రెండు సంచలనాత్మక వ్కెరస్‌ ఫ్కెల్స్‌ వాట్సాప్‌ యాప్‌ ద్వారా భారీగా షేర్‌ అవుతున్నాయని.. వాటి నుండి రక్షణ, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అవ్వడం మొదలు.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పాత వెర్షన్లలో తమ యాప్‌ సేవలు నిలిపివేయనున్నామని వాట్సాప్‌ కంపెనీ ప్రకటించే వరకు.. సాగిన ఈ 'చాప కింది నీటి' ప్రహసనం కార్పొరేట్‌, టెక్‌ విశ్లేషకులను నివ్వెరపరుస్తుంది. అయినా భద్రత కరువేనా ? ఐదు రోజుల క్రితం .. దేశంలో రెండు సంచలనాత్మక వ్కెరస్‌ ఫ్కెల్స్‌ వాట్సాప్‌ యాప్‌ ద్వారా భారీగా షేర్‌ అవుతున్నాయని .. వాటి నుండి జాగ్రత్త వహించాలని రక్షణ, భద్రతా సిబ్బందికి కేంద్ర భద్రతా ఏజన్సీలు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే! ఎన్‌ డీఏ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ), ఎన్‌ఐఎ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) పేరుతో.. వినియోగదారుల ఫోన్‌, డేటాపై దాడిచేసే అవకాశమున్న ఈ వైరస్‌ పూరిత మెసేజ్‌ ల ద్వారా బ్యాంకింగ్‌ పాస్‌ వర్డ్స్‌, పిన్‌ తదితర వివరాలు హ్యాక్‌ అయ్యే అవకాశం ఉందని సదరు సంస్థలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. అయితే, 2016 ఏప్రిల్‌ మాసంలో జరిగిన ఓ చర్చలో.. భారత టెలికాం నిబంధనల్ని పాటించకుండానే వాట్సాప్‌ కంపెనీ 256-బిట్‌ ఎన్‌క్రిప్షన్‌ని.. 'కీ' లేకుండానే వాడుతోందని బహిర్గతమయింది. తమ మెసేజింగ్‌ యాప్‌లోని డాటాను ఎవరూ హ్యాక్‌ చేయడానికి వీలు కలగకుండా కేవలం మెసేజ్‌ రాసేవారు, అవతల దాన్ని చూసుకునే వారికి మాత్రమే ఈ మెసేజ్‌లు కనిపించీ.. పూర్తి భద్రతతో ఉండటానికే వాట్సాప్‌ ఈ విధానాన్ని పాటిస్తున్నట్టు, వైరస్‌ పూరిత మెసేజ్‌లకు ఆస్కారం లేకుండా ఈ చర్య సహకరిస్తుందని సదరు కంపెనీ ఆ సమయంలో తెల్పింది. ప్రభుత్వ అనుమతి లేకుండా వాట్సాప్‌ చేస్తున్న ఎన్‌క్రిప్షన్‌ తతంగాన్ని ట్రారు కూడా చూస్తూ ఉండిపోయింది. ఐతే, వాట్సాప్‌ కంపెనీ 256-బిట్‌ ఎన్‌క్రిప్షన్‌ని వాడుతూ అంత పటిష్టంగా ఉన్నా.. ఎన్‌డీఏ, ఎన్‌ఐఎ పేరుతో వ్కెరస్‌ ఫ్కెల్స్‌ యాప్‌ మాధ్యమాల్లో ఎలా వీరవిహారం చేస్తున్నాయో ఆ సంస్థకే తెలియాలి. మీకు మా సేవలు ఉండవు వ్కెరస్‌ ఫ్కెల్స్‌ కథ ముగియక ముందే.. తాజాగా, వాట్సాప్‌ కంపెనీ చేసిన ప్రకటన మార్కెట్‌ వర్గాల్లో సంచలనానికి కేంద్రబిందువు అయింది. తమ సర్వీసులు ఆండ్రాయిడ్‌ 2.1, 2.2, విండోస్‌ ఫోన్‌ 7, ఐఫోన్‌ 3జిఎస్‌, ఐఓఎస్‌ 6 ప్లాట్‌ ఫాంలను ఉపయోగించే మొబైల్‌లలో ఇకపై ఉండవని..వినియోగదారులు వాట్సాప్‌ యాప్‌ తమ మొబైల్‌లలో కావాలనుకుంటే అప్‌ గ్రేడెడ్‌ వెర్షన్లను సపోర్ట్‌ చేసే ఫోన్లకు మారాలని తెలిపింది. ''టెక్‌ ప్రపంచంలో ఇతర యాప్‌ల పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే కొత్త ఫీచర్లను తీసుకురావడంతో పాటు, సెక్యురిటీ కూడా ముఖ్యమేనని.. లోవర్‌ మొబైల్‌ వెర్షన్‌ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వెసులుబాటు లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని'' కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఐతే, బ్లాక్‌ బెర్రీ, నోకియా మోడల్‌ ( ఎస్‌ 40, ఎస్‌ 60 ) మొబైల్‌లలో వాట్సాప్‌ సర్వీసులను ఉపయోగించుకునే అవకాశాన్ని జూన్‌ 2017 వరకు కంపెనీ ఇవ్వడం గమనార్హం. లైన్‌ కడుతున్నాయి మరి లోవర్‌ వెర్షన్లలో తమ సర్వీసులను ఇవ్వలేమని వాట్సాప్‌ ప్రకటించిందో లేదో..టెలిగ్రాం సంస్థ ఆండ్రాయిడ్‌ 3.0 వెర్షన్‌ తో పాటు అంతకు లోబడి ఉన్న వెర్షన్లను ఉపయోగించే వారికి తమ సర్వీసులను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సుమారు 1.96 కోట్ల మంది టెలిగ్రాం సేవలకు దూరం కానున్నారు. ఒక్క టెలిగ్రాం మాత్రమే కాదు..ప్రస్తుతం పేరుమోసిన మరికొన్ని సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ యాప్‌లు కూడా వాట్సాప్‌ మార్గాన్నే అనుసరించబోతున్నాయని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంత ప్రభావమో తెలుసా ? వాట్సాప్‌ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా వందకోట్లకు పైగా వినియోగదారులున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌ కి పెద్ద మార్కెట్‌గా ఇండియా అవతరించింది. ప్రతి నెలా ఎంత లేదన్నా..సుమారు 16కోట్ల మంది భారతీయులు వాట్సాప్‌ లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది తమ మొబైల్‌ లలో ప్రస్తుతం వాట్సాప్‌ నిషేదించిన ప్లాట్‌ఫారమ్‌లనే వాడుతున్నారని సర్వేల సారాంశం. భద్రత, అధునాతన ఫీచర్‌ల పేరుతో వాట్సాప్‌ చేస్తున్న ఈ యాగి .. ఎంత మంది మిడిల్‌ క్లాస్‌ భారతీయులను కొత్త మొబైల్‌ల కొనుగోళ్ళ వైపు తీసుకెళ్ళి.. వారి జేబులను గుల్ల చేయనుందో కాలమే చెప్పాలి. ఇండియాలో వాట్సాప్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు * భారత్‌ లో ఈ సంవత్సరం దీపావళి పర్వదినాన కేవలం వాట్సాప్‌ ద్వారా ఒక్క రోజులో 800 కోట్ల మెసేజ్‌ లు పంపబడ్డాయి. * భారత్‌ వాట్సాప్‌కి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అలాగే, దేశంలోని సుమారు పదికి పైగా భాషలను ఈ యాప్‌ సపోర్ట్‌ చేస్తుంది. * వాట్సాప్‌ పేరెంట్‌ సంస్థ ఫేస్‌బుక్‌కి భారత్‌లో 15.5 కోట్ల నెల వారీ యాక్టివ్‌ యూజర్లుంటే, వాట్సాప్‌కి 16 కోట్ల మంది ఉన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్ vs దక్షిణాఫ్రికా: లైవ్ క్రికెట్ అప్‌డేట్స్ కొత్త ఏడాది ఆరంభంలోనే కోహ్లి సారథ్యంలోని భారత జట్టుకి కఠిన సవాల్ ఎదురైంది. పేస్ పిచ్‌లకి స్వర్గధామంగా పేరొందిన దక్షిణాఫ్రికాలో టీమిండియా సుధీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. TNN | Updated: Feb 25, 2018, 06:32PM IST భారత్ vs దక్షిణాఫ్రికా: లైవ్ క్రికెట్ అప్‌డేట్స్ కొత్త ఏడాది ఆరంభంలోనే కోహ్లి సారథ్యంలోని భారత జట్టుకి కఠిన సవాల్ ఎదురుకానుంది. పేస్ పిచ్‌లకి స్వర్గధామంగా పేరొందిన దక్షిణాఫ్రికాలో టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ ప్రయాణాన్ని శుక్రవారం (జనవరి 5) నుంచి ఆరంభించింది. గత ఏడాది ఆడిన అన్ని టెస్టు సిరీస్‌ల్లోనూ గెలిచి జైత్రయాత్ర సాగించిన భారత జట్టు అదే జోరుని సఫారీ గడ్డపై కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా గెలుచుకోలేదు. సిరీస్‌లో మ్యాచ్‌లన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం తరవాత ప్రారంభంకానున్నాయి.
2sports
ind vs ban 1st t20: shikhar dhawan, washington sundar take india to 148/6 భారత్‌తో తొలి టీ20లో బంగ్లా టార్గెట్ 149 భారత్ ఇన్నింగ్స్‌ని కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆరంభించగా.. ఆఖరి రెండు ఓవర్లలో కృనాల్‌ పాండ్య , వాషింగ్టన్ సుందర్ భారీ షాట్లు ఆడి మెరుగైన స్కోరు అందించారు. Samayam Telugu | Updated: Nov 3, 2019, 08:59PM IST India's Shikhar Dhawan ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆశించిన మేర దూకుడుగా ఆడలేకపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (41: 42 బంతుల్లో 3x4, 1x6) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగలిగింది. భారీ అంచనాల మధ్య తొలి మ్యాచ్ ఆడిన యువ పవర్ హిట్టర్ శివమ్ దూబే (1) తేలిపోయాడు. Visit Site Recommended byColombia మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2x4) తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాది ఔటైపోయాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (15: 17 బంతుల్లో 2x4) బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై వికెట్ చేజార్చుకోగా.. శ్రేయాస్ అయ్యర్ (22: 13 బంతుల్లో 1x3, 2x6) సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటైపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (27: 26 బంతుల్లో 3x4) 19వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచినా.. ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయాడు. కానీ.. చివరి రెండు ఓవర్లలో కృనాల్‌ పాండ్య (15 నాటౌట్: 8 బంతుల్లో 1x4, 1x6), వాషింగ్టన్ సుందర్ (14 నాటౌట్: 5 బంతుల్లో 2x6) భారీ షాట్లు ఆడి మెరుగైన స్కోరుని టీమ్‌కి అందించారు.
2sports
Suresh 88 Views ashok నిర్మలా లాజిస్టిక్స్‌కు 20 అశోక్‌లేలాండ్‌ గురు ట్రక్కులు హైదరాబాద్‌,ఆగస్టు 7:అశోక్‌లేలాండ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన కొత్త గురుట్రక్‌లను మొత్తం 20వరకూ ఏకమొత్తంలో కస్టమరుకు సరఫరా చేసారు. ఆటోమోటివ్‌ మాన్యుఫ్యాకర్చరర్స్‌ మాధవ్‌శర్మ, అశోక్‌లేలాండ్‌ రీజినల్‌మేనేజర్‌ దివాకర్‌రెడ్డిలు కలిసి నగరంలో తమ క్లయింట్‌ నిర్మలా లాజిస్టిక్స్‌కు 20 గురు బిఎస్‌4 ట్రక్కు లను పంపిణీచేసింది.ఇంటిలిజెంట్‌ ఎగ్జాస్ట్‌ గ్యాస్‌ రీసర్క్యులేషన్‌ వ్యవస్థతో రూపొందించిన గురు ట్రక్కులు రవాణారంగానికి ఎంతో ఉపకరి స్తాయని కంపెనీ వెల్లడించింది. బిఎస్‌-4 ఉద్గా రాల నిబంధనలకు అనుగుణంగా ఐఇజిఆర్‌ టెక్నా లజీని ఈ ఏడాది ఏప్రిల్‌లోప్రారంభించింది. 400 హెచ్‌పివరకూ ఉన్న ఇంజన్లకు ఈ వ్యవస్థను అమ ర్చింది. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ ఇతర సంస్థ లోను ఈవ్యవస్థలేదు. అశోక్‌లేలాండ్‌ గురుట్రక్కు లు అత్యధికఇంధన సామర్ధ్యంతో ఉంటాయి. హెచ్‌ సిరీస్‌ఇంజన్లు 115హెచ్‌పితో నడుస్తున్నాయి. 11.9 టన్నుల జివిడబ్ల్యు, 13.1టన్నుల జివిడబ్ల్యు ఎక్కు వ పేలోడ్‌తో వస్తున్నది. పవర్‌స్టీరింగ్‌, రేడియల్‌ టైర్లుఇతర అన్నిప్రామాణిక ఫీచర్లతోపాటు అనువైన క్యాబిన్‌లోమ్యూజిక్‌ వ్యవస్థ, నిద్రపోయేందుకు సౌకర్యం, మొబైల్‌ఛార్జర్‌ వంటివ ఇఉన్నాయి. అశోక్‌లేలాండ్‌కు ఆటోమోటివ్‌ మాన్యుఫ్యాకర్చరర్స్‌ అధీకృత డీర్‌గా పనిచేస్తోంది. తెలంగాణెంపిల్లో మొత్తం 30 సేవల కేంద్రాలు ఏర్పాటుచేసింది.
1entertainment
వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో `ఫిదా` ది బెస్ట్ మూవీ అవుతుంది - దిల్‌రాజు Highlights శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న‌ చిత్రం `ఫిదా` శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్, ప్రేమ‌మ్ ఫేమ్‌ సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా ఫిదా ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌న కుటుంబంతో క‌లిసి చూసే అంద‌మైన ప్రేమ‌క‌థ‌ ఫిదా అన్న దిల్ రాజు   శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న‌ చిత్రం `ఫిదా`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ‌మ్ ఫేమ్‌ సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.శ‌క్తికాంత్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేయ‌గా, తొలి సీడీని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా..   ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌న కుటుంబంతో క‌లిసి చూసే అంద‌మైన ప్రేమ‌క‌థ‌ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా ఎలాగో ఖుషీ లాంటి సినిమా ఫిదా. ఈ సినిమా క‌థ‌ను శేఖ‌ర్ చెప్ప‌గానే నాకు ఇందులోని హీరో, హీరోయిన్ క్యారెక్ట‌ర్స్ బాగా న‌చ్చాయి. శేఖ‌ర్ క‌మ్ముల హీరోగా ఎవ‌రినీ తీసుకోవాల‌నుకుంటున్న‌ప్పుడు వ‌రుణ్‌తో సినిమా చేద్దామ‌ని అన్నాను. ఎందుకంటే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో తొలి ప్రేమ‌, సుస్వాగ‌తం సినిమాలు చేశారు. అలా స్టార్టింగ్‌లో ల‌వ్‌స్టోరీస్ చేస్తే హీరోలు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతారు. అల్లు అర్జున్ చేసిన ఆర్య కూడా ల‌వ్‌స్టోరీ చేశారు. ఓ అప్ క‌మింగ్ హీరో ల‌వ్‌స్టోరీ చేయాల‌ని నేను కోరుకుంటాను. అలా వ‌రుణ్‌తో ఈ ల‌వ్‌స్టోరీ చేద్దామ‌ని అన‌గానే శేఖ‌ర్ వ‌రుణ్‌కు ఈ క‌థ‌ను చెప్పాడు. వ‌రుణ్‌కు క‌థ న‌చ్చ‌డంతో ట్రావెల్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా 100 ప‌ర్సెంట్ శేఖ‌ర్ క‌మ్ముల స్టైల్ మూవీ. ఆయ‌న ఆనంద్‌, హ్యాపీడేస్ సినిమాల‌ను ఎలా చేశారు. అలా ఫిదా సినిమాను చేశారు. ఆనంద్‌, హ్యాపీడేస్ సినిమాలు త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల‌కు స‌రైన హిట్ కాలేదు. త‌ర్వాత ఆ రేంజ్‌లో ఫిదా ప‌క్కా శేఖ‌ర్ క‌మ్ముల స్టైల్ మూవీ. ఈ సినిమా ట్రావెల్ మ‌ర‌చిపోలేనిది. శేఖ‌ర్ కెరీర్‌లో ఆనంద్‌, హ్యాపీడేస్ త‌ర్వాత ఫిదా మూవీ నిలుస్తుంది. మంచి టీంను తీసుకుని శేఖ‌ర్ స్టైల్‌లో చేయించుకున్నాడు. ది బెస్ట్ అవుట్‌పుట్ వ‌చ్చింది. వ‌రుణ్ గురించి మాట్లాడాలంటే, ముందు మెగాస్టార్ చిరంజీవిగారి గురించే మాట్లాడాలి. నేను ఆడియెన్‌గా ఉన్న‌ప్పుడు స్టేట్‌రౌడీ సినిమా షూటింగ్‌లో ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూశాను. త‌ర్వాత అల్లుడా మ‌జాకా సినిమాకు డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఆయ‌న చేతుల మీదుగా షీల్డు తీసుకున్నాను. చిరంజీవిగారు ఉన్నారు కాబ‌ట్టే త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు, రామ్‌చ‌ర‌ణ్‌, వ‌రుణ్‌, సాయి ఇలా అంద‌రూ హీరోలు అయ్యారు. కాబ‌ట్టి చిరంజీవిగారిని త‌లుచుకోకుండా వ‌రుణ్‌కు సంబంధించిన ఏ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌దు. ఫిదా వ‌రుణ్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అవుతుంది. పెర్ఫామెన్స్ ప‌రంగా, క‌లెక్ష‌న్స్ ప‌రంగా వ‌రుణ్‌కు ఇది బెస్ట్ మూవీ అవుతుంది. శేఖ‌ర్ త‌న సినిమాల్లో సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా తండ్రి కొడుకుల మ‌ధ్య సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి అంద‌రూ ప్రేక్ష‌కులు తమ ఫ్యామిలీతో వెళ్లి చూసే సినిమా అవుతుంది. క్యూట్ ల‌వ్‌స్టోరీ. సినిమా జూలై 21న సినిమా విడుద‌ల కానుంది. ఆరు నెల‌ల్లో హ్యాట్రిక్ కొట్టాం. ఫిదా మ‌రో స‌క్సెస్ అవుతుంది`` అన్నారు.   తొలిప్రేమ‌, ఖుషీ సినిమాలు గుర్తుకొస్తాయి శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ - ``నా సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. నాకు కూడా టెన్ష‌న్‌గానే ఉంది. సాధార‌ణంగా నా సినిమాల‌ను పోల్చుకుంటూ ఉంటాను. అలా చూసుకున్న‌ప్పుడు `ఫిదా` చిత్రం నా కూతురులాంటి చిత్రం. చాలా ధైర్యంగా, నిజాయితీగా సినిమా ఉంటుంది. సినిమాను 70-80 రోజుల్లో పూర్తి చేసేస్తాన‌ని రాజుగారికి చెప్పాను. కానీ కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. వ‌రుణ్‌తేజ్‌కు కాలు ఫ్రాక్చ‌ర్ అయ్యింది. కొన్ని రోజులు వెయిట్ చేశాం. అలా కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యింది. అమెరికాలో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు కొన్ని స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో దిల్‌రాజుగారు వ‌చ్చారు. మా స‌మ‌స్య‌ల‌ను దిల్‌రాజుగారు తీరుస్తారు అనుకునే స‌మ‌యంలోనే ఆయ‌న శ్రీమ‌తి అనిత‌గారు హాస్పిట‌ల్‌లో ఉన్నార‌ని తెలిసింది. త‌ర్వాత రోజే మాకు అస‌లు విష‌యం తెలిసింది. మేం షాక్ అయ్యాం. దిల్‌రాజు అదే రోజున రిట‌ర్న్ అయ్యారు. ఇలా చాలా క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి చేసిన ఫిదా సినిమాకు ట్రెమెండ‌స్ రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని భావిస్తున్నాను. రాజుగారు నిర్మాత కావ‌డ‌మే పెద్ద ఎసెట్‌. వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్లవి ఇలా అంద‌రూ పెద్ద ఎసెట్‌గా నిలిచారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఎవ‌రో ట్రైల‌ర్‌లో లీడ్ పెయిర్‌ను చూసి ఖుషీ సినిమా గుర్తుకు వ‌స్తుంద‌ని అన్నారు. నిజంగానే ఖుషీ, తొలిప్రేమ‌ గుర్తుకొస్తుంది. ఇందులో ప‌ల్ల‌వి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్‌. ప‌ల్ల‌వి ట్రెమెండ‌స్ హీరోయిన్‌. గ్రేట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. వ‌రుణ్ స్మైల్‌, స్టైల్ చాలా బాగుంటుంది. చాలా రోజుల త‌ర్వాత హీరో క్యారెక్ట‌ర్‌ను చూస్తే క‌న్నీళ్లు పెట్టుకునే ల‌వర్ పాత్రలో క‌న‌ప‌డ‌తాడు. అప్పుడెప్పుడో తొలిప్రేమ‌లో ప‌వ‌న్ అలాంటి రోల్ చేశాడు. త‌ర్వాత అలాంటి పాత్ర‌లో వ‌రుణ్ క‌న‌ప‌డ‌తాడు. వ‌రుణ్‌లో అన్ని షేడ్స్ ఉన్నాయి. త‌న‌లో చిరంజీవిగారు, ప‌వ‌న్‌గారు, నాగ‌బాబుగారు క‌న‌ప‌డ‌తారు. భాన్సువాడ‌లో ప్ర‌జ‌లు ఎంతో స‌పోర్ట్ చేశారు. అలాగే యు.ఎస్‌లో అస్ట‌న్‌లో ప్రజలు ఎంతో స‌పోర్ట్ చేశారు. శ‌క్తికాంత్ చాలా అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. త‌న‌కు థాంక్స్‌. సీతారామ‌శాస్త్రిగారి అబ్బాయి రాజా ఇందులో చాలా మంచి రోల్ చేశాడు. సినిమాను ఏడాదిపాటు తీశాం. కానీ రాజుగారు ఇచ్చిన స‌పోర్ట్ మ‌ర‌చిపోలేను. ఆయ‌న స్కూల్ నుండి వ‌చ్చిన సినిమాలాగే ఫిదా ఆడియెన్స్‌ను అల‌రిస్తుంది.  నాకు సినిమా రిజ‌ల్ట్ తెలుసు. సినిమా చాలా డిఫ‌రెంట్ మూవీగా మెప్పిస్తుంది`` అన్నారు.   అభిమానులు త‌లెత్తుకునే సినిమాలే చేస్తాను వ‌రుణ్‌తేజ్ మాట్లాడుతూ - ``ఫిదా సినిమాకు శ‌క్తికాంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నా కెరీర్‌లో ది బెస్ట్ ఆల్బ‌మ్ ఇచ్చారు. సీతారామ‌శాస్త్రిగారు, చైత‌న్య‌, సుద్ధాల అశోక్‌తేజ‌గారు మంచి సాహిత్యం అందించారు. శేఖ‌ర్‌గారు సినిమాలు చూస్తే ఆనంద్‌, హ్యాపీడేస్ సినిమాలు క‌ల్ట్ మూవీస్‌. చాలా సెన్సిబుల్ పాయింట్స్‌తో సినిమాలు అలాగే ఈ సినిమా ఉంటుంది. దిల్‌రాజుగారికి థాంక్స్‌. 25వ సినిమాల‌ను నిర్మించిన దిల్‌రాజుగారికి, మా ఫిదా సినిమాతో తదుప‌రి 25 సినిమాలు వ‌రుస‌గా చేయాలని కోరుకుంటున్నాను. చాలా న‌మ్మ‌కాన్ని ఇచ్చారు. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ చాలా స్ట్రాంగ్‌. చాలా మాస్‌గా ఉంటుంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్ అన‌గానే, నేను సాయిప‌ల్ల‌వి న‌టించిన ప్రేమ‌మ్ సినిమాను అప్పటికే చూడ‌టంతో చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. భానుమ‌తి క్యారెక్ట‌ర్‌కు రెండు వంద‌ల శాతం న్యాయం చేసింది. సినిమా చూస్తే త‌ను త‌ప్ప ఆ క్యారెక్ట‌ర్ మ‌రెవ‌రూ చేయ‌లేర‌ని ప్రేక్ష‌కులు అంగీక‌రిస్తారు. మా పెద్ద‌నాన్న‌, బాబాయ్‌లాగానే కొత్త త‌ర‌హా సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాను. రెండు, మూడు చోట్ల త‌ప్ప‌ట‌డుగులు వేశాను. ఇక‌పై మంచి సినిమాలే చేస్తాను. అభిమానులు త‌లెత్తుకునేలా చేస్తాను. నేను ఇక్క‌డ‌కు రావ‌డానికి కార‌ణం, నా బ‌లం మెగాస్టార్ చిరంజీవిగారే. త‌ర్వాత బాబాయ్‌గారే ఇష్టం. ఇక సినిమాను చూస్తే మీకు సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. చాలా మంచి ఎమోష‌న్స్ ఉంటాయి. మంచి సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ కుదిరాయి. సినిమా జూలై 21న విడుద‌ల‌వుతుంది. సినిమా అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుందని కోరుకుంటున్నాను`` అన్నారు.   బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ - ``ఈ సినిమాతో చాలా తీపి గుర్తులున్నాయి. ఇంత మంచి క్యారెక్ట‌ర్ నాకు ఇచ్చినందుకు శేఖ‌ర్ క‌మ్ముల‌గారికి థాంక్స్‌. ఆయ‌న ద‌గ్గ‌ర నుండి ప్రొఫెష‌న‌ల్‌గానే కాదు, ప‌ర్స‌న‌ల్‌గా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ. సినిమా చూసిన ప్రేక్ష‌కులు చాలా హ్యాపీగా ఫీల‌వుతారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.   సుకుమార్ మాట్లాడుతూ - ``శేఖ‌ర్ స్మైల్ చాలా స్వ‌చ్ఛంగా ఉంటుంది. త‌న సినిమాలు చూస్తే ప్రేమ పుడుతుంది. శేఖ‌ర్ సినిమాలు చూస్తే నాకు అసూయ క‌లుగుతుంది. ఎందుకంటే పెద్ద సినిమాల్లో బాహుబ‌లి సినిమాను నేను ఎప్ప‌టికీ తీయ‌లేను. అలాగే చిన్న సినిమాల్లో హ్యాపీడేస్ వంటి సినిమాను కూడా తీయ‌లేను. ట్రై చేసి 100% ల‌వ్ మూవీ చేశాను. ఏదైనా నెరేష‌న్ ఏ ఫ్లోలో ఉండాల‌నుకున్న‌ప్పుడు శేఖ‌ర్ సినిమాలు చూస్తాను. దిల్‌రాజు స‌క్సెస్ సినిమాల‌ను త‌న చేతిలో పెట్టుకుని తిరుగుతున్నార‌న‌పిస్తుంది. ఫిదా సినిమా విష‌యానికి వ‌స్తే, వ‌రుణ్ గురించి చెప్పాలి. వ‌రుణ్ త‌ప్ప‌కుండా మంచి ఉన్న‌తికి ఎదుగుతాడు. త‌న‌కు సినిమాలంటే ప్యాష‌న్ ఉంది`` అన్నారు.   సంగీత ద‌ర్శ‌కుడు శ‌క్తికాంత్ మాట్లాడుతూ - ``దిల్‌రాజుగారికి, శేఖ‌ర్ క‌మ్ముల గారికి థాంక్స్‌`` అన్నారు.   నాని మాట్లాడుతూ - ``దిల్‌రాజుగారు ఫిదా సినిమా లైన్ చెప్పారు. చెప్ప‌గానే ఇది ష్యూర్ షాట్ హిట్ అవుతుంద‌ని చెప్పాను. ఫిదా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంది`` అన్నారు. సీతారామ‌శాస్త్రి మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ చూడ‌టం, పాట‌లు విన‌డంతో ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. శేఖ‌ర్ క‌మ్మ‌ని కాఫీలాంటి సినిమాతో కెరీర్‌ను స్టార్ చేసి అలాగే అహ్లాద‌క‌ర‌మైన సినిమాలు చేస్తున్నాడు. త‌న‌తో మంచి బాంధ‌వ్యం ఉంది. శ‌క్తికాంత్ మంచి మ్యూజిక్ అందించాడు. వ‌రుణ్ మంచి ఇంప్రెష‌న్ వేసేలా ఫిదాలో న‌టించాడ‌నిపిస్తుంది. త‌ను భ‌విష్య‌త్‌లో స్టార్ క‌న్నా కూడా మంచి న‌టుడిగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - ``శేఖ‌ర్ క‌మ్ముల‌గారి డాల‌ర్ డ్రీమ్స్ సినిమా చూసి, ఆయ‌న సినిమాల‌ను ఫాలో కావ‌డం మొద‌లు పెట్టాను. ఆయ‌న‌కంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నారు. ఆనంద్, గోదావ‌రి త‌ర్వాత శేఖ‌ర్ గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ల‌వ్‌స్టోరీ. వ‌రుణ్ త‌న సినిమాల‌ను ఎంచుకునే విధానం చూస్తే త‌ను ఎలాంటి న‌టుడిగా ఎద‌గాల‌నుకుంటున్నాడ‌నే విష‌యం మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. యూత్‌కు బాగా న‌చ్చే సినిమా అవుతుంది. దిల్‌రాజుగారు విజ‌యాల ప‌రంప‌ర‌ను ఇలాగే కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నాను. శ‌క్తికాంత్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.   ఇదే కార్య‌క్ర‌మంలో నేను లోక‌ల్‌, శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాల 100 రోజుల షీల్డ్స్‌ను యూనిట్‌కు అందించారు. Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0business
Hyderabad, First Published 17, Sep 2018, 5:45 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ హౌస్ నుండి బయటకి వెళ్లినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ హౌస్ నుండి బయటకి వెళ్లినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ సీజన్ 2 లో ఉన్న హౌస్ మేట్స్ అందరిలో కంటే కౌశల్ కి అభిమానగణం బాగా పెరిగిందనే చెప్పాలి. మొదటి నుండి హౌస్ మేట్స్ అతడిని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అతడికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఎంతగా అంటే అతడి కోసం సోషల్ మీడియాలో ఆర్మీలు తయారవ్వడం, అతడి కోసం 2కె రన్ లు చేయడం వరకు వెళ్లింది. కౌశల్ విన్నర్ అవ్వాలని అతడిఅభిమానులు కోరుకుంటుంటే సడెన్ గా కౌశల్ ని ఇంటి నుండి బయటకి పంపేశారట. అతడు బయటకి వెళ్లడం కలకలం రేపుతోంది. కౌశల్ ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందంటే దానికి కారణం ఓ అభిమాని అని తెలుస్తోంది. ఇప్పటివరకు హౌస్ లో మిస్టర్ పెర్ఫెక్ట్ గా ఉంటోన్న కౌశల్ ని కావాలని టార్గెట్ చేసి బ్యాడ్ ఇమేజ్ తీసుకొస్తున్నారనేది కొందరి ఆరోపణలు. ఓ అభిమానైతే ఏకముగా తిండి మానేసి ఆరోగ్యం పాడుచేసుకున్నాడట. దీంతో అతడు ప్రస్తుతం ఆసుపత్రి పాలయ్యాడు. సదరు అభిమాని తల్లితండ్రులు ఈ విషయాన్ని బిగ్ బాస్ దృష్టికి తీసుకెళ్లగా.. దీంతో అతడిని చూడడానికి బిగ్ బాస్ కౌశల్ ని బయటకి పంపినట్లు టాక్. అయితే ఈ దృశ్యాలను మాత్రం షోలో చూపించే అవకాశాలు లేవని అంటున్నారు. గంట సేపు కౌశల్ ని బయటకు తీసుకెళ్లి మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో నిజానిజాలు తెలియాల్సివున్నాయి! ఇవి కూడా చదవండి..
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మ్యాచ్‌కి ముందు జెర్సీ పొగొట్టుకున్న ఓపెనర్ బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కి ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ తన జెర్సీని పొగొట్టుకున్నాడు. దీంతో మరో ఓపెనర్ హసీమ్ ఆమ్లా జెర్సీని TNN | Updated: Oct 27, 2017, 04:10PM IST బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కి ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ తన జెర్సీని పొగొట్టుకున్నాడు. దీంతో మరో ఓపెనర్ హసీమ్ ఆమ్లా జెర్సీని వేసుకుని అతను మైదానంలోకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. బ్యాటింగ్‌కి వెళ్లే ముందు తన జెర్సీ కనిపించకపోవడంతో కాసేపు డికాక్ అయోమయానికి గురయ్యాడట. దీంతో పక్కనే ఉన్న ఆమ్లా తన అదనపు జెర్సీని అతనికి ఇచ్చినట్లు కామెంటేటర్లు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఆమ్లా (3) ఔటైపోయినా.. డికాక్ (59: 44 బంతుల్లో 5x4, 1x6) మాత్రం అర్ధశతకంతో సత్తాచాటాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు తమదైన శైలిలో ‘ఆమ్లా ఔట్.. కానీ బ్యాటింగ్ చేస్తున్నాడు’ అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు. డికాక్‌తో పాటు డివిలియర్స్ (49: 27 బంతుల్లో 8x4) కూడా సత్తాచాటడంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 175/9కే పరిమితమైంది.
2sports
ఉగాది రోజున వందో సినిమా ప్రకటన TNN| Apr 8, 2016, 09.07 AM IST అమరావతిలోని ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వద్ద శుక్రవారం తన వందో సినిమాని ప్రకటించనున్నారు బాలయ్య. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమాని తీయబోతున్నారు. నాటి ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య నటించబోతున్నారు. నాటి ధాన్యకటకమే నేడు ధరణికోట, అమరావతిగా విలసిల్లుతున్నాయి. ఇక్కడ నుంచి బీహార్లోని మగధ వరకు సువిశాలంగా తెలుగు సామ్రాజ్యాన్ని విస్తరించిన మహావీరుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ చక్రవర్తిగా తమ అభిమాన నటుడు నటిస్తుండంతో అమరావతిలోని బాలయ్య అభిమానులు ఆనందిస్తున్నారు. అందుకే అమరావతిలోనే ఆ సినిమా ప్రకటనను చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
0business
మీరెప్పుడైనా.. ముగ్గురితో గడిపారా..? హీరోయిన్ కి అసభ్యకర ప్రశ్న Highlights  'మీరు వర్జినా' అని ప్రశ్నించాడు. దానికి ఆమె 'నేను వర్జిన్ కాదు.. స్కార్పియో(వృశ్చికం)' అని బదులిచ్చింది. సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. వారితో మాట్లాడుతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం చాట్ లు నిర్వహిస్తూ తమ విషయాలను షేర్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు అభిమానుల నుండి కొన్ని అసభ్యకర ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. ఇలా జరిగే సమయంలో కొందరు నటీమణులు కోపం తెచ్చుకోవడం, సదరు నెటిజన్ ని దూషించడం వంటివి చేస్తుంటారు. మరికొందరైతే పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్తారు. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తనకు ఎదురైన కొన్ని అసభ్యకర ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ బ్రూనా అబ్దుల్లాని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా.. 'మీరు వర్జినా' అని ప్రశ్నించాడు. దానికి ఆమె 'నేను వర్జిన్ కాదు.. స్కార్పియో(వృశ్చికం)' అని బదులిచ్చింది. మరో వ్యక్తి 'మీరెప్పుడైనా ముగ్గురితో గడిపారా' అని ప్రశ్నించగా.. 'ముగ్గురితో గడపడం గురించే కదా మీరు అడిగింది. అవును.. నేను గడిపాను. నా ఇద్దరు స్నేహితులతో కలిసి లంచ్ చేస్తుంటాను' అని వెల్లడించింది. Last Updated 7, Aug 2018, 2:19 PM IST
0business
Hyderabad, First Published 16, Aug 2019, 4:21 PM IST Highlights   టాలెంటెడ్ యంగ్ యాక్టర్ శ్రీ విష్ణు డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నాడు. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త పాయింట్ తో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోన్న శ్రీ విష్ణు నెక్స్ట్ తిప్పరా మీసం అనే సినిమాతో రాబోతున్నాడు. టాలెంటెడ్ యంగ్ యాక్టర్ శ్రీ విష్ణు డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నాడు. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త పాయింట్ తో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోన్న శ్రీ విష్ణు నెక్స్ట్ తిప్పరా మీసం అనే సినిమాతో రాబోతున్నాడు.  ఫుల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.  గతంలో శ్రీ విష్ణు నటించిన నీది నాది ఒకే కథ - మెంటల్ మదిలో సినిమాలతో పాటు ఇటీవల వచ్చిన బ్రోచేవారెవరురా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇక ఇప్పుడు వాటికంటే బిన్నంగా తిప్పరా మీసం అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇటీవల సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.  ఆ పోస్టర్ సినీ లవర్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా టీజర్ ను మరో రెండు వారాల్లో రిలీజ్ చేయాలనీ శ్రీ విష్ణు ప్లాన్ చేసుకుంటున్నాడు. నారా రోహిత్ అసురా సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణా విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ సినిమాను నిర్మిస్తున్నాడు.   Last Updated 16, Aug 2019, 4:21 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పుజారాకి తన బలమేంటో తెలుసు..! : మయాంక్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌‌ని చూడటం చాలా గొప్ప అనుభూతి. అతనికి తన బలంపై స్పష్టమైన అవగాహన ఉంది. ఎక్కడా ఏకాగ్రత కోల్పోకుండా చక్కగా ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. -మయాంక్ అగర్వాల్ Samayam Telugu | Updated: Jan 3, 2019, 03:43PM IST పుజారాకి తన బలమేంటో తెలుసు..! : మయాంక్ భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారాకి తన బలంపై స్పష్టమైన అవగాహన ఉందని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కితాబిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (130 బ్యాటింగ్: 250 బంతుల్లో 16x4) అజేయ శతకం బాదడంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 303/4తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ (9: 6 బంతుల్లో 2x4) ఔటవగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77: 112 బంతుల్లో 7x4, 2x6)తో కలిసి రెండో వికెట్‌కి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ దాదాపు 32 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా‌కి వికెట్ ఇవ్వలేదు. ఈరోజు ఆట ముగిసిన తర్వాత పుజారా ‘శతక’ ఇన్నింగ్స్ గురించి మయాంక్ అగర్వాల్ మాట్లాడాడు. ‘నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌‌ని చూడటం చాలా గొప్ప అనుభూతి. అతనికి తన బలంపై స్పష్టమైన అవగాహన ఉంది. ఎక్కడా ఏకాగ్రత కోల్పోకుండా చక్కగా ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. పుజారా డిఫెన్స్ దుర్భేద్యం. గతి తప్పిన బంతుల కోసం ఎదురుచూసిన అతను.. అదును చూసి ఆస్ట్రేలియా బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు’ అని మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Cash బ్యాంకులు, పోస్టాఫీసులు పాతనోట్లు జమచేయాలి న్యూఢిల్లీ, జూన్‌ 22: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్లు రూ.5090, రూ.100 నోట్లను రిజర్వు బ్యాంకువద్ద వచ్చేనెల 20వ తేదీలోపు జమచేయాలని ఆదేశాలు జారీచేసింది. పెద్దనోట్ల రద్దు కాలంలో బ్యాంకులు, పోస్టాఫీసులకు భారీ ఎత్తున పెద్దనోట్లు అందాయి. వీటన్నింటిని రిజర్వుబ్యాంకు కరెన్సీ చెస్ట్‌ లకు బ్యాంకులు తరలిస్తూ వచ్చాయి. తాజాగా రెండో సారి రిజర్వుబ్యాంకు గడువును పెంచి బ్యాంకులు, పోస్టాఫీసులు తమ వద్ద ఉన్న పాతనోట్లను జూలై 20వ తేదీలోపు జమచేయాలని ఆదేశించింది. వీటితోపాటు సహకార బ్యాంకులు కూడా జమచేయాలని సూచించింది. ఈ నిబంధనలు అమలయిన 30రోజులలోపు ఈ సంస్థలు విధిగా పాతనోట్లను జమచేయాలని ఆర్థిక వ్యవహారాలశాఖ ఆదేశించింది. గతంలో డిసెంబరు 31వ తేదీ వరకూ మాత్రమే ఈ పాతనోట్లను తీసుకున్న రిజర్వుబ్యాంకు తాజాగా మరోసారి గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దుకాలం 50రోజుల్లోను లక్షలకోట్ల రూపాయలు రిజర్వుబ్యాంకు కరెన్సీ చెస్ట్‌కు బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి వచ్చిపడిన సంగతి తెలిసిందే. అలాగే 2.5 లక్షల రూపాయలకు దాటిన లావాదేవీల వివరాలన్నింటినీ ఆదాయపు పన్నుశాఖకు తెలియజేయాలని బ్యాంకులు, పోస్టాఫీసులను సైతం ఆదేశించింది. పోస్టాఫీసుల్లో పెద్దనోట్ల రద్దుకాలంలో 32,631కోట్ల రూపాయలను జమచేసింది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 26 ఏళ్లకే రూ.70 కోట్ల సంపాదన.. అది కూడా గేమ్స్ ఆడుతూ.. ట్విచ్‌లో ఒకసారి టేలర్ బ్లెవిన్స్ గేమ్ స్ట్రీమింగ్‌‌ను 6,67,000 మంది లైవ్‌లో చూశారు. ఇదొక రికార్డ్. ఇతని యూట్యూబ్ ఛానల్‌కు ఏకంగా 2.1 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. Samayam Telugu | Updated: Feb 16, 2019, 04:07PM IST హైలైట్స్ అతనో ట్విచ్ స్ట్రీమర్.. పేరు రిచర్డ్ టేలర్ బ్లెవిన్స్ గేమ్స్ ఆడుతుంటాడు.. వాటిని ట్విచ్‌లో స్ట్రీమింగ్ చేస్తాడు ఇతని యూట్యూబ్ ఛానల్‌కు ఏకంగా 2.1 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు గేమింగ్ ఇండస్ట్రీ‌పై అవగాహన ఉన్నవారికి ఫోర్ట్‌నైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోస్ట్ పాపులర్ గేమ్ ఇది. ఈ గేమ్ కేవలం దీన్ని రూపొందించిన వారిని మాత్రమే కాదు.. ఆడిన వారిని కూడా ధనవంతుల్ని చేస్తోంది. వీరిలో ట్విచ్ స్ట్రీమర్ నింజా గురించి చెప్పుకోవాల్సిందే. నింజా అనేది ఛానల్ పేరు. ఇతని అసలు పేరు రిచర్డ్ టేలర్ బ్లెవిన్స్. ఇతను అమెరికాకు చెందిన ట్విచ్ స్ట్రీమర్. ఫేమస్ ఇంటర్నెట్ పర్సనాలిటీ. ట్విచ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన వ్యక్తి. 1.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇతను యూట్యూబర్ కూడా. అలాగే ప్రొఫెషనల్ గేమర్. హాలో, హెచ్1జెడ్1, పబ్‌జి, ఫోర్ట్‌నైట్ వంటి గేమ్స్ అడుతుంటారు. వీటిని లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంటాడు.
1entertainment
kangana ranaut plays a bold role in her upcoming film simran కుర్రకారుకు కిక్కెంకించే పాత్రలో కంగనా! తన సినిమాల్లో చాలా వరకు బోల్డ్ క్యారెక్టర్లలో కనిపిస్తుంటుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. TNN | Updated: Sep 6, 2017, 05:07PM IST తన సినిమాల్లో చాలా వరకు బోల్డ్ క్యారెక్టర్లలో కనిపిస్తుంటుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తనకు ఇలాంటి పాత్రల్లో నటించడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం చాలా హాట్‌గా కనిపించడానికి రెడీ అవుతోందీ బ్యూటీ. బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ సినిమాలు వస్తుంటాయి. కానీ స్టార్ హీరోయిన్లు కాకుండా సి గ్రేడ్ తారలు ఇందులో నటిస్తుంటారు. కానీ ఇప్పుడు కంగనా అటువంటి సాహసం చేయబోతుంది. ఆమె తాజాగా నటిస్తోన్న చిత్రం ‘సిమ్రన్’. ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది కంగనా. ‘అమ్మాయిలు కూడా శారీరక సుఖాన్ని అనుభవించాలి. వారికి ఆ హక్కు కూడా ఉంది. ఈ సినిమాలో నేను విడాకులు తీసుకొని కోరికలతో రగిలిపోయే ఓ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. ఎప్పటికప్పుడు బాయ్ ఫ్రెండ్స్‌ను మారుస్తూ వారితో డేటింగ్ చేస్తూ కనిపిస్తా..’ అంటూ తన పాత్రకు తగ్గట్లుగానే బోల్డ్‌గా చెప్పేసింది. అయితే ట్రైలర్‌లో మాత్రం అడల్ట్ కంటెంట్ చూపించకుండా ఆసక్తికరంగా కట్ చేశారు. ఆమె డైలాగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సామ్‌సంగ్‌ను ముంచిన గెలాక్సీ నోట్ 7 సామ్‌సంగ్ తమ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ల తయారీ, విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. TNN | Updated: Oct 15, 2016, 12:08PM IST సామ్‌సంగ్ తమ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ల తయారీ, విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌లోని బ్యాటరీ పేలిపోతుందని వినియోగదారుల నుంచి అధికంగా ఫిర్యాదులు రావడంతో సామ్‌సంగ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నోట్ 7 ఫోన్ల విక్రయాలు, తయారీని ఆపేయడం.. వెనక్కి రప్పించడం వల్ల సామ్‌సంగ్ తీవ్రంగా నష్టపోనుంది. రాబోయే రెండు త్రైమాసికాల్లో మొత్తం 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20 వేల కోట్లు) నష్టం వాటిల్లే అవకాశముందని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్‌లను వెనక్కి తీసుకోవడం వల్ల మూడో త్రైమాసికంలో కంపెనీ 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,350 వేల కోట్లు) నష్టపోయిందని సామ్‌సంగ్ వెల్లడించింది. మొత్తంగా గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ 5.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 35 వేల కోట్లు) భారాన్ని సామ్‌సంగ్‌పై మోపి కంపెనీని నిండా ముంచేసింది.
1entertainment
Sep 12,2017 కార్ల అమ్మకాలలో 12% వృద్ధి న్యూఢిల్లీ: దేశీయంగా కార్ల అమ్మకాల్లో వృద్ధి కొనసాగుతూ వస్తోంది. గత (ఆగస్టు) నెలలో కార్ల అమ్మకాలు 11.8శాతం వృద్ధితో 1,77,829 వాహనాల నుంచి 1,98,811 వాహనాలకు పెరిగా యని సొసైటీ ఆఫ్‌ ఇండి యన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. దేశీయంగా ప్రయాణ వాహనాల అమ్మకాలు 13.76 శాతం వృద్ధితో 2,94,335 యూనిట్లకు చేరాయి. కిందటి నెలలో మోటార్‌సైకిల్‌ విక్రయాలు 12.93 శాతం వృద్ధితో 10,05,654 యూనిట్ల నుంచి 11,35,699 యూనిట్లకు ఎగిశాయి. కాగా ఆగస్టు నెలలో మొత్తం మోటార్‌ సైకిల్‌ అమ్మకాలు 16,48,871 యూనిట్ల నుంచి 14.69 శాతం వృద్ధితో 18,91,062 యూనిట్లకు పెరిగాయని తెలిపింది. వాణిజ్య వాహనాల విక్రయాలు 23.22 శాతం పెరిగి 65,310 యూనిట్లకు ఎగబాకినట్టుగా సియామ్‌ పేర్కొంది. అన్ని రకాల క్యాటగిరీ వాహనాల అమ్మకాలు 14.49శాతం వృద్ధితో 23,02,158 యూనిట్లుగా నమోదు అయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 122 Views indian cricket pujara శ్రీలంకః గాలెలో శ్రీలంక, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 90 ఓవర్లు పూర్తయ్యేసరికి 399 పరుగులు చేసింది. భారత్‌ బ్యాట్స్‌మెన్లు శిఖర్‌ ధావన్‌ 190 పరుగులు, చేయగా చటేశ్వర్‌ పుజారా 144 పరుగులు, అజింక్య రహానే 39 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు
2sports
internet vaartha 227 Views నాగ్‌పూర్‌ : టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందు ఆసియా కప్‌ విజేతగానే కాకుండా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా 47 పరుగులకు పరాజయం చెందింది. కాగా మ్యాచ్‌ను పరిశీలిస్తే వ్యూహాల పరంగా టీమిండియా కంటే న్యూజిలాండ్‌దే పైచేయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టాస్‌కు ముందు న్యూజిలాండ్‌ ముగ్గురు ప్రొఫెషనల్‌ స్పిన్నర్లతో బరిలోకి దిగింది.కివీస్‌ తన తురుపుముక్క టీమ్‌ సౌథీని పక్కన పెట్టి మరీ మరో స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకో వడం ద్వారా లాభపడింది. టాస్‌ సంద ర్భంగా వ్యాఖ్యాత ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ ధోనీ వద్ద ప్రస్తావించగా పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌తో ముందుకెళ్లామన్నాడు. అయితే అశ్విన్‌కు తోడు హర్భజన్‌ లాంటి పుట్‌ టైమ్‌ స్పిన్నర్‌ అవసరం ఎంతుందో ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తరువాత గానీ తెలిసి రాలేదు. పేలవవమైన షాట్లు కొడుతూ కివీస్‌ ఆటగాళ్లు ఒక్కొక్కరే ఔటవుతుండటం భారత్‌కు సంతోషం కలిగించినా మనవాళ్లు కూడా అదే రకం పేలవమైన షాట్లతో కొంపముంచారని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రజెంటేషన్‌లో ధోనీ పేర్కొన్నాడు.భారత బ్యాట్స్‌మెన్‌ చెత్త షాట్లకు ఔట్‌ కావడం వల్లే ప్రతికూల ఫలితాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందని ధోనీ స్పష్టం చేశాడు.
2sports
Highlights పిల్లలతో రవితేజ వెకేషన్  మాస్ మహారాజ రవితేజ తన పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకొని మరీ హాలిడేకు వెళ్లిన రవితేజ తిరిగొచ్చిన తరువాత వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. కానీ అతడికి సరైన విజయం మాత్రం దక్కలేదు. పైగా డబ్బుల కోసమే చవకబారు కథలతో సినిమాలు చేస్తున్నాడనే కామెంట్లు వినిపించాయి. అయితే వీటన్నింటికీ కొంతకాలం పాటు దూరంగా ఉండాలని అనుకున్నాడో ఏమో తన పిల్లలను వేసుకొని టూర్ కు వెళ్ళిపోయాడు. అక్కడ సరదాగా తీసుకున్న ఫోటోలకు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఎట్టకేలకి మళ్లీ అరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ..! చివరి 9 ఇన్నింగ్స్‌ల్లో 22, 5, 41, 11, 6, 6, 14, 0, 37 పరుగులే చేసిన అరోన్ ఫించ్‌పై వేటు వేయాలని గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు డిమాండ్లు చేస్తున్నారు. Samayam Telugu | Updated: Mar 8, 2019, 03:10PM IST ఎట్టకేలకి మళ్లీ అరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ..! హైలైట్స్ చివరి 9 ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమైన అరోన్ ఫించ్ జట్టు నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ ఎట్టకేలకి ఈరోజు రాంచీ వన్డేలో అర్ధశతకం సాధించిన ఫించ్ కేదార్ జాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 బాదిన వైనం ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్ ఎట్టకేలకి మళ్లీ ఫామ్ అందుకున్నాడు. గత కొంతకాలంగా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్న ఫించ్.. ఈరోజు భారత్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 బాదిన ఫించ్ 51 బంతుల్లో 7x4, 3x6 సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డే కెరీర్‌లో ఫించ్‌కి ఇది 19వ అర్ధశతకంకాగా గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఇదే తొలి అర్ధశతకం. చివరి 9 ఇన్నింగ్స్‌ల్లో 22, 5, 41, 11, 6, 6, 14, 0, 37 పరుగులే చేసిన అరోన్ ఫించ్‌పై వేటు వేయాలని గత కొద్దిరోజులుగా మాజీ క్రికెటర్లు డిమాండ్లు చేస్తున్నారు. మార్చి 28తో సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిషేధం గడువు ముగియనుండటంతో.. అంత వరకూ ఫించ్‌ని కొనసాగించాలని భావించిన ఆస్ట్రేలియా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. తాజాగా అర్ధశతకంతో ఫామ్‌ అందుకున్న ఫించ్.. జట్టులో స్థానాన్ని నిలుపుకున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కోహ్లి సేనను ఊరిస్తోన్న ‘నంబర్ 1’ ర్యాంకింగ్ టెస్టుల్లో పాక్‌కు నంబర్ 1 పొజీషన్‌ను కోల్పోయిన టీమ్ ఇండియా.. సొంత గడ్డపై జరగనున్న టెస్టు సిరీస్‌ల ద్వారా తిరిగి అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది. TNN | Updated: Sep 18, 2016, 01:53PM IST టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకింగ్‌ను ఇటీవలే పాకిస్థాన్‌కు కోల్పోయిన భారత జట్టు తిరిగి టాప్ పొజీషన్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ను చక్కటి అవకాశంగా మలుచుకోవాలని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ కుంబ్లే భావిస్తున్నారు. కివీస్‌తో మూడు టెస్టుల సిరీస్ ముగిశాక.. భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో సొంత గడ్డమీదే టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో నంబర్ స్థానానికి తిరిగి చేరుకునే అవకాశాలు టీమిండియాకు పుష్కలంగానే ఉన్నాయి. 2012-13 సీజన్లో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను ఓడించింది. కానీ ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో ఓడి నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది. నాటి నుంచి నంబర్ 1 ర్యాంకింగ్ టీమిండియాతో దోబూచులాడుతోంది. ఇప్పుడు వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్ నెగ్గినప్పటికీ, వర్షం కారణంగా చివరి టెస్ట్ డ్రాగా ముగియడంతో పాక్‌ అగ్రస్థానాన్ని ఎగరేసుకుపోయింది. 2012-13 సీజన్లో భారత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో భారత జట్టేమీ దుర్భేద్యం కాదని నిరూపించింది. భారత జట్టుపై ఇంగ్లిష్ జట్టు విజయం సాధించడంలో స్పిన్నర్లు గ్రేమ్ స్వాన్, మాంటీ పనేసర్ ప్రధాన భూమిక పోషించారు. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఉపఖండంలోని పరిస్థితులకు అనుగుణంగా కివీస్ జట్టు ఇష్ సోధి, మిచెల్ సాంటెర్, మార్క్ క్రెయిగ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు రంగంలోకి దించుతోంది. వీరు ముగ్గురూ ఈ ఏడాది తొలినాళ్లలో భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో సత్తా చాటినవారే. అయితే టిమ్ సౌథీ సేవలు న్యూజిలాండ్‌కు దూరం కానుండటం మాత్రం ఊరటనిచ్చే విషయం. బ్యాటింగ్ విషయానికి వస్తే భారత జట్టుదే పైచేయిగా ఉంది. కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ మినహా మిగతా ఆటగాళ్లు భారత గడ్డపై ఐదు రోజుల ఆటలో ఏ మేరకు రాణిస్తారో చెప్పడం కష్టమే. కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఆదిలోనే కివీస్ ఆటగాళ్లపై మానసికంగా పై చేయి సాధిస్తే.. టెస్టు సిరీస్ విజయంతోపాటు టెస్టుల్లో నంబర్ స్థానంపై ఆశలు పెట్టుకోవచ్చు. లేదంటే.. ఒక్క న్యూజిలాండ్ మినహా భారత్ ఎదుర్కోబోయే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు టాప్-4లోనే ఉన్నాయి. మనకు ఆ జట్లకు మధ్య రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉంది. కాబట్టి తేడా వస్తే అగ్రస్థానం మీద ఆశలు అటుంచి ర్యాంకింగ్స్‌లో కిందకు జారిపోయే అవకాశం ఉంది.
2sports
Mumbai, First Published 16, Sep 2018, 11:42 AM IST Highlights ఆడవారు అలంకార ప్రియులని.. ఇందుకోసం వారు ఎక్కువగా షాపింగ్‌ అంటే ఇష్టపడుతుంటారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కానీ ఇటీవల అబ్బాయిల్లోనూ సౌందర్య పిపాస పెరిగిపోతోంది. ఆడవారు అలంకార ప్రియులని.. ఇందుకోసం వారు ఎక్కువగా షాపింగ్‌ అంటే ఇష్టపడుతుంటారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కానీ ఇటీవల అబ్బాయిల్లోనూ సౌందర్య పిపాస పెరిగిపోతోంది. అందరిలోనూ తము అందంగా ఉండాలన్న కాంక్ష వారిలోనూ ఎక్కువవుతోందని ఇటీవల అధ్యయనాలు తెలిపాయి. అబ్బాయిలే ఎక్కువగా షాపింగ్‌ చేస్తారట. ఈ విషయాలన్నీ అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌లైన చెప్పారు మింత్రా - జబాంగ్‌ సీఈవో అనంత్‌ నారాయణన్‌.  55 శాతం అబ్బాయిలే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇండియా టుడే యూత్‌ సమిట్‌ మైండ్‌ రాక్స్‌లో నారాయణన్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. అ‍బ్బాయిలే ఎక్కువ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడానికి కారణం, అమ్మాయిల కంటే ఎక్కువగా వారి వద్దే స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉండటమని మింత్రా సీఈఓ అనంత్ నారాయణన్ పేర్కొన్నారు. షాపర్‌ పరంగా చూసుకుంటే, అమ్మాయిలు ఎక్కువగా తమ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే వారి పరిమాణం పెరుగుతోంది.  అయినా అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలే షాపర్స్‌ను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణదారులకు ఎలాంటి తేడా లేదని, గ్రామీణ వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తులు, పట్టణ వినియోగదారులు తీసుకునేవి సమానంగా ఉన్నాయని మింత్రా సీఈవో తెలిపారు.  మింత్రాలో 55 శాతం డిమాండ్‌ టాప్‌ 30 నగరాలను మించి వస్తుందని, మిగతా 45 శాతం టాప్‌ 30 నగరాల నుంచి వెల్లువెత్తుందని చెప్పారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో యాక్సస్‌ లేదు, ఒకవేళ యాక్సస్‌ కల్పిస్తే, పట్టణ వాసులు అనుసరించే ట్రెండ్‌నే గ్రామీణులు అనుసరిస్తారని పేర్కొన్నారు. గ్లోబల్‌ ట్రెండ్స్‌ భారత్‌కు చాలా వేగంగా విస్తరిస్తాయని, భారతీయులు సరసమైన లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పారు.  Last Updated 19, Sep 2018, 9:27 AM IST
1entertainment
What will happen if the semi-finals get washed out వర్షంతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే..? ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మ్యాచ్‌లకి రిజర్వ్ డే లేదు. సెమీస్‌లో కనీసం 20 ఓవర్లు ఆట సాధ్యంకాని నేపథ్యంలో లీగ్ TNN | Updated: Jun 14, 2017, 04:24PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దయితే.. మరికొన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలాయి. ప్రస్తుతం టోర్నీ సెమీస్ దశకు వచ్చేసింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో బుధవారం పాకిస్థాన్ తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఢీకొంటుండగా.. భారత్‌తో గురువారం రెండో సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ తలపడనుంది. భారీ అంచనాల మధ్య టోర్నీకి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు వర్షం కారణంగా సెమీస్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవడంతో ప్రత్యర్థితో కలిసి పాయింట్లు పంచుకుంది. లీగ్ దశ సరే.. సెమీస్ మ్యాచ్‌లకి వరుణుడు అడ్డుపడితే.. ఫలితం ఎలా..? ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మ్యాచ్‌లకి రిజర్వ్ డే లేదు. సెమీస్‌లో కనీసం 20 ఓవర్లు ఆట సాధ్యంకాని నేపథ్యంలో లీగ్ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచిన భారత్ 4 పాయింట్లతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత పాకిస్థాన్ కూడా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో లీగ్ దశను ముగించింది. భారత్‌తో పోలిస్తే నెట్ రన్‌రేట్‌ పాక్‌కు తక్కువగా ఉంది.
2sports
internet vaartha 255 Views హైదరాబాద్‌ : ఏరోస్పేస్‌ మేజర్‌ ఎయిర్‌బస్‌ జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సిఆర్‌)లో పైలట్‌, నిర్వహణ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు 40 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఎయిర్‌బస్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది 2017 చివరినాటికి ఈ కేంద్రం సిద్ధం అవుతుందని, ఎయిర్‌బస్‌గ్రూప్‌ పూర్తి అధీనంలో ఈకేంద్రం నిర్వహణ జరుగుతుందని ప్రకటించింది. ఎయిర్‌బస్‌ గ్రూప్‌ ఇండియా పైలట్లకు తమ ప్రత్యేకత కలిగిన శిక్షణా నైపుణ్యాలతో పైలట్ల శిక్షణ కొనసాగుతుందని ఎయిర్‌బస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ శ్రీనివా సన్‌ ద్వారకనాధ్‌ వెల్లడించారు. ఇండి యా ఏవియేషన్‌ 2016 సందర్భంగా హైదరాబాద్‌వచ్చిన శ్రీనివాస్‌ మాట్లాడు తూ వచ్చే పదేళ్లపాటు ప్రతి వారానికి ఒక ఎయిర్‌బస్‌ విమానం డెలివరీ చేస్తామని అంతేకాకుండా ప్రస్తుతం అత్యు న్నత స్థాయి శిక్షణ నైపుణ్యాలు కూడా ఎయిర్‌బస్‌ అందించే లక్ష్యంతో ఉందన్నారు. ఢిల్లీ విమానాశ్రయ పరిసరాల్లో ఎయిర్‌బస్‌ స్థలాలను గుర్తించిందని భూసేకరణకు సంబంధించి సత్వరమే ఒప్పందాలు చేసుకుం టుందని, నిర్మాణం, సిమ్యులేటర్‌ ఏర్పాటు వంటివి 2017కల్లా పూర్తి చేస్తామన్నారు. ఎయిర్‌బస్‌ నిర్వహణ పరంగా అమెరికా, యూరోప్‌; ఏసియా ప్రాంతాల్లో ఇప్పటికే ఇదే తరహా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ద్వారకనాధ్‌ వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నెట్‌వర్క్‌లో భారత్‌ చేరుతుందని, 2018 కల్లా పైలట్లు, ఇంజనీర్లు పూర్తిస్థాయి శిక్షణ పొందుతారన్నారు. అలాగే ఇరుగుపొరుగుదేశాల అవసరాలను కూడా ఈ కేంద్రం తీరుస్తుందన్నారు. భారత్‌ లోని స్కిల్‌ ఇండియా పథకానికి అనుగుణంగా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందన్నారు. ప్రపంచం లోనే అగ్రగామి నైపుణ్యంతో శిక్షణ వసతులు ఎయిర్‌బస్‌కు ఉన్నాయన్నారు. ఎయిర్‌బస్‌ వచ్చే 20 ఏళ్లు అంటే 2034 నాటికి 1600విమానాలు అవసరం అవుతాయని అంచనావేస్తున్నట్లు శ్రీనివాస్‌ వెల్లడించారు.
1entertainment
Suresh 100 Views clarke clarke న్యూఢిల్లీ: సొంతగడ్డపై టీమిండియాను ఎదుర్కొన‌డం కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ సారథి మైకెల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య స్మిత్‌ సేన ఐదు వన్డేలు, మూడు టీ20ల కోసం భారత్‌ రానున్నారు. ఈ సందర్భంగా క్లార్క్‌ మాట్లాడుతూ.. ‘వన్డే-టెస్టు క్రికెట్‌ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వన్డే క్రికెట్‌లో కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. భారత పర్యటనలో ఆసీస్‌ మంచి ప్రదర్శన చేసి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. కాకపోతే ఇది కొంచెం కష్టమని తెలుసు. ఎందుకంటే భారత్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్నది’ అని క్లార్క్‌ అన్నాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV భార్యతో కలసి డాన్స్ చేయనున్న యువరాజ్! క్రికెటర్ యువరాజ్ సింగ్, తన సతీమణి.. హీరోయిన్ హేజిల్ కీచ్‌తో కలిసి ఓ టీవీ షోలో ఆడిపాడనున్నాడు. TNN | Updated: Mar 21, 2017, 07:53PM IST క్రికెటర్ యువరాజ్ సింగ్ , తన సతీమణి.. హీరోయిన్ హేజిల్ కీచ్‌తో కలిసి ఓ టీవీ షోలో ఆడిపాడనున్నాడు. సెలబ్రిటీ రియాల్టీ షో ‘నాచ్ బలియే’ ఇందుకు వేదిక కానుంది. ముంబైలో ఇప్పుడు ఈ వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. యువరాజ్.. రానున్న రెండు నెలల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉండనున్నాడు. ఆ తర్వాతే ఈ ఎపిసోడ్‌ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యువరాజ్, హేజిల్ కీచ్ తమకు తప్పకుండా సహకరిస్తారని.. సదరు చానల్ పూర్తి విశ్వాసంతో ఉందట. ఇప్పటికే వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో డాన్స్ షోలు ప్లాన్ చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్ నుంచి ప్రసారం కానుంది. ఈ సీజన్లో.. దివ్యాంకా త్రిపాఠి, వివేక్ దహియా; సనయా ఇరానీ, మోహిత్ సెగల్; బర్తీ సింగ్, అర్ష్ లింబాచియా; మోనాలిసా, విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్ తదితర సెలబ్రిటీలతో ఈ షో ప్లాన్ చేశారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుందనే గట్టి విశ్వాసంతో నిర్వాహకులు ఉన్నారు. యువీ ఏ మేరకు కిక్కివ్వగలడో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నిర్మాతగా దేవిశ్రీప్రసాద్? యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తాడని అప్పట్లో ఓ వార్త హల్‌చల్ చేసింది. TNN | Updated: Oct 13, 2015, 06:36PM IST యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తాడని అప్పట్లో ఓ వార్త హల్‌చల్ చేసింది. అది నిజమో కాదో కానిఅయితే తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న‘ కుమారి 21 ఎఫ్’ చిత్రంతో దేవిశ్రీప్రసాద్ నిర్మాతగా కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. నిర్మాతగా టైటిల్ కార్డ్స్‌లో పేరు లేకపోయినా దేవి కుమారి చిత్రానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనేది నిజమేనట. దర్శకుడు సుకుమార్‌తో వున్న స్నేహం కారణంగా ఈ చిత్రానికి దేవి పారితోషికం లేకుండా సంగీతాన్ని అందిస్తున్నాడట. సినిమా విడుదల తర్వాత వచ్చిన లాభాల్లో దేవితో పాటు ఇదే బాటలో పనిచేస్తున్న ఈ చిత్ర కెమెరామెన్ రత్నవేలుకు సుక్కు లాభాలు ఇస్తాడని తెలిసింది. రాజ్ తరుణ్, హేభా పటేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే పాటలను, నవంబర్ రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV శ్రీలంకపై మిథాలీ సేన ఉత్కంఠ గెలుపు..! నీలాక్షి భారీ షాట్లతో ఒక్కసారిగా మ్యాచ్‌ను లంకవైపు తిప్పింది. ఆమె జోరుతో ఒకానొక దశలో 165/7తో నిలిచిన శ్రీలంక 46.3 ఓవర్లు ముగిసే సమయానికి 205/7తో విజయానికి చేరువలో నిలిచింది. కానీ..? Samayam Telugu | Updated: Sep 13, 2018, 07:41PM IST శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో భారత్ మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌‌షిప్‌లో భాగంగా గాలేలో ఈ టోర్నీ జరుగుతుండగా.. గురువారం ఉత్కంఠగా ముగిసిన రెండో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌‌‌ని 2-0తో కైవసం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం జరగనుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. తనియా భాటియా (68: 66 బంతుల్లో 9x4), కెప్టెన్ మిథాలీ రాజ్ (52: 121 బంతుల్లో 4x4) అర్ధశతకాలు సాధించడంతో సరిగ్గా 50 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో చామరి ఆటపట్టు (57: 95 బంతుల్లో 8x4, 1x6), శశికళ (49: 91 బంతుల్లో 6x4), నీలాక్షి (31: 19 బంతుల్లో 2x4, 2x6) నిలకడగా ఆడటంతో శ్రీలంక అలవోక విజయాన్ని అందుకునేలా కనిపించింది. ముఖ్యంగా నీలాక్షి భారీ షాట్లతో ఒక్కసారిగా మ్యాచ్‌ను లంకవైపు తిప్పింది. ఆమె జోరుతో ఒకానొక దశలో 165/7తో నిలిచిన శ్రీలంక 46.3 ఓవర్లు ముగిసే సమయానికి 205/7తో విజయానికి చేరువలో నిలిచింది. కానీ.. జట్టు స్కోరు 207 వద్ద ఆమె ఔటవగా.. ఒత్తిడికి గురైన శ్రీలంక 48.2 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలిపోయింది.
2sports
Lakshman లక్ష్మణ్‌కు ఎంసిసి జీవిత కాల సభ్యత్వం లండన్‌: భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌కు అరుదైన గౌరవం దక్కింది.ప్రఖ్యాత మార్లేబోస్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసిసి)లో హైదరాబాద్‌ సొగసరి బ్యాట్స్‌మెన్‌ లక్ష్మణ్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వం లభించింది. ఈ ప్రతిష్టాత్మక ఎంసిసి క్లబ్‌లో మాజీ క్రికెటర్లు సచిన్‌,ద్రవిడ్‌, గంగూలీ, సెహ్వాగ్‌,జహీర్‌ఖాన్‌ భారత్‌ తరపున సభ్యత్వం పొందిన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక క్రికెట్‌ క్లబ్‌లో సభ్యునిగా ఎంపికవడం నిజంగా ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను.క్లబ్‌కు ఉన్న గొప్ప వారస త్వాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. అద్భుతమైన సంస్కృతి కలిగిన క్లబ్‌లో భాగమవుతున్న నేను క్లబ్‌ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని లక్ష్మణ్‌ పేర్కొ న్నాడు.42 సంవత్సరాల లక్ష్మణ్‌ 134 టెస్టుల్లో 45.97 సగటుతో 8,781 పరుగులు,85 వన్డేల్లో 30.76 సగటుతో 2,338 పరు గులు చేశాడు.ప్రస్తుతం ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరా బాద్‌ జట్టుకు మార్గ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
2sports
విడుదల సన్నాహాల్లో "చందమామ రావే" Highlights అందా రాక్షసి హీరో న‌వీన్ చంద్ర నూతన చిత్రం "చందమామ రావే" చందమామ రావేకు అది రాదు,.. వీడు మారడు అనే క్యాప్షన్ జూన్ నెలాఖరును విడుదలకు సన్నాహాలు   'అందాల రాక్ష‌సి' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమై యూత్ హ‌ర్ట్‌ని దోచుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రం "చందమామ రావే". ప్రియ‌ల్ గోర్ అనే నూత‌న తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. 'అది రాదు.. వీడు మార‌డు' అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రాన్ని లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా నిర్మాత‌లు కిర‌ణ్ జ‌క్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ర‌క్త‌చ‌రిత్ర సినిమాకు రామ్‌గోపాల్ వ‌ర్మ స‌హా ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్స్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన క‌వ‌ల ద‌ర్శ‌కులు ధ‌ర్మ‌-ర‌క్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ సినిమా నిర్మాణాంతర కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.   ఈ సందర్భంగా నిర్మాత కిర‌ణ్ జ‌క్కంశెట్టి మాట్లాడుతూ... "ఎంతో మంది స్టార్ డైరెక్ట‌ర్స్ వ‌ద్ద ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు ధ‌ర్మ‌, ర‌క్ష‌లు సినిమాను చ‌క్క‌గా రూపొందించారు. ప్ర‌పంచంలో ట్విన్స్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా కూడా మా చిత్ర‌మే కావ‌డం విశేషం. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. పెక్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ. ల‌వ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పేఎక్స్‌ట్రీమ్ ల‌వ్‌స్టోరీ 'చంద‌మామ రావే' డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీస్‌ను ప్రేక్ష‌కులకు అందించాల‌నే ఆలోచ‌న‌తో రూపొందించిన పెక్యుల‌ర్ ల‌వ్ స్టోరీ చంద‌మామ రావే. న‌వీన్‌చంద్ర పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా, యూనిక్‌గా ఉంటుంది. మంచి ఎమోష‌న్స్‌తో సాగే చిత్రం. హీరో న‌వీన్‌చంద్ర పూర్తి స‌హ‌కారాన్ని అందించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఖ‌ర్చుకు ఏమాత్రం వెన‌కాడకుండా హిమాల‌యాలు, గ్యాంగ్‌ట‌క్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. దేవదాసుని పార్వతి ఒక్కసారి వదిలేస్తేనే ఆయన పరిస్థితి అలా తయారైతే.. ఒకే అమ్మాయి హీరోని మూడు సార్లు వదిలేస్తే ఇంకెలా ఉంటుందనేది సినిమా బేసిక్ కాన్సెప్ట్. ఆద్యంతం అలరించే చిత్రంగా రూపొందిన "చందమామ రావే"ను జూన్ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.  Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Abu Dhabi - United Arab Emirates, First Published 19, Sep 2018, 5:11 PM IST Highlights ఆసియా కప్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంట నెలకొంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది.   ఆసియా కప్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చితక్కొట్టింది. పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ తమ ముందు ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ధాటిగా ఆడి తర్వాతి బ్యాట్స్ మెన్ కు ఇబ్బంది లేకుండా చూశారు. రెండు వికెట్లు మాత్రమే 29 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు (31), దినేష్ కార్తిక్ (31) నాటౌట్ గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లలో ఫహీమ్ అస్రాఫ్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీశారు.  పరుగుల వరద పారించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో భారత్ 86 పరగుుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. 104 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోోయింది. దూకుడుగా ఆడుతూ వచ్చిన శిఖర్ ధావన్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. వీరిద్దరు అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా దినేష్ కార్తిక్, అంబటి రాయుడు జాగ్రత్త పడ్డారు. పాకిస్తాన్ తమ ముందు ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు పెంచాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అతను ఆ తర్వాత ఫోర్లు, సిక్స్ లతో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దాయాదుల పోరులో భారత బౌలర్లు విజృంభించారు. పాకిస్థాన్ జట్టును కేవలం 162 పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత బౌలర్ల ఆదిపత్యమే కొనసాగింది. మధ్యలో షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అవుటైన తర్వాత మిగతా బ్యాట్ మెన్స్ కూడా చేతులెత్తేశారు. దీంతో భారత జట్టు ముందు పాకిస్థాన్ 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.  భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 3, కేదార్ జాదవ్ 3, బుమ్రా 2, కుల్దీప్ యాద్ 1 వికెట్ తీసుకున్నారు. పాకిస్థాన్ టీం లో కేవలం నలుగురు ఆటగాళ్లే రెండంకెల స్కోరు సాధించగలిగారు. భారత బౌలర్ల దాటికి పాకిస్థాన్ బ్యాట్ మెన్స్ విలవిల్లాడిపోయారు. కేవలం 160 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.  బాబర్, షోయబ్ మాలిక్ నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో పాకిస్థాన్ జట్టు కోలుకున్నట్లు కనిపించింది. అయితే అయితే మూడో వికెట్ రూపంలో బాబర్ అవుటవడంతో మళ్లీ పాకిస్థాన్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఇతడు అవుటవగానే క్రీజులోకి వచ్చిన సర్పరాజ్ అహ్మద్ కేవలం ఆరు పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే షోయబ్ మాలిక్ కూడా రాయుడు చేతిలో రనౌటయ్యాడు.  ఆ తర్వాత ఆసిఫ్ అలీ కూడా వెంటనే  ఔటయ్యాడు. దీంతో 110 పరుగులకే పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయింది.  3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పాకిస్థాన్ జట్టును బాబర్, షోయబ్ మాలిక్ లు ఆదుకున్నారు. అయితే 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బాబార్ ఆజమ్ అవుటయ్యాడు. హాప్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో అవుటవడంతో కాస్త నిరాశతో బాబర్ పెవిలియన్ బాట పట్టాడు.  టీంఇండియా వికెట్ కీపర్ ధోని షోయబ్ మాలిక్ ను ఔట్ చేసే మంచి సదవకాశాన్ని మిస్ చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో షోయబ్ మాలిక్ క్యాచ్ ని ధోని అందుకోలేకపోయాడు. దీంతో పాకిస్థాన్ జట్టు మరో వికెట్ పడకుండా 63 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టుపై భారత భౌలర్లు విరుచుకుపడ్డారు. భారత పేస్ భౌలింగ్ దాటికి తల్లుకోలేక ఇద్దరు పాకిస్థాన్ ఓపెనర్లు కేవలం మూడు పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇద్దరు ఓపెనర్లను భువనేశ్వర్ కుమారే ఔట్ చేశాడు. రెండు పరుగుల వద్దే పాకిస్థాన్ జట్టు ఓ వికెట్ కోల్పోయింది. ఈ రెండు పరుగులు ఇమామ్ ఉల్ హక్ సాధించినవే. .టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలు: ఇండియన్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ,దినేశ్ కార్తీక్, కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్ టీమ్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అస్రప్, మహ్మద్ ఆమీర్, హసన్ అలీ, ఉస్మాన్  ఖాన్
2sports
READ ALSO: అందుకే ఆ కులం ట్వీట్ డిలీట్ చేశానంటున్న లావణ్య త్రిపాఠి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు వెర్షన్ బాధ్యతలను సురేశ్ ప్రొడక్షన్స్ తీసుకుంది. సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తైంది. 2010లో ‘దబాంగ్’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్ 2’ కూడా మంచి విజయం సాధించింది. డిసెంబర్ 20న ‘దబాంగ్ 3’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు సల్మాన్ ‘కిక్ 2’, ‘ఇన్‌షా అల్లా’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. అయితే సంజయ్ లీలా భన్సాలీతో కలిసి చేయాల్సిన ‘ఇన్‌షా అల్లా’ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో దబాంగ్ 3 సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలని సల్మాన్ యోచిస్తున్నారట. సల్మాన్, ఆలియా భట్ జంటగా నటించాల్సిన ‘ఇన్‌షా అల్లా’ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంది. కానీ ఏవో కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. అప్పుడు సల్మాన్ ఓ ట్వీట్ చేస్తూ.. ‘నా గురించి అంతగా ఆలోచించకండి. మీ మనసులోకే కాదు రంజాన్‌కు కూడా వస్తాను’ అని పేర్కొన్నారు. మరోపక్క సల్మాన్ చేయాల్సిన ‘కిక్ 2’ సినిమా కూడా ఇప్పట్లో విడుదలయ్యేలా లేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా మొదలుకాలేదు. దాంతో వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసే అవకాశం లేదని నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ప్రకటించారు. ఇక సల్మాన్ చేతిలో మిగిలుంది దబాంగ్ 3 మాత్రమే. అందుకే సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలని ప్రభుదేవాతో చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీని గురించి ప్రభుదేవా కూడా ఆలోచిస్తున్నారట.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV లెప్ట్ హ్యాండ్ ధోనీ ఆటకి చూపు తిప్పుకోలేరు..! మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే ధోనీ.. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌ల్లో కలిపి కొట్టిన సిక్సర్లు .. ముప్పావు వంతు హెలికాప్టర్ షాట్లే. TNN | Updated: Jun 29, 2017, 06:22PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచానికి ‘హెలికాప్టర్ షాట్‌’ని పరిచయం చేసి దాదాపు పదమూడేళ్లు గడిచిపోతోంది. కానీ.. ఇప్పటికీ ధోనీ క్రీజులో ఉంటే.. కనీసం ఒక హెలికాప్టర్ షాట్ కొట్టకపోతాడా..? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆ షాట్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఫార్మాట్ ఎలాంటిదైనా.. చివరి ఓవర్లలో స్కోరు పెంచేందుకు బ్రహ్మస్త్రంలా ధోనీ ఈ షాట్‌ని వినియోగిస్తుంటాడు. ఆ సమయంలో బౌలర్ ఎలాంటి బంతి విసిరినా.. అది స్టాండ్స్‌లోని ప్రేక్షకుల మధ్య వాలిపోవాల్సింది. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ధోనీ.. అనతికాలంలోనే జట్టులో తనదైన ముద్ర వేయగలిగాడు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌‌లో తన అసమాన కెప్టెన్సీతో భారత్‌కి కప్ అందిచడంతో ధోనీ పేరు మార్మోగిపోయింది. అనంతరం 2011లో 28 ఏళ్ల తర్వాత భారత్‌కి వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలిపాడు. మరోవైపు ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌‌ని టోర్నీలోనే తిరుగులేని జట్టుగా.. రెండు సార్లు విజేతగా నిలిపాడు. ఫార్మాట్ ఏదైనా.. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే ధోనీ.. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌ల్లో కలిపి కొట్టిన సిక్సర్లు 476.. ఇందులో ముప్పావు వంతు హెలికాప్టర్ షాట్లే. ఒకవేళ ధోనీ లెప్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ అయితే.. ఆ షాట్లు ఇలా ఉంటాయోమో కదా..? Those powerful shots by @msdhoni Left handed version of #Dhoni pic.twitter.com/YYqeQXx8cT
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ఫస్ట్‌లుక్.. మైండ్ బ్లోయింగ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా సినీ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూ.. వివిధ సినిమాల ఫస్ట్ లుక్, టీజర్‌లతో శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు హీరోలు, దర్శకులు. Samayam Telugu | Updated: Aug 15, 2018, 10:21AM IST స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా సినీ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూ.. వివిధ సినిమాల ఫస్ట్ లుక్, టీజర్‌లతో శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు హీరోలు, దర్శకులు. ఇప్పటికే ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ టీజర్ నెట్టింట్లో సందడి చేస్తుండగా.. క్రిష్ ‘మణికర్ణిక’ ఫస్ట్‌లుక్ కూడా నేడే విడుదలైంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ.. ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్నాడు. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత.. ‘తొలిప్రేమ’ అంటూ ప్రేమికుల మదిని దోచారు. మొదట్లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్‌లో నటించిన ఈ యువ హీరో ఆ తరువాత రొమాంటిక్ ప్రేమకథా చిత్రాలతో సక్సెస్ అయ్యారు. తాజాగా ఈ మెగా హీరో ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంలో సాగే ప్రయోగాత్మక కథే ‘అంతరిక్షం’. ఇటీవల ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌‌తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో మరిన్ని అంచనాలకు చేరువైంది. ‘అంతరిక్షం’లో వరుణ్ తేజ్‌ను వ్యోమగామిగా చూపించబోతున్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా నటించిన ‘ఘాజీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ కుర్రాడు సంకల్ప్ రెడ్డి.. తొలిచిత్రం తోటే నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అమెరికా, రష్యా వంటి దేశాల్లో ఇప్పటికే సబ్ మెరైన్ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. మొదటిసారిగా భారతదేశంలో 'ఘాజీ' సినిమా ద్వారా ఈ ప్రయత్నాన్ని తెరపై ఆవిష్కరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు ఇదే స్పూర్తితో మరో ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వి.ఎఫ్‌.ఎక్స్‌కు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నికల్‌ టీమ్‌ పనిచేస్తుంది. వాళ్లతో కలిసి వరుణ్ దిగిన ఫోటోలు షేర్ చేశారు వరుణ్. ఈ చిత్రంలో వరుణ్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి, ఆదితీరావు హైదరీ నటిస్తున్నారు. ఫస్ట్‌ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి ఎదుగురు, రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌), సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ‘అంతరిక్షం’ టీం. Bringing you all an out of the world experience. The first look and title of my next film. #Antariksham9000kmph… https://t.co/M1e9yScUrm — Varun Tej Konidela (@IAmVarunTej) 1534305610000
0business
News Room 365 WATCH LIVE TV UPI:యూపీఐ ప్రోత్సాహ‌కాల ర‌ద్దు! కేంద్ర ప్ర‌భుత్వం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వ్యాపారుల్లో డిజిట‌ల్ లావాదేవీల‌ను పెంచేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప్రోత్సాహ‌కాల‌ను ర‌ద్దు చేసింది. Samayam Telugu | Updated: Jul 12, 2018, 10:58AM IST కేంద్ర ప్ర‌భుత్వం వ్యాపారుల్లో డిజిట‌ల్ లావాదేవీల‌ను పెంచేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప్రోత్సాహ‌కాల‌ను ర‌ద్దు చేసింది. వినియోగ‌దారుల నుంచి చెల్లింపుల‌ను యూపీఐ విధానంలో అంగీక‌రిస్తే రూ.1000 వ‌ర‌కూ ఇచ్చే బ‌హుప‌తి ప‌థ‌కాన్ని ఆపేసింది. అదే విధంగా వినియోగ‌దారుల‌కు సైతం యూపీఐ చెల్లింపుల చేస్తే రూ.500 ఇచ్చే క్యాష్ బ్యాక్ ప‌థ‌కాన్ని సైతం విత్ డ్రా చేసుకున్నారు. అదే స‌మ‌యంలో భీమ్ యాప్ యూజ‌ర్ల‌కు రూ.150 వ‌ర‌కూ ప్రోత్సాహాకాలిచ్చే ప‌థ‌కాన్ని కొత్త‌గా తీసుకువ‌చ్చారు. కేంద్రం హ‌ఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణ‌యం పేమెంట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. యూపీఐ లావాదేవీల్లో చెప్పుకోద‌గ్గ పురోగ‌తి ఉన్న‌ప్ప‌టికీ రిటైల్ చెల్లింపుల్లో డిజిట‌ల్ పేమెంట్లు చేసే లావాదేవీల సంఖ్య ఇంకా ఎంతో పెర‌గాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెల‌లో... నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ప్ర‌క‌టించిన క్యాష్ బ్యాక్ స్కీమ్ కొన‌సాగిస్తామ‌ని దాన్ని మార్చి,2019 వ‌ర‌కూ పొడిగిస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. కాని ఇప్పుడు అర్ధాంత‌రంగా ఆపేసింది. క‌నీసం రూ.100 విలువ క‌లిగిన లావాదేవీల‌ను నెల‌లో 20 వ‌ర‌కూ చేస్తే వినియోగ‌దారుల‌కు రూ.25 రివార్డు వ‌చ్చేది.
1entertainment
internet vaartha 269 Views సానియాజోడీ వశం మెల్బోర్న్‌: ఉమెన్స్‌ డబుల్స్‌ టెన్నిస్‌లో సానియా మిర్జా,మార్టినా హింగీస్‌ జోడీ హవా కొనసాగుతుంది.కాగా తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను సానియా,మార్టినా హింగీస్‌ జోడీ గెలుచుకుంది.మెల్బోర్న్‌ పార్క్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్‌లో సానియా -హింగీస్‌ జోడీ 7-6,6-3 స్కోర్‌తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన హవకోవా-హడేకా జోడీపై గెలుపొందారు.ఈ విజయం సానియా మీర్జా,మార్టినా హింగీస్‌ జోడీ వరుసగా మూడవ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం.అంతేకాదు ఈ విజయంతో సానియా-మార్టినా జోడీకి వరుసగా మూడవ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం.అంతేకాదు ఈ విజయంతో సానియా-మార్టినా హింగీస్‌ జోడీ వరుసగా 36 విజాయలను సాధించిన జోడీగా రికార్డు సాధించింది.కాగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి సెట్‌ టైట్‌గా సాగినా రెండవ సెట్‌లో సానియా,హింగీస్‌ జోడీ పై చేయి సాధించారు.దీంతో ప్రత్యేర్థి జోడీ చేతులెత్తేసింది.కాగా 36 మ్యాచ్‌ల్లో వరుసగా 6వ గ్రాండ్‌ స్లామ్‌ను ఈ జోడీ గెలుచుకుంది.తాజా విజయంతో ఈ జోడీ క్యాలెండర్‌ గ్రాండ్‌ స్లామ్‌కు చేరువలో ఉంది.కాగా మ్యాచ్‌ అనంతరం ట్రోఫీని అందుకున్న మార్టినా హింగీస్‌ మాట్లాడుతూ సానియా ధన్యవ ాదాలు, నువ్వు లేకుండా నేనిక్కడ లేను అని వ్యాఖ్యానించాడు. కాగా ఈ టోర్నమెంట్‌లో ఎంతగానో శ్రమించాం,వచ్చే ఏడాది కూడా టైటిల్‌ నిలబెట్టుకుంటాం అని స్విస్‌ దిగ్గజం మార్టినా హింగీస్‌ పేర్కొన్నారు.అనంతరం సానియా మీర్జా మాట్లాడుతూ ఇక్కడ ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఆస్ట్రేలియా ఓపెన్‌ తనకెంతో ప్రత్యేకమన్నారు.నా పార్ట్‌నర్‌ మార్టినా హింగీస్‌కు థ్యాంక్స్‌,మా ఇద్దరి జోడీకి ఈ ఏడాది ఎంతగానో కలిసి వచ్చింది.తనతో కలిసి ఆడటం ఎంతో గర్వంగా ఉందని,మార్టినా ఎంతో గొప్ప వ్యక్తి అని సానియా కొనియాడింది.
2sports
ఎవ్వరిని పట్టించుకోవద్దు.. పరుగులే నీ టార్గెట్..కోహ్లీకి సచిన్ అండ Highlights ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయానికి కొద్ది అడుగుల దూరంలో బొక్కబోర్లాపడటం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగా ఆడినప్పటికీ.. పుజారాను జట్టులోకి తీసుకోకపోవడం... ధావన్‌కు చోటు కల్పించడం తదితర అంశాలపై కోహ్లీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు మాజీలు ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయానికి కొద్ది అడుగుల దూరంలో బొక్కబోర్లాపడటం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగా ఆడినప్పటికీ.. పుజారాను జట్టులోకి తీసుకోకపోవడం... ధావన్‌కు చోటు కల్పించడం తదితర అంశాలపై కోహ్లీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు మాజీలు.. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... టీమిండియా కెప్టెన్‌కు అండగా నిలిచారు. తొలి టెస్టులో విజయం చేజారినా.. కోహ్లీ పోరాటం ఆకట్టుకుందని ప్రశంసించాడు. విరాట్ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు.. ఇది ఇలాగే కొనసాగాలి.. తన చుట్టూ ఏం జరుగుతుందనేది అనవసరం.. తన లక్ష్యంపైనే దృష్టి కేంద్రీకరించాలి.. అతని మనస్సుకు అనిపించింది చేసుకుంటూ ముందుకు సాగాలి. నా అనుభవం ప్రకారం చెబుతున్నా..ఇంకా పరుగులు సాధించు.. ఎక్కడా సంతృప్తి చెందకు.. బౌలర్లకు 10 వికెట్లు తీయాలని ఎలా ఉంటుందో.. బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సాధించాలని అలాగే ఉంటుంది.. అయితే బ్యాట్స్‌మెన్‌కు ఎన్ని పరుగులు చేసినా దాహం తీరదు.. కోహ్లీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. కాబట్టి బ్యాట్స్‌మెన్‌గా నువ్వు ఎప్పుడూ సంతోషపడు.. కానీ సంతృప్తి చెందకు అని సచిన్ సలహా ఇచ్చాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘నేను ఐశ్వర్యరాయ్ కుమారుడిని’! తండ్రి ఎవరు? అంటే చెప్పడం లేదు కానీ, TNN | Updated: Dec 30, 2017, 12:37PM IST ఒకవైపు తను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురుని, శోభన్ బాబు నా తండ్రి.. అంటూ కొంతమంది పిటిషన్లు వేస్తున్నారు. జయలలిత కూతురుని అంటూ ఒకామె తెరపైకి రాగా, మరో వ్యక్తి జయలలిత కుమారుడిని అంటూ వచ్చి కోర్టు చేత చీవాట్లు తిని వెళ్లాడు. జయలలిత మరణించారు కాబట్టే ఇలాంటి వాళ్లంతా తెరపైకి వస్తున్నారని స్పష్టం అవుతోంది. కేవలం జయలలిత విషయంలోనే కాదు.. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ కి కూడా అలాంటి తలనొప్పులే తగులుకుంటున్నట్టున్నాయి. తను ఐశ్వర్యరాయ్ కుమారుడిని అంటూ ఒక యువకుడు వార్తల్లోకి వచ్చాడు. సంగీత్ రాయ్ అనే మంగళూరు యువకుడు ఈ ప్రకటన చేశాడు. తన తల్లి ఐశ్వర్యరాయ్ అని ఇతడు అంటున్నాడు.
0business
Team  india తొలి టెస్టు గెలిస్తే టీమిండియాకు 6.50 కోట్ల ప్రైజ్‌మనీ న్యూఢిల్లీ: నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 23న పూణేలో తొలి టెస్టు ఆరంభం కానుంది.ఆసీస్‌తో జరుగనున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే జట్టు ఖాతాలో 6.50 కోట్లు జమవుతాయి.కేవలం ఒక్క టెస్టు గెలిస్తే ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము జవ అవుతుందా? అంటే నిజమే.ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతుంది.తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టును గెలిస్తే ఈ సీజన్‌లో కోహ్లీ సేన తన నంబర్‌ వన్‌ ర్యాంకుని నిలబెట్టుకుంది.టెస్టుల్లో నంబర్‌ వన్‌గా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) ఒక గదతో పాటు పది లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ బహుమతిగా ఇస్తుంది. దీనికి ఏప్రిల్‌ 1 కటాఫ్‌ డేట్‌. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే ఆ కటాప్‌ సమయానికి టీమిండియా నంబర్‌ వన్‌గా ఉంటుంది.తద్వారా టీమిండియాకు పది లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం టెస్టు ర్యాంకుల్లో రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు కూడా ప్రైజ్‌మనీపై కన్నేసింది.అయితే ప్రైస్‌ మనీ దక్కాలంటే ఆస్ట్రేలియా భారత పర్యటనలో సిరీస్‌ను 3-0తో గెలువాల్సి ఉంటుంది.ప్రస్తుతం టీమిండియా ఫామ్‌ను చూస్తుంటే ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా 19 టెస్టుల్లో విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక స్వదేశంలో గత 20 టెస్టు లుగా టీమిండియా పరాజయాన్ని ఎదుర్కోలేదు. కోహ్లీ కూడా వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్‌ సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా 3-0తో గెలవడం అనేది అసాధ్యం.మరోవైపు ఆస్ట్రేలియాకు ఉపఖండంలో మంచి రికార్డు లేదు.ఇటీవలే శ్రీలంక పర్యటనను పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా0-3తో టెస్టు సిరీస్‌ను ఘోరంగా ఓడిపోయింది.ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా 2-1తో పరాజయం చెందింది.దీంతో ఆస్ట్రేలియా జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ’పారా’ దిగ్గజం.. దేవేంద్ర జఝారియా బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పారాలంపిక్స్ లో భారత పారా అథ్లెట్లు పోటీ పడనున్నారు. TNN | Updated: Sep 5, 2016, 01:25PM IST బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పారాలంపిక్స్ లో భారత పారా అథ్లెట్లు పోటీ పడనున్నారు. రియో వెళ్తున్న బృందంలో భారత దిగ్గజ పారా అథ్లెట్ దేవేంద్ర జఝారియా కూడా ఉన్నారు. దీంతో ఈసారి భారత్ మరిన్ని పతకాలు సాధించవచ్చని భావిస్తున్నారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన ఈ 35 ఏళ్ల జావెలిన్ త్రోవర్.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు. దేవేంద్ర ఈసారి భారత్‌ను కచ్చితంగా పతకాల పట్టికలో నిలబెడతాడని అంటున్నారు. పారాలంపిక్స్ లో భారత్ నుంచి బంగారు పతకాలు సాధించిన ఇద్దరిలో దేవేంద్ర ఒకడు. అంతేకాకుండా జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పాడు. దక్షిణ కొరియాలో 2002లో జరిగిన ఫెస్పిక్ (FESPIC) గేమ్స్, 2004 ఏథెన్స్ పారాలంపిక్స్, 2013 ఐపీసీ అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ల్లో దేవేంద్ర స్వర్ణ పతకాలు సాధించాడు. అలాగే 2015 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌, 2014 ఆసియా క్రీడల్లో రజతాలు గెలుపొందాడు. 2013 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఈయన సాధించిన బంగారు పతకమే ఈ ఈవెంట్‌లో భారత్‌కు మొదటిది. చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదంలో తన చేయిని కోల్పోయినా దృఢ సంక‌ల్పం, ఆత్మవిశ్వాసంతో దేవేంద్ర ఈ స్థాయికి చేరుకున్నాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులన్నప్పటికీ తన శక్తి, సామర్థ్యాలను నమ్ముకుని ముందుకు సాగాడు.. ఎన్నో విజయాలందుకున్నాడు. ‘నాకు ఎనిమిదేళ్ల వయసప్పుడు విద్యుక్ షాక్ తగిలింది. మా గ్రామంలో చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు హై టెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకున్నాను. ఫలితంగా నా ఎడమ చేతిని కోల్పోయాను. నేను మళ్లీ కోలుకుంటానని ఎవరూ ఊహించలేదు‘ అని ఓ ఇంటర్వ్యూలో దేవేంద్ర చెప్పారు. ప్రస్తుతం ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆర్‌డీ సింగ్ వద్ద దేవేంద్ర శిక్షణ పొందుతున్నాడు. దేవేంద్రకు 2012లో పద్మశ్రీ అవార్డు లభించింది.
2sports
చిరు, నాగ్, వెంకీ ఒకే వేదికపై.. బాలయ్య మిస్సింగ్. అందుకేనా? Highlights హైదరాబాద్ లో గ్రాండ్ గా చైతూ సామ్ ల వివాహ వేడుక వేడుకకు హాజరై జంటను ఆశీర్వదించిన మెగాస్టార్ చైతూ,,సమంతల రిసెప్షన్ కు హాజరు కాని నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా వున్న టాప్ నలుగురు ఎవరో తెలుగు వాళ్లందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలంటే టాప్ ఫోర్ హీరోలుగా మనందరికీ తెలుసు. ఈ హీరోలంతా సంక్రాంతి రేసులో పడితే... అభిమానులకు రేసులు, ప్రేక్షకులకు వినోదం.. అబ్బో తెలుగు హీరోల్లో ఈ నలుగురు హీరోలు టాప్ లేపేసారు. ఇక ఈ నలుగురు హీరోలు ఒకే వేదికపై సందడి చేస్తే... అబ్బో ప్రేక్షకులకు కన్నుల విందే. అయితే నలుగురు కాకున్నా ముగ్గురు మాత్రం ఈ ఆదివారం ఒకే వేదికపై సందడి చేశారు. అదే నాగచైతన్య, సమంత వివాహ రిసెప్షన్ వేడుక.   కానీ ఇదే వేదిక నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం మరోసారి తెరమీదకు తెచ్చింది. నవంబర్ 12న జరిగిన నాగ చైతన్య, సమంత పెళ్లి రిసెప్షన్‌కు తెలుగు, తమిళ సినిమా ప్రముఖులందరూ తరలివచ్చారు. అయితే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలో కనిపించకపోవడంతో మళ్లీ వీళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది.   టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు చాలా సన్నిహితంగా మెలిగేవారు. కుటుంబ పరంగానూ, ఫ్యాన్స్ పరంగానూ ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకొన్నారు. వీళ్ల వారసులు నాగార్జున, బాలకృష్ణ కూడా చాలా కాలం అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. పలు వేదికలపై కలిసి కనిపించారు. అయితే కొన్ని రోజులుగా నాగ్, బాలయ్యల మధ్య విబేధాల వల్లే ఎక్కడా వేదిక పంచుకోవట్లేదని.. అందుకే ఇప్పుడు నాగచైతన్య, సమంతల రిసెప్షన్ కు కూడా రాలేదని ఫిలిం సర్కిల్లో చర్చ జరుగుతోంది.   బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు నెలకొనడానికి కారణం చాలా చిన్నదని, కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో తనకు తగిన ప్రాధాన్యతనివ్వలేదని బాలయ్య నొచ్చుకొన్నారట. అప్పటినుంచి వారిమధ్య అలా మొదలైన విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్టు చెప్పుకొంటారు. అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు కూడా బాలయ్య రాకపోవడంపైనా అప్పట్లో బాగానే చర్చ జరిగింది.   ఇక తాజాగా చైతూ, సామ్ రిసెప్షన్‌లో నందమూరి హరికృష్ణ కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. ఇక వెంకీ చైతూకు మేనమామేనాయె. ఐతే బాలయ్య కూడా వస్తాడని అంతా ఆశించారు. కానీ ఆయన రాకపోవడం వల్ల మళ్లీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చైసామ్ రిసెప్షన్‌కు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబుతోపాటు చాలా మంది ఇండస్ట్రీ నుంచి రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాలయ్య హాజరుకాకపోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే బాలయ్య వ్యక్తిగత పనుల వల్లే రాలేకపోయాడని ఆయన సన్నిహితుల మాట. అసలు విషయం పెరుమాళ్లకెరుక. Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
చౌక స్మార్ట్‌ఫోన్‌ యోచన లేదు: సోనీ  నవతెలంగాణ- వాణిజ్య విభాగం స్మార్ట్‌ఫోన్ల విభాగంలో పోటీ అంతకంతకు పెరుతున్నప్పటికీ మార్కెట్లో చౌక స్మార్ట్‌పోన్లను తీసుకురావడం ద్వారా మరింతగా విస్తరించాలనే యోచనేది తమకు లేదని ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ సోనీ ఇండియా వెల్లడించింది. స్మార్ట్‌పోన్లలో ప్రీమియం ఉత్పత్తులకే తాము ప్రాధాన్యతనిస్తున్నట్లుగా సోనీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెనిచిరొ హిబి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చౌక ధరల స్మార్ట్‌ఫోన్ల విభాగంలోకి ప్రవేశించే యోచనలో లేదని తెలిపారు. తమది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్లోబల్‌ కంపెనీ అని పేర్కొన్నారు. ఈ ఏడాది సోనీ ఇండియా అన్ని విభాగాల అమ్మకాల్లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తోందన్నారు. వచ్చే పండుగ సీజన్‌లో ఏకంగా 40 శాతం పెరుగుదల ఆశిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 25 సోనీ షోరూంలు కలిగి ఉన్నామన్నారు. మొత్తం తమ వ్యాపారంలో ఈ రెండు రాష్ట్రాలు 15 శాతం వాటాను కలిగి ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 250 స్టోర్లు కలిగి ఉన్నామన్నారు. ప్రతి ఏడాది వీటి సంఖ్యను 10 శాతం మేర పెంచుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 15, Sep 2018, 11:29 AM IST Highlights టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కోలీవుడ్ కి వెళ్లి అక్కడ తారలపై కూడా కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ని ఆమె టార్గెట్ చేసిన ప్రతిసారి అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కోలీవుడ్ కి వెళ్లి అక్కడ తారలపై కూడా కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ని ఆమె టార్గెట్ చేసిన ప్రతిసారి అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ పవన్ పై కామెంట్స్ చేయడం మాత్రం మానడం లేదు శ్రీరెడ్డి. తాజాగా సైదాబాద్ లో బేకరీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తనను రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, అయితే తనకు ఆసక్తి లేదని తెలిపింది. సోషల్ మీడియాలో తను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని కన్ఫర్మ్ చేసింది. ఇక పవన్ ని టార్గెట్ చేస్తూ.. ఏపీలో రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఓటమి తప్పదని, కేవలం మూడు, నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం కావొచ్చని అన్నారు.   Last Updated 19, Sep 2018, 9:26 AM IST
0business
gold రూ.30 నుంచి రూ.50వేలలోపే కొనుగోళ్లు ముంబయి: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా కొనుగోళ్లు ఎక్కువగా 30,000 నుంచి రూ.50వేల వరకే పరిమితం అయ్యాయి. అయితే కస్టమర్లు మాత్రం 50-60శాతం పెరిగి నట్లు తేలింది. గత ఏడాదితో పోలిస్తే 30శాతం పెరిగిందని బులియన్‌ నిపుణులు అంచనాలు వేస్తు న్నారు. ప్రపంచ పసిడి మండలి ఎండి సోమసుం దరం పిఆర్‌ మాట్లాడుతూ ఈసారి ట్రేడింగ్‌, కస్ట మర్లలో కూడా కొనుగోళ్ల వైఖరి పటిష్టంగా ఉందని, బులియన్‌రంగం క్రమేపీ ఊపందుకుందని అన్నారు. పెద్దనోట్ల రద్దు మందగమ నం నుంచి పెరుగుతూ వచ్చిందన్నారు. ఇక జిఎస్‌టి అమలయితే ఏవిధంగా ఉం టుందో పరిశీలించాల్సి ఉం టుందని సోమసుందరం వెల్ల డించారు. గత ఏడాది అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు 17 టన్నుల వరకూ ఉన్నాయని థామ్సన్‌ ర్యూటర్స్‌ అంచనా వేసింది. వీటి విలువ ఐదువేల కోట్లుగా ఉంది. మలబార్‌గ్రూప్‌ హెడ్‌ అషర్‌ మాట్లాడుతూ ఈరోజు మంచి డిమాండ్‌ ఉంది. గత ఏడాదితో పోలిస్తే 30శాతం పెరిగిందన్నారు. చిన్నమొత్తాల్లో కొను గోళ్లు భారీగా ఉన్నాయన్నారు. అయితే బంగారం ధరలు కూడా గత ఏడాదికంటే తక్కువగా ఉన్నా యి. అంతర్జాతీయ మార్కెట్లలో పదిశాతం పెరిగిం ది. అయితే భారత్‌ ధరలు మాత్రం కేవలం 3.7 శాతం మాత్రమే పెరిగాయి. యుపి తదితర ఉత్తరా ది రాష్ట్రాల్లో అయితే గత ఏడాది కంటే 25శాతం పెరిగిందని అంచనావేస్తున్నారు. ఇక ధరల విష యానికి వస్తే 2013 మే 13వ తేదీ పదిగ్రాములు 26,985రూపాయలుంటే 2014 మే 2వ తేదీ 29,970రూపాయలుగాఉంది. అదే 2015 ఏప్రిల్‌ 21వ తేదీ అయితే 27వేలుగా కొనసాగింది. 2016 మే9వ తేదీ 29,855గా ఉన్నబంగారం ఈ ఏడాది పదిగ్రాములు 28,925 రూపాయలుగా ఉంది.
1entertainment
Feb 17,2017 సామాజిక సేవలో ఎస్‌బీహెచ్‌ హైదరాబాద్‌లోని సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫ్‌ర్‌ అసోసియేషన్‌ సైదాబాద్‌ వారికి ఎస్‌బీహెచ్‌ కార్పొరేట్‌ సామాజిక సేవలో భాగంగా ఫిజియోథెరఫి యూనిట్‌ను అందజేసింది. ఈకార్యక్రమంలో ఎస్‌బీహెచ్‌ జీఎం వి.త్యాగరాజన్‌. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టరు బి.జనార్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మహేశ్ బాబు ఫస్ట్ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా..? Highlights దీన్ని పటాపంచలు చేస్తూ 'మహర్షి' అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. సింపుల్ షర్ట్ అండ్ జీన్స్ వేసుకొని గడ్డంతో ల్యాప్ టాప్ పట్టుకొని నడిచి వస్తున్న మహేశ్ లుక్ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇదొక బ్రాండ్ అనే చెప్పాలి. 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా పరిచయమై సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన మహేశ్ నేడు 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సంధర్భంగా ఆయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి. అదే ఆయన సినిమా ఫస్ట్ లుక్. దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేశ్ గడ్డం పెంచి సరికొత్త లుక్ తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కొన్నిరోజులుగా సినిమా టైటిల్ అంటూ ఆన్ లైన్ లో 'రిషి' అనే పేరు చక్కర్లు కొట్టింది. ఇది సినిమాలో మహేశ్ పేరా..?లేదంటే సినిమా టైటిలా..? అనే సందేహం నెలకొంది. దీన్ని పటాపంచలు చేస్తూ 'మహర్షి' అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. సింపుల్ షర్ట్ అండ్ జీన్స్ వేసుకొని గడ్డంతో ల్యాప్ టాప్ పట్టుకొని నడిచి వస్తున్న మహేశ్ లుక్ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. బ్యాక్ గ్రౌండ్ లో స్మార్ట్ సిటీ, పల్లెటూరు కనిపిస్తున్న దాని బట్టి ఇది రూరల్ అండ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా మహేశ్ కొంత సమయం పాటు స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  Embarking on my new journey as RISHI. #MAHARSHI pic.twitter.com/xiAylLc2ND — Mahesh Babu (@urstrulyMahesh) August 8, 2018 Last Updated 9, Aug 2018, 12:36 AM IST
0business
స్టార్ హీరో బిచ్చమెత్తుకున్నాడట! Highlights బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి  బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రన్ బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రన్ బీర్ నటనకు గాను ప్రశంసలు దక్కాయి. ట్రైలర్ ను బట్టి ఈ సినిమాలో సంజయ్ దత్ డ్రగ్స్ కు అలవాటు పడటం, అక్రమ ఆయుధాలు, జైలు శిక్ష ఇలా చాలా విషయాలను ప్రస్తావించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రన్ బీర్ కపూర్ రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఇది నిజంగానే సంజయ్ దత్ జీవితంలో జరిగిందని చిత్రబృందం చెబుతోంది. సంజయ్ డ్రగ్స్ కు అలవాటు పడటంతో చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే అక్కడ రిహాబ్ సెంటర్ నుండి తప్పించుకు పారిపోయి తన స్నేహితుల ఇంటికి చేరుకోవడం కోసం అక్కడ రోడ్లపై డబ్బుల కోసం బిచ్చమెత్తుకున్నారట. సరిగ్గా ఇదే విషయాన్ని పోస్టర్ పై రాసి రన్ బీర్ కపూర్ ఫోటోను విడుదల చేశారు. ఆయన జీవితం ఎన్నో ఒడుదొడుకులతోకూడుకున్నదని, కొన్ని విషయాలు నమ్మలేని విధంగా ఉంటాయని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ట్వీట్ చేశారు.  Sanju’s journey is marked by many ups and downs. Some moments suspend you into disbelief. See these postcards i.. Every image a story.. a story unbelievable but true... #BelieveItOrNot #Sanju #RanbirKapoor @FoxStarHindi @VVCFilms #RajkumarHiraniFilms pic.twitter.com/aonv8f6DDT — Rajkumar Hirani (@RajkumarHirani) June 14, 2018 Last Updated 14, Jun 2018, 6:44 PM IST
0business